ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు పంజాబ్ కింగ్స్‌కు బిగ్ షాక్ తగిలింది. సరిగ్గా మినీ వేలానికి ముందే ఇద్దరు కోచ్‌లు రాజీనామా చేశారు. ఫీల్డింగ్ కోచ్ బ్రాడ్ హడిన్, బౌలింగ్ కోచ్ జేమ్స్ హోప్స్ జట్టును వీడారు. గతేడాది సాయిరాజ్ బహుతులే టీమిండియా బౌలింగ్ కోచ్‌గా వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. దాంతో పంజాబ్ కింగ్స్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్‌కు కొత్త కోచ్‌లను ఎంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఐపీఎల్ 2027 సీజన్ మినీ వేలానికి సంబంధించిన రిటెన్షన్ ప్రక్రియకు బీసీసీఐ నవంబర్ 15 డెడ్‌లైన్‌గా విధించింది. ఈ తేదీలోపు రిటెన్షన్, రిలీజ్ జాబితాలను ఫ్రాంచైజీలు ప్రకటించాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో కోచ్‌లు రాజీనామా చేయడం పంజాబ్ కింగ్స్ ప్రణాళికలపై ప్రభావం చూపనుంది.

మరోవైపు పంజాబ్ కింగ్స్ జట్టులో భారీ మార్పులు జరగనున్నట్లు తెలుస్తోంది. ఆ జట్టు సారథి శ్రేయస్ అయ్యర్‌ను ముంబై ఇండియన్స్ తీసుకొని సారథ్యం అప్పగించే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. రికీ పాంటింగ్ కూడా జట్టును వీడుతాడని క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి.
ఈ ఏడాది చివర్లో ఐపీఎల్ మినీ వేలం జరగనుంది. గత సీజన్‌లో పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్స్ చేరకుండానే ఇంటిబాట పట్టింది. అంతకుముందు ఎడిషన్‌లో ఫైనల్ చేరినా.. ఆర్‌సీబీ చేతిలో ఓటమిపాలైంది. పంజాబ్ కింగ్స్ ఓనర్స్ మధ్య ఉన్న విభేదాలు జట్టుపై తీవ్ర ప్రభావం చూపుతుందని ప్రచారం జరుగుతుంది.
మినీ వేలానికి సమయం సమీపిస్తున్న నేపథ్యంలో ఫ్రాంచైజీలు కోచ్‌ల కోసం వేట మొదలుపెట్టాయి. ఇప్పటికే సీఎస్‌కే, ఢిల్లీ క్యాపిటల్స్ తమ హెడ్ కోచ్‌లను నియమించుకున్న సంగతి తెలిసిందే. ఢిల్లీ హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీని నియమించగా.. సీఎస్‌కే హెడ్ కోచ్‌గా జహీర్ ఖాన్ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే.




