Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs AFG 3rd T20I: భారత తుది జట్టులో 3 మార్పులు.. వైభవ్ సూర్యవంశీకి చోటు!

అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న మూడు టీ20 సిరీస్‌లో టీమిండియా ఆఖరి పోరుకు సిద్దమైంది. నేడు(గురువారం) ఢిల్లీ వేదికగా జరిగే చివరి టీ20లో ఆతిథ్య అఫ్గాన్‌తో టీమిండియా అమీతుమీ తేల్చుకోనుంది. ఇప్పటికే ఈ సిరీస్‌ను టీమిండియా 2-0తో గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఆఖరి టీ20లోనూ విజయం సాధించి సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేయాలనే పట్టుదలతో టీమిండియా ఉండగా.. కనీసం ఈ మ్యాచ్‌లోనైనా గెలవాలనే పట్టుదలతో అఫ్గానిస్థాన్‌ ఉంది.

IND vs WI: నో హార్దిక్, పంత్.. వెస్టిండీస్‌తో వన్డే, టీ20 సిరీస్‌లకు జట్లను ప్రకటించిన బీసీసీఐ!

IND vs WI: నో హార్దిక్, పంత్.. వెస్టిండీస్‌తో వన్డే, టీ20 సిరీస్‌లకు జట్లను ప్రకటించిన బీసీసీఐ!

ఇప్పటికే సిరీస్ గెలిచిన నేపథ్యంలో భారత తుది జట్టులో మార్పులు జరిగే అవకాశం ఉంది. ఆసియా గేమ్స్‌‌కు ముందు ఆటగాళ్లకు తగిన ప్రాక్టీస్ అందించేందుకు ఆఖరి టీ20లో బెంచ్ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వనున్నారు. రెండో టీ20 అనంతరం శ్రేయస్ అయ్యర్ కూడా ఇదే విషయాన్ని వెల్లడించాడు. బెంచ్ ఆటగాళ్లకు అవకాశం ఇస్తామని తెలిపాడు.

IND vs AFG 3rd T20I Vaibhav Sooryavanshi In Jasprit Bumrah Rested as India Make 3 Big Changes to Playing XI

తుది జట్టులోకి వైభవ్ ..

తొలి రెండు టీ20ల్లో బెంచ్‌కే పరిమితమైన వైభవ్ సూర్యవంశీ.. తుది జట్టులోకి రానున్నాడు. తొలి రెండు టీ20ల్లో అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ రాణించారు. కానీ వైభవ్‌కు అవకాశం ఇచ్చేందుకు అభిషేక్ శర్మకు విశ్రాంతినిచ్చే అవకాశం ఉంది. గాయం నుంచి కోలుకొని తొలి రెండు మ్యాచ్‌ల్లో నాలుగేసి ఓవర్లు బౌలింగ్ చేసిన జస్‌ప్రీత్ బుమ్రాకు వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా విశ్రాంతినివ్వనున్నారు.

బుమ్రా స్థానంలో యువ పేసర్ యశ్ ఠాకూర్‌ను తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. బౌలింగ్ కాంబినేషన్‌ దెబ్బతినకుండా ఉండేందుకు శివమ్ దూబే స్థానంలో మూడో మార్పుగా ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌ను జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. పవర్ ప్లే‌లో కచ్చితంగా బౌలింగ్ చేయగల వాషింగ్టన్ సుందర్ రాక బౌలింగ్‌ను మరింత బలోపేతం చేస్తుంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో భారత తుది జట్టులో చోటు దక్కించుకోని వైభవ్ సూర్యవంశీ.. వాషింగ్టన్, సుందర్, యశ్ ఠాకూర్‌లకు మూడో టీ20లో ఆడే అవకాశం ఉంది.

IPL 2027 మినీ వేలం.. బీసీసీఐ కీలక నిర్ణయం!

Also Read

IPL 2027 మినీ వేలం.. బీసీసీఐ కీలక నిర్ణయం!

అఫ్టానిస్తాన్‌తో మూడో టీ20కి భారత్ తుది జట్టు:

సంజు శాంసన్ (వికెట్ కీపర్), వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, యశ్ ఠాకూర్.

Story first published: Thursday, September 17, 2026, 9:43 [IST]
Other articles published on Sep 17, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+