Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2027: ముంబై ఇండియన్స్‌లోకి శ్రేయస్ అయ్యర్!

పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్.. ఆ జట్టును వీడేందుకు సిద్దమయ్యాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ ఆఫర్ చేయడంతో శ్రేయస్ అయ్యర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

పంజాబ్ కింగ్స్ మేనేజ్‌మెంట్ తీరు నచ్చకనే అయ్యర్.. ఆ జట్టును వీడేందుకు సిద్దమయ్యాడని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఆ జట్టు ఫీల్డింగ్ కోచ్ బ్రాడ్ హడిన్, బౌలింగ్ కోచ్ జేమ్స్ హోప్స్ జట్టును వీడారు. హెడ్ కోచ్ రికీ పాంటింగ్ కూడా జట్టును వీడుతాడనే ప్రచారం జరుగుతోంది.

IPL 2027: సీఎస్‌కే హెడ్ కోచ్ జహీర్ ఖాన్ నియామకం వెనుక ధోనీ!

IPL 2027: సీఎస్‌కే హెడ్ కోచ్ జహీర్ ఖాన్ నియామకం వెనుక ధోనీ!

అయ్యర్ కోసం ముంబై ఆసక్తి..

పంజాబ్ కింగ్స్ ఓనర్స్ మధ్య ఉన్న విభేదాలు జట్టుపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని, ఈ విషయంలో పాంటింగ్, అయ్యర్ అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది. మరోవైపు ముంబై ఇండియన్స్ కొత్త కెప్టెన్ కోసం అన్వేషణ మొదలు పెట్టింది. హార్దిక్ పాండ్యా సారథ్యంలో ముంబై ఇండియన్స్ ఆశించిన రీతిలో రాణించకపోవడంతో జట్టు ఘోర పరాజయాలను చవిచూసింది.

IPL 2027 Punjab Kings Captain Shreyas Iyer Likely to Join Mumbai Indians Reports Claim

ఈ క్రమంలోనే ప్రస్తుత భారత టీ20 కెప్టెన్‌గా ఉన్న శ్రేయస్ అయ్యర్‌ను జట్టులోకి తీసుకొని సారథ్య బాధ్యతలు అప్పగించాలనే యోచనలో అంబానీ టీమ్ ఉన్నట్లు సమాచారం. శ్రేయస్ అయ్యర్ స్వస్థలం కూడా ముంబై కావడంతో ఆ జట్టులోకి వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నాడట. ముంబై ఇండియన్స్‌లో చేరితో రోహిత్ శర్మ తరహాలో ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్‌ను సొంతం చేసుకోవచ్చని, గుర్తింపు కూడా భిన్నంగా ఉంటుందని అతను భావిస్తున్నాడట.

IPL 2027: పంజాబ్ కింగ్స్‌కు బిగ్ షాక్.. ఇద్దరు కోచ్‌లు రాజీనామా!

Also Read

IPL 2027: పంజాబ్ కింగ్స్‌కు బిగ్ షాక్.. ఇద్దరు కోచ్‌లు రాజీనామా!

వేలంలో కొనుగోలు చేసేందుకు..

ఐపీఎల్ 2027 మినీ వేలానికి ముందే అయ్యర్‌ను జట్టులోకి తీసుకునేందుకు ముంబై ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. వీలైతే ట్రేడ్ డీల్ ద్వారా లేదంటే వేలంలో కొనుగోలు చేయాలనే యోచనలో ముంబై ఇండియన్స్ ఉన్నట్లు సమాచారం. మరోవైపు శ్రేయస్ అయ్యర్‌ను వదులుకునేందుకు పంజాబ్ కింగ్స్ సుముఖంగా లేనట్లు తెలుస్తోంది.

అతనికి బదులుగా స్టార్ ఆటగాళ్లను కోరుతున్నట్లు సమాచారం. ఏది ఏమైనా నవంబర్ 15 తర్వాత ఈ వ్యవహారంపై క్లారిటీ రానుంది. రిటెన్షన్, రిలీజ్ జాబితాలను ప్రకటించేందుకు నవంబర్ 15 బీసీసీఐ డెడ్‌లైన్‌గా విధించింది. డిసెంబర్‌లో ఐపీఎల్ 2027 మినీ వేలం జరగనుంది.

Story first published: Friday, October 9, 2026, 12:08 [IST]
Other articles published on Oct 9, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+