Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2026 బెస్ట్ టీమ్.. ముంబై, సీఎస్‌కే నుంచి ఒక్కడు లేడు!

ఐపీఎల్ 2026 సీజన్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లతో టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా బెస్ట్ టీమ్‌ను ప్రకటించాడు. తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా ఈ వివరాలను వెల్లడించాడు. అయితే ఈ టీమ్‌లో ముంబై, సీఎస్‌కే, లక్నో, ఢిల్లీ, పంజాబ్ కింగ్స్ నుంచి ఒక్క ఆటగాడు కూడా చోటు దక్కించుకోలేదు.

ఐపీఎల్ 2026 ఛాంపియన్ ఆర్‌సీబీ నుంచి అత్యధికంగా ఐదుగురు ఆటగాళ్లు, సన్‌రైజర్స్ నుంచి ముగ్గురు, రాజస్థాన్ రాయల్స్‌ నుంచి ఇద్దరు, గుజరాత్, కేకేఆర్ నుంచి ఒక్కో ప్లేయర్‌ ఎంపికయ్యారు. తన బెస్ట్ టీమ్‌లో ఆటగాళ్లను ఎంపిక చేయడానికి గల కారణాలను ఆకాష్ చోప్రా వెల్లడించాడు.

ఓపెనర్లుగా వైభవ్ సూర్యవంశీ, విరాట్ కోహ్లీ

'వైభవ్ సూర్యవంశీ.. ఇతని గురించి ఎలాంటి చర్చలు అనవసరం. ఆరెంజ్ క్యాప్ అతని దగ్గరే ఉంది. అతనికి దక్కని ఏకైక అవార్డు అత్యధిక ఫోర్లు మాత్రమే. మిగతా అన్ని అవార్డులను ఒక పెద్ద బ్యాగ్‌లో సర్దుకొని, ఎక్సెస్ బ్యాగేజ్ అలవెన్స్‌తో పట్టుకెళ్లాడు. ఈ టోర్నీలో మిగతా ఆటగాళ్లంతా అతన్ని చూసే దూకుడుగా బ్యాటింగ్ చేశారు.

అతనికి తోడుగా మరో ఓపెనర్ విరాట్ కోహ్లీ. ఓపెనర్‌గా విరాట్ కోహ్లీకి పెద్ద రికార్డు లేకున్నా.. ఫైనల్ మ్యాచ్‌లో అతను కనబర్చిన ప్రదర్శన అమూల్యమైనది. క్వాలిఫయర్-1లో, ఫైనల్లో అతను అద్భుతంగా రాణించాడు. ఒత్తిడిని తట్టుకునే అతని సామర్థ్యం సాటిలేనిది. మిగతా వారందరూ ఎక్కడో ఒకచోట తమ బలహీనతలను చూపిస్తారు.

IPL 2026 Aakash Chopra Picks His Best XI Snubs Stars From MI CSK DC and PBKS

మిడిలార్డర్‌లో ఇషాన్, రజత్ పాటిదార్

నెం.3 స్థానంలో ఇషాన్ కిషన్‌ను ఎంపిక చేస్తాను. దేవదత్ పడిక్కల్ పేరును కూడా పరిశీలించాను. కానీ ఇషాన్ కిషన్ అసాధారణ ప్రదర్శన కనబర్చాడు. అంతేకాకుండా అతనే ఈ బెస్ట్ టీమ్‌కు వికెట్ కీపర్, వైస్ కెప్టెన్ కూడా. ఎందుకంటే సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించినంత కాలం అతను చాలా బాగా రాణించాడు.

నెంబర్ 4లో రజత్ పాటిదార్‌ను తీసుకున్నా. అంతేకాకుండా ఈ బెస్ట్ టీమ్‌కు అతనే కెప్టెన్. ఎందుకంటే అతని కంటే మెరుగైన కెప్టెన్ మరొకరు లేరు. అతను ఇప్పటికే దిగ్గజాల జాబితాలో తన పేరును చేర్చుకున్నాడు.

ఫినిషర్స్‌గా క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి..

నెంబర్ 5లో హెన్రీచ్ క్లాసెన్‌ను తీసుకున్నాను. క్లాసెన్ లేకుండా ఈ జట్టును అస్సలు ఊహించలేను. అతని బ్యాటింగ్ అద్భుతం. ఈ టోర్నీ చరిత్రలోనే ఆరెంజ్ క్యాప్ గెలిచిన ఏకైక మిడిలార్డర్ బ్యాటర్‌గా నిలిచేందుకు దగ్గరగా వచ్చాడు. దురదృష్టవశాత్తు దాన్ని అందుకోలేకపోయాడు.

నెంబర్ 6లో నితీష్ కుమార్ రెడ్డిని తీసుకుంటా. క్లాసెన్‌కు అతను సరైన జోడీ. అంతేకాకుండా మంచి ఆల్‌రౌండర్. ఈ టోర్నీలో బాగా రాణించిన ఏకైక ఆల్‌రౌండర్ నితీష్ రెడ్డినే. హార్దిక్ పాండ్యా దారుణంగా విఫలమయ్యాడు. కామెరూన్ గ్రీన్ కూడా అంచనాలను అందుకోలేకపోయాడు.

నెం.7 స్థానంలో ఒక పక్కా బ్యాటర్ అవసరం కాబట్టి, కృనాల్ పాండ్యాను ఎంచుకున్నాను. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడల్లా ఆదుకున్నాడు. బౌలింగ్, బ్యాటింగ్‌లోనూ రాణించాడు. ఇంత బాగా రాణించినా అతనికి ఒక్క ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు రాకపోవడం విచారకరం.

నెంబర్ 8లో సునీల్ నరైన్ తీసుకున్నా. రషీద్ ఖాన్ పేరు పరిశీలించినా.. నేను ఒకే ఒక్క స్పిన్నర్‌ను ఎంచుకోవాలనుకున్నాను. నెంబర్ 9లో భువనేశ్వర్ కుమార్‌ను తీసుకున్నా. అతని విషయంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. బంతితో అద్భుతంగా రాణించాడు. తృటిలో పర్పుల్ క్యాప్ కోల్పోయాడు. నెంబర్ 10లో పర్పుల్ క్యాప్ కగిసో రబాడా తీసుకున్నాడు. నెంబర్ 11లో జోఫ్రా ఆర్చర్.. నెంబర్ 12లో రసిక్ దార్ సలామ్‌ను ఎంచుకున్నా.

ఆకాశ్ చోప్రా అత్యుత్తమ టీమ్:

వైభవ్ సూర్యవంశీ(RR), విరాట్ కోహ్లీ(RCB), ఇషాన్ కిషన్(SRH), రజత్ పాటిదార్(RCB), హెన్రీచ్ క్లాసెన్(SRH), నితీష్ కుమార్ రెడ్డి(SRH), కృనాల్ పాండ్యా(RCB), సునీల్ నరైన్(KKR), భువనేశ్వర్ కుమార్(RCB), కగిసో రబాడ(GT), జోఫ్రా ఆర్చర్(RR), రసిక్‌ధార్ సలామ్(RCB).

Story first published: Tuesday, June 2, 2026, 19:16 [IST]
Other articles published on Jun 2, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+