Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2027: ముంబై ఇండియన్స్ గెలవాలంటే అతనికే కెప్టెన్సీ ఇవ్వాలి: అశ్విన్

ఐపీఎల్ 2027 సీజన్‌లో ముంబై ఇండియన్స్ విజయాల బాట పట్టాలంటే తిరిగి రోహిత్ శర్మకు సారథ్య బాధ్యతలు అప్పగించాలని టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సూచించాడు. రోహిత్ శర్మ సారథ్యంతోనే ముంబై ఇండియన్స్ గాడిన పడగలదని అభిప్రాయపడ్డాడు.

ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా ఉన్న హార్దిక్ పాండ్యా ఐపీఎల్ 2027 సీజన్ మినీ వేలానికి ముందు ట్రేడింగ్ ద్వారా ఇతర జట్లలోకి వెళ్లే అవకాశం ఉంది. దాంతో ముంబై తదుపరి కెప్టెన్ ఎవరా? అనేది తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారంపై తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా మాట్లాడిన అశ్విన్.. రోహిత్ శర్మకు తిరిగి సారథ్య బాధ్యతలు అప్పగించాలని ముంబై మేనేజ్‌మెంట్‌కు సూచించాడు.

'రోహిత్ శర్మకు తిరిగి సారథ్య బాధ్యతలు అప్పగించడం ముంబై ఇండియన్స్‌కే మంచిది. వారికున్న జట్టుతో గత సీజన్‌లో ముంబై ప్లే ఆఫ్స్ చేరకపోవడం ఆశ్చర్యానికి గురిచేసింది. ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మను తమ కెప్టెన్‌గా ప్రకటించాలి. ఎందుకంటే అతను ముంబై ఇండియన్స్‌కు పెద్దన్నలాంటివాడు. కుటుంబ పెద్దలా జట్టును నడిపిస్తాడు. కాబట్టి అతను కెప్టెన్ అయితే ముంబైకే మంచిది.'అని అశ్విన్ అభిప్రాయపడ్డాడు.

R Ashwin Says Mumbai Indians Should Appoint Rohit Sharma as Captain Ahead of IPL 2027

2013 సీజన్ మధ్యలో రికీ పాంటింగ్ నుంచి సారథ్య బాధ్యతలు అందుకున్న రోహిత్ శర్మ.. అదే ఏడాది జట్టుకు తొలి టైటిల్ అందించాడు. 2013 అక్టోబర్‌లో జరిగిన ఛాంపియన్స్ లీగ్‌లోనూ ముంబైని విజేతగా నిలబెట్టాడు. అతని సారథ్యంలో ముంబై 2013తో పాటు 2015, 2017, 2019, 2020 సీజన్లలో వరుసగా టైటిల్స్ గెలిచింది.

ఈ ఐపీఎల్ సక్సెస్‌తోనే అతనికి టీమిండియా సారథ్య బాధ్యతలు దక్కాయి. విరాట్ కోహ్లీ నుంచి 2021లో సారథ్య బాధ్యతలు అందుకున్న రోహిత్.. 2024 టీ20 ప్రపంచకప్‌తో పాటు 2025 ఛాంపియన్స్ ట్రోఫీని గెలిపించాడు. 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్‌కు చేర్చాడు.

టీమ్ భవిష్యత్తు కోసమని ఐపీఎల్ 2024 సీజన్‌లో రోహిత్ శర్మను తప్పించిన ముంబై ఇండియన్స్.. హార్దిక్ పాండ్యాను గుజరాత్ టైటాన్స్ నుంచి ట్రేడ్ చేసుకొని మరి సారథ్య బాధ్యతలు అప్పగించింది. గుజరాత్ టైటాన్స్‌కు ఒక టైటిల్‌తో పాటు రన్నరప్‌గా నిలబెట్టిన హార్దిక్ పాండ్యా.. ముంబై ఇండియన్స్ తరఫున మాత్రం తేలిపోయాడు. వరుసగా మూడు సీజన్లలో ఒకే ఒక్కసారి ప్లే ఆఫ్స్ చేర్చాడు.

Story first published: Monday, October 26, 2026, 18:56 [IST]
Other articles published on Oct 26, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+