IPL 2027: ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ కొనసాగించాల్సిందే: ఆర్‌సీబీ కోచ్
వివాదాస్పదంగా మారిన ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌ను కొనసాగించాల్సిందేనని ఆర్‌సీబీ బ్యాటింగ్ కోచ్, మెంటార్ దినేశ్ కార్తీక్ అన్నాడు. ఈ రూల్ కారణంగా ఆల్‌రౌండర్లకు నష్టం జరుగుతుందనే వాదనను అంగీకరించిన కార్తీక్.. ఐపీఎల్ 2027 సీజన్ ముగిసే వరకు కొనసాగించాల్సిందేనని అభిప్రాయపడ్డాడు.
మెగా వేలం తర్వాత తీసుకొచ్చిన ఈ నిబంధనను సైకిల్ పూర్తికాకుండానే తొలగించడం సరికాదన్నాడు. తాజాగా ఓ ఇంటర్వూలో ఈ రూల్‌పై ప్రత్యేకంగా మాట్లాడిన దినేశ్ కార్తీక్.. తదుపరి మెగా వేలం వరకు ఎలాంటి మార్పులు చేయవద్దని సూచించాడు. ప్రతీ జట్టు ఈ రూల్‌ను దృష్టిలో పెట్టుకొని ఆటగాళ్లను కొనుగోలు చేసిందనే విషయాన్ని గుర్తు చేశాడు.
హఠాత్తుగా రూల్ తీసేయడం సరికాదు..
'ఐపీఎల్ 2025 మెగా వేలం తర్వాత జట్లు ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌ను దృష్టిలో ఉంచుకునే తమ కాంబినేషన్‌ను ఎంచుకున్నాయి. ఇప్పుడు హఠాత్తుగా ఈ రూల్‌ను తొలగిస్తే.. కొన్ని జట్లకు అన్యాయం జరుగుతుంది. 12 మంది ఆటగాళ్లతో వ్యూహాలు రచించిన జట్ల కన్నా.. 11 మందితో బలంగా ఉండే జట్లకు ఈ మార్పు ప్రయోజనం చేకూరుస్తుంది. అందుకే ఈ సైకిల్ ముగిసే వరకు ఈ రూల్‌ను కొనసాగించడమే సరైనది.

ఈ రూల్ వచ్చిన కొత్తలో హై-స్కోరింగ్ మ్యాచ్‌లు, హోరాహోరీ ఛేజింగ్‌లతో ఆసక్తికరంగా అనిపించింది. కానీ గత సీజన్‌లో ఆ జోరు కనిపించలేదు. చాలా మ్యాచ్‌లు ఏకపక్షంగా ముగిసాయి. ఈ రూల్ దాని ప్రాభావాన్ని కోల్పోయింది. ముఖ్యంగా ఈ రూల్ కారణంగా భారత జట్టుకు నాణ్యమైన ఆల్ రౌండర్లు లభించే అవకాశాలు లేకుండా పోయాయి.
ఫ్రాంచైజీల అభిప్రాయం కోరిన బీసీసీఐ
వాస్తవానికి ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌ను కూడా సైకిల్ మధ్యలోనే తీసుకొచ్చారు. ఇప్పుడు దానిని మళ్లీ మధ్యలోనే తీసేయడం సరి కాదు. అందుకే 2027 వరకు దీనిని కొనసాగించి, ఆ తర్వాత ఈ రూల్‌పై సమీక్ష జరపడం ఉత్తమం. ఏదైనా కొత్త నిబంధనను సైకిల్ ఆరంభంలోనే తీసుకురావాలి.'అని దినేశ్ కార్తీక్ చెప్పుకొచ్చాడు.
భారత క్రికెట్ దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతో పాటు అనేకమంది ఈ ఇంపాక్ట్ రూల్‌ను వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. దాంతో ఈ రూల్‌పై బీసీసీఐ సమీక్ష చేపట్టింది. 10 ఫ్రాంచైజీల అభిప్రాయాలను కోరింది. ఐపీఎల్ 2027 మినీ వేలానికి ముందు ఈ రూల్ కొనసాగించడంపై స్పష్టత రానుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


