Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అమరావతిలో IPL 2027 మినీ వేలం!

ఐపీఎల్ 2027 సీజన్ నిర్వహణపై భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఫోకస్ పెట్టింది. ఈ క్యాష్ రిచ్ లీగ్‌ ఏర్పాట్లకు సంబంధించిన బ్లూ ప్రింట్‌ను సిద్దం చేస్తోంది. మంగళవారం ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశమైంది. ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఐపీఎల్ 2027 మినీ వేలాన్ని భారత్‌లోనే నిర్వహించాలని బోర్డు నిర్ణయించింది. ఫ్రాంచైజీల కోరిక మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వచ్చిన వార్తలను ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధూమల్ ధ్రువీకరించారు.

IND vs WI: 8 మంది ఆటగాళ్లపై వేటు.. భారత వన్డే జట్టులో భారీ మార్పులు!

IND vs WI: 8 మంది ఆటగాళ్లపై వేటు.. భారత వన్డే జట్టులో భారీ మార్పులు!

'ప్రతీ ఏడాది ఐపీఎల్ వేలం కార్యక్రమం భారత్‌లోనే నిర్వహించాలని అనుకుంటాం. కానీ అక్టోబర్-డిసెంబర్ భారత్‌లో పెళ్లిళ్ల సీజన్ కావడంతో 100 రూమ్స్‌తో కూడిన ఫైవ్ స్టార్ హోటల్స్ దొరకడం కష్టమవుతుంది. కానీ ఈ సారి మాత్రం ఐపీఎల్ వేలం భారత్‌లోనే జరుగుతుంది. మినీ వేలం కావడంతో వేదిక లభిస్తుందనే ఆశిస్తున్నాం.'అని ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ మీడియాకు తెలిపారు.

IPL 2027 Mini-Auction Andhra Cricket Association Seeks Hosting Rights for Amaravati

మూడేళ్ల తర్వాత..

గత మూడేళ్లుగా ఐపీఎల్ వేలాన్ని విదేశాల్లో నిర్వహించారు. దుబాయ్, జెడ్డా, అబుదాబి వేదికగా గత మూడు ఐపీఎల్ వేలాలు జరిగాయి. భారత్‌లో చివరిసారిగా కొచ్చిలో ఐపీఎల్ 2023 వేలం నిర్వహించారు. విదేశాల్లో వేలం నిర్వహించడం వల్ల తమ టీమ్ ప్రతినిధి బృందాలను అక్కడికి పంపడంలో కార్యచరణ, లాజిస్టికల్ విషయాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఫ్రాంచైజీలు ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం.

అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు భారత్‌లో పెళ్లిళ్ల సీజన్ కావడంతో..ఫైవ్-స్టార్ హోటళ్ల లభ్యత ఆధారంగానే మినీ వేలం వేదికను ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఖరారు చేయనుంది. ఐపీఎల్ మినీ వేలం కోసం బీసీసీఐకి 100 కంటే ఎక్కువ రూమ్స్ కావాలి. నవంబర్ చివరి వారం లేదా.. డిసెంబర్ తొలి వారంలో ఐపీఎల్ 2027 మినీ వేలాన్ని నిర్వహించే అవకాశం ఉంది.

IND vs AFG 3rd T20I: భారత తుది జట్టులో 3 మార్పులు.. వైభవ్ సూర్యవంశీకి చోటు!

Also Read

IND vs AFG 3rd T20I: భారత తుది జట్టులో 3 మార్పులు.. వైభవ్ సూర్యవంశీకి చోటు!

అమరావతిలో మినీ వేలం..

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఐపీఎల్ 2027 మినీ వేలం జరిగేలా ఆ రాష్ట్ర ప్రభుత్వం పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఆ రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ఇప్పటికే ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ACA) ప్రెసిడెంట్, టీడీపీ ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) ద్వారా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. మినీ వేలానికి కావాల్సిన ఏర్పాట్ల బాధ్యత తమదేనని, అమరావతిలో మినీ వేలం నిర్వహించాలని బీసీసీఐ పెద్దలను కోరినట్లు తెలుస్తోంది.

అమరావతిలో ఐపీఎల్ 2027 మినీ వేలం జరిగితే తమ రాజధానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభిస్తుందని ఆ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

కొచ్చిలో డబ్ల్యూపీఎల్ 2027 వేలం..

మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) 2027 సీజన్‌కు ముహుర్తం ఖరారైంది. ఈ టోర్నీని జనవరి 14 నుంచి ఫిబ్రవరి 27 వరకు నిర్వహించనున్నట్లు బీసీసీఐ బుధవారం ప్రకటించింది. ఐదు ఫ్రాంచైజీలు తమ రిటైన్, రిలీజ్ ఆటగాళ్ల జాబితాలను ప్రకటించేందుకు సెప్టెంబర్ 28 డెడ్‌లైన్‌గా పేర్కొంది. అక్టోబర్ 29న కొచ్చి వేదికగా డబ్ల్యూపీఎల్ 2027 వేలం జరిగే అవకాశం ఉంది. పురుషుల వేలం కూడా అక్కడే జరగొచ్చని జాతీయ మీడియా పేర్కొంది.

Story first published: Thursday, September 17, 2026, 11:50 [IST]
Other articles published on Sep 17, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+