Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2027: పంజాబ్ కింగ్స్‌లోకి హార్దిక్ పాండ్యా..ముంబైలోకి అర్ష్‌దీప్ సింగ్!

ఐపీఎల్ 2027 సీజన్ మినీ వేలానికి ముందు పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య అదిరిపోయే ట్రేడ్ డీల్ జరిగినట్లు తెలుస్తోంది. ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా‌.. పంజాబ్ కింగ్స్ జట్టులోకి వెళ్లడం దాదాపు ఖాయమైనట్లు క్రీడా వర్గాలు పేర్కొన్నాయి.

హార్దిక్ పాండ్యాకు బదులుగా పంజాబ్ కింగ్స్ తమ స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్, యువ బ్యాటర్ విష్ణు వినోద్‌ను ఇచ్చేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరిని తీసుకునేందుకు ముంబై ఇండియన్స్ కూడా సముఖంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ట్రేడ్ డీల్ పూర్తి అయిందని మరికొద్ది గంటల్లోనే అధికారిక ప్రకటన వెలువడనుందని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలపై ఇప్పటి వరకు ఐపీఎల్ నిర్వాహకుల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన అయితే వెలువడలేదు.

IPL 2027: పంజాబ్ కింగ్స్‌లోకి హార్దిక్ పాండ్యా? ముంబైలోకి ఆ ఇద్దరు మ్యాచ్ విన్నర్లు!

IPL 2027: పంజాబ్ కింగ్స్‌లోకి హార్దిక్ పాండ్యా? ముంబైలోకి ఆ ఇద్దరు మ్యాచ్ విన్నర్లు!
IPL 2027 Hardik Pandya Could Join Punjab Kings as Mumbai Indians Explore Arshdeep Singh Trade Report

మరోవైపు ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ కూడా స్పందించలేదు. ఫ్రాంచైజీతో విభేదాల కారణంగా హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్‌ను వీడతారని కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రచారాన్ని ముంబై ఇండియన్స్ గతంలో ఖండించింది. హార్దిక్ పాండ్యా జట్టులోనే కొనసాగుతాడని పేర్కొంది.

ఐపీఎల్ 2027 సీజన్‌లో సారథ్య బాధ్యతలను రోహిత్ శర్మకు తిరిగి ఇవ్వాలని ముంబై ఇండియన్స్ నిర్ణయించినట్లు కూడా వార్తలు వచ్చాయి. యువ ప్లేయర్ తిలక్ వర్మ పేరును రోహిత్ శర్మ సూచించినా.. ఈ ఒక్క సీజన్‌‌లో జట్టును నడిపించాలని రోహిత్ ఒప్పించినట్లు ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్లుగానే ముంబై ఫ్రాంచైజీ కూడా సోషల్ మీడియాలో ఓ హింట్ ఇచ్చింది.

తమ కెప్టెన్ రోహిత్ శర్మనే అనే విషయాన్ని పరోక్షంగా వెల్లడించింది. మరోవైపు పంజాబ్ కింగ్స్‌లోకి వెళ్లినా హార్దిక్ పాండ్యా ఆటగాడిగానే కొనసాగే అవకాశం ఉంది. అతనికి కెప్టెన్సీ ఇచ్చే అవకాశం లేదు. ఇప్పటికే శ్రేయస్ అయ్యర్ సారథిగా జట్టును అద్భుతంగా నడిపిస్తున్నాడు.

IND vs NZ: యశస్వి జైస్వాల్ భారీ శతకం.. డ్రాగా ముగిసిన మ్యాచ్!

Also Read

IND vs NZ: యశస్వి జైస్వాల్ భారీ శతకం.. డ్రాగా ముగిసిన మ్యాచ్!

ఐపీఎల్ 2026 సీజన్‌ చివర్లో గాయంతో ఆటకు దూరమైన హార్దిక్ పాండ్యా.. మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టలేదు. ప్రస్తుతం బీసీసీఐ సెంట్రల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో రిహాబిలిటేషన్ తీసుకుంటున్నాడు. మరోవైపు పంజాబ్ కింగ్స్ మోహ్‌సిన్ ఖాన్ కోసం లక్నో సూపర్ జెయింట్స్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

Story first published: Tuesday, November 3, 2026, 13:01 [IST]
Other articles published on Nov 3, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+