Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అది జరగాలంటే క్రికెట్ పేరు మార్చాలి : రికీ పాంటింగ్

అగ్రరాజ్యం అమెరికాలో క్రికెట్‌‌కు ఆదరణ పెరగాలంటే పేరు మార్చాలని ఐసీసీకి ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ సలహా ఇచ్చాడు. క్రికెట్‌ను టీ20 అనే పిలవాలని సూచించాడు. అమెరికాలో క్రికెట్‌కు ఆదరణ కల్పించేందుకు ఐసీసీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఒక అమెరికన్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ‌లో రికీ పాంటింగ్ ఒక సాహసోపేతమైన ఆలోచనతో ముందుకు వచ్చాడు.

పేరు మార్చాలి..

'ఈ ఆటకు అమెరికాలో ప్రజాదరణ కల్పించాలంటే.. క్రికెట్ అనే పేరును పక్కన పెట్టాలి. క్రికెట్‌ను పూర్తిగా టీ20 అనే ప్రచారం చేయాలి. సాంప్రదాయ దేశాల్లోని యువత క్రికెట్ పేరు వినగానే.. అది ఐదు రోజుల పాటు జరిగే ఆట అని అనుకుంటారు. కాబట్టి అమెరికన్లను ఆకట్టుకోవాలంటే ఆ దేశంలో ప్రసిద్ది చెందిన బెస్‌ బాల్ ఆటతో పోల్చి ప్రచారం చేయాలి. బేస్ బాల్ ఆటలో హోమ్ రన్ కొట్టడం చాలా కష్టం. కానీ టీ20ల్లో ఒక్కో మ్యాచ్‌కు 15 సిక్సర్లు కొట్టవచ్చని అక్కడి పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలి.'అని రికీ పాంటింగ్ సూచించాడు.

Ricky Ponting Says Don t Call It Cricket to Make T20 Popular in the United States Of America

అమెరికా పెద్ద మార్కెట్..

అమెరికా ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా మార్కెట్. అక్కడ బేస్‌బాల్, బాస్కెట్‌బాల్, అమెరికన్ ఫుట్‌బాల్ అత్యంత ప్రజాదరణ పొందిన క్రీడలు. ఇప్పటి వరకు అక్కడ క్రికెట్‌ను ఎక్కువగా ఆసియా, యూరోపియన్, ఆఫ్రికన్ వలసదారులు మాత్రమే చూసేవారు. అమెరికా ప్రజలను ఆకర్షించేందుకు ఐసీసీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది.

ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2024 టోర్నీని అక్కడే నిర్వహించింది. మేజర్ టీ20 లీగ్ కూడా జరుగుతుంది. 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ కోసం ఐసీసీ ప్రత్యేక స్టేడియాలను కూడా అభివృద్ధి చేస్తోంది. అమెరికన్ మేజర్ లీగ్ టోర్నీలో వాషింగ్టన్ ఫ్రీడమ్ జట్టుకు హెడ్ కోచ్‌గా పాంటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.

Story first published: Saturday, September 5, 2026, 14:28 [IST]
Other articles published on Sep 5, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+