IPL 2027: మైక్ హస్సీతో పాటు ఆ ఐదుగురు కోచ్‌లపై సీఎస్‌కే వేటు..!
ఐపీఎల్ 2027 సీజన్ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే) కీలక నిర్ణయం తీసుకుంది. తమ కోచింగ్ విభాగాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసింది. సుదీర్ఘ కాలం హెడ్ కోచ్‌గా సేవలందించిన స్టీఫెన్ ఫ్లేమింగ్ ఇప్పటికే తప్పుకోగా.. తాజాగా సపోర్ట్ స్టాఫ్‌లోని ఐదుగురు కోచ్‌లపై కూడా వేటు వేసింది. గత 8 ఏళ్లుగా జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా సేవలందించిన మైక్‌హస్సీతో పాటు బౌలింగ్ కోచ్ ఎరిక్ సమిన్స్ సహా సపోర్ట్ స్టాఫ్ మొత్తాన్ని తొలిగించింది. ఈ విషయాన్ని సీఎస్‌కేనే అధికారికంగా ప్రకటించింది.
మైక్ హస్సీ, ఎరిక్ సైమన్స్‌లతో పాటు ఫీల్డింగ్, అసిస్టెంట్ బ్యాటింగ్ కోచ్ రాజీవ్ కుమార్, హెడ్ ఫిజియోథెరపిస్ట్ టామీ సిమ్సెక్, ఫిట్‌నెస్ కోచ్ గ్రెగ్ కింగ్‌లకు సీఎస్‌కే జట్టు వీడ్కోలు పలికింది. 2008 నుంచి ఆటగాడిగా.. 2018 నుంచి 2026 వరకు బ్యాటింగ్ కోచ్‌గా సేవలందించిన మైక్ హస్సీకి సీఎస్‌కే యాజమాన్యం ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపింది.'ఎల్లో జెర్సీలో మీ అంకితభావం అపారమైనది. ఒకసారి సూపర్ కింగ్స్ అయితే ఎప్పటికీ సూపర్ కింగే'అనే క్యాప్షన్‌తో మైక్ హస్సీకి వీడ్కోలు పలికింది.

స్టీఫెన్ ప్లేమింగ్ స్థానంలో టీమిండియా మాజీ పేసర్ జహీర్ ఖాన్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. అతనికి అనుకూలంగా ఉండే సపోర్ట్ స్టాఫ్‌ను నియమించుకునే అవకాశం ఉంది. సర్రే కౌంటీ కోచ్ గారెత్ బ్యాటీ అసిస్టెంట్ కోచ్‌గా.. భారత మాజీ పేసర్ మోహిత్ శర్మ బౌలింగ్ కోచ్‌గా నియమితులవుతారని ప్రచారం జరుగుతోంది. కొత్త కోచ్‌ల వివరాలను నేడు వెల్లడించే అవకాశం ఉంది.
గత మూడు సీజన్లుగా పేలవ ప్రదర్శన కనబర్చిన సీఎస్‌కేను తిరిగి విజయాల బాట పట్టించేందుకే ఈ ప్రక్షాళన చేపట్టినట్లు తెలుస్తోంది. హెడ్ కోచ్ నుంచి సహాయక సిబ్బంది వరకు నూతన టీమ్‌తో సీఎస్‌కే ఐపీఎల్ 2027 మినీ వేలానికి వెళ్లనుంది. ఈ మార్పులు సీఎస్‌కే అభిమానుల్లో అంచనాలను పెంచుతున్నాయి.
సీఎస్‌కే చివరిసారిగా ఐపీఎల్ 2023 సీజన్‌లో టైటిల్ గెలిచింది. ఐపీఎల్ 2024లో తృటిలో ప్లే ఆఫ్స్ బెర్త్ కోల్పోయిన సీఎస్‌కే.. ఐపీఎల్ 2025 సీజన్‌లో అట్టడుగు స్థానంలో నిలిచింది. ఐపీఎల్ 2026 సీజన్‌లో 8వ స్థానంతో సరిపెట్టుకుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


