IPL 2027: ఆ ముగ్గురిపై వేటు వేసిన ముంబై ఇండియన్స్!
ఐపీఎల్ 2027 సీజన్ మినీ వేలానికి ముందు ముంబై ఇండియన్స్ కీలక ప్రకటన చేసింది. తమ కోచింగ్ స్టాఫ్‌లోని ముగ్గురు వ్యక్తులకు వీడ్కోలు పలుకుతున్నట్లు గురువారం ఓ ప్రకటనలో వెల్లడించింది. బౌలింగ్ కోచ్ లసిత్ మలింగాతో పాటు పరాస్ మాంబ్రే, కార్ల్ హప్‌కిన్సన్‌లకు ఉద్వాసన పలికింది. ఈ ముగ్గురు జట్టుకు అందించిన సేవలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపింది.
ఇటీవలే ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ పదవి బాధ్యతల నుంచి మహేళ జయవర్దనే తప్పుకున్న సంగతి తెలిసిందే. అతని స్థానంలో బ్యాటింగ్ కోచ్ అయిన కీరన్ పోలార్డ్‌కు హెడ్ కోచ్‌గా ప్రమోషన్ ఇచ్చింది. ఇప్పుడు సపోర్ట్ స్టాఫ్‌లోని ముగ్గురు కీలక వ్యక్తులను తొలగించి.. కొత్త కోచ్‌లను నియమించడంపై ముంబై ఇండియన్స్ ఫోకస్ పెట్టింది.

ఐపీఎల్ 2024 సీజన్‌కు ముందు లసిత్ మలింగా ముంబై ఇండియన్స్ జట్టులో చేరగా.. పరాస్ మాంబ్రే 2025 సీజన్‌కు ముందు జట్టులో చేరాడు. అంతకుముందు 2010-17 వరకు ముంబై జట్టుకు మాంబ్రే సేవలు అందించాడు. 'లసిత్ మలింగా, పరాస్ మాంబ్రే, కార్ల్ హప్‌కిన్సన్‌లు ముంబై జట్టుకు అందించిన సేవలకు హృదయపూర్వక కృతజ్ఞతలు. వారి నిబద్దత, జట్టులో వారు సృష్టించిన జ్ఞాపకాలు ఎప్పటికీ ముంబై జట్టు ప్రయాణంలో భాగంగా ఉంటాయి.'అని ముంబై ఇండియన్స్ తమ ప్రకటనలో పేర్కొంది.
2013, 2015, 2017, 2019, 2020లో ఐదు సార్లు విజేతగా నిలిచిన ముంబై ఇండియన్స్.. ఆరో టైటిల్ కోసం గత 6 ఏళ్లుగా నిరీక్షిస్తోంది. ఈ క్రమంలోనే ఐపీఎల్ 2027 సీజన్‌లో టైటిల్ గెలవడమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది. ఈ క్రమంలోనే కోచింగ్ స్టాఫ్‌ను ప్రక్షాళన చేసింది. వేలానికి ముందు జట్టులో కూడా మార్పులు చేసే అవకాశం ఉంది. ఐపీఎల్ 2027 మినీ వేలం డిసెంబర్ 16 గోవాలో జరగనుండగా.. ఆటగాళ్ల రిటెన్షన్ జాబితాలను ప్రకటించేందుకు నవంబర్ 15ను డెడ్‌లైన్‌గా విధించారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


