IPL 2027 మినీ వేలం.. బీసీసీఐ కీలక నిర్ణయం!
అప్‌కమింగ్ ఐపీఎల్ 2027 మినీ వేలాన్ని భారత్‌లోనే నిర్వహించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) నిర్ణయించినట్లు తెలుస్తోంది. మంగళవారం జరిగిన ఐపీఎల్ గవర్నింగ్ సమావేశంలో తీసుకున్న ప్రధాన నిర్ణయం ఇదేనని ప్రచారం జరుగుతోంది. గత మూడేళ్లుగా ఐపీఎల్ వేలాన్ని విదేశాల్లో నిర్వహించారు. దుబాయ్, జెడ్డా, అబుదాబి వేదికగా గత మూడు ఐపీఎల్ వేలాలు జరిగిన సంగతి తెలిసిందే. భారత్‌లో చివరిసారిగా కొచ్చిలో ఐపీఎల్ 2023 వేలం నిర్వహించారు.
మళ్లీ ఇన్నాళ్లకు భారత్‌లోనే ఐపీఎల్ 2027 మినీ వేలం నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఫ్రాంచైజీల రిక్వెస్ట్‌తోనే బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. విదేశాల్లో వేలం నిర్వహించడం వల్ల తమ టీమ్ ప్రతినిధి బృందాలను అక్కడికి పంపడంలో ఎదురయ్యే కార్యచరణ, లాజిస్టికల్ ఇబ్బందుల నేపథ్యంలో ఫ్రాంచైజీలు ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

గతేడాది అబుదాబిలో జరిగిన ఐపీఎల్ 2026 వేలం సందర్భంగా బీసీసీఐ సభ్యులు ఫ్రాంచైజీల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నారని, దాంతో ఈ ఏడాది వేలాన్ని భారత్‌లో నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఎప్పటిలాగానే.. ఫ్రాంచైజీలు, వారి ప్రతినిధి బృందాలకు వసతి లభ్యతను బట్టి వేదికను ఖరారు చేయనున్నారు.
అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు భారత్‌లో పెళ్లిల సీజన్ కావడంతో..ఫైవ్-స్టార్ హోటళ్ల లభ్యత ఆధారంగానే నగరాన్ని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఎంపిక చేయనుంది. ఐపీఎల్ మినీ వేలం కోసం బీసీసీఐకి 100 కంటే ఎక్కువ రూమ్స్ కావాలి. నవంబర్ చివరి వారం లేదా.. డిసెంబర్ తొలి వారంలో ఐపీఎల్ 2027 మినీ వేలాన్ని నిర్వహించే అవకాశం ఉంది.
దక్షిణాది రాష్ట్రాలను బీసీసీఐ పరిగణనలోకి తీసుకుంటే.. బెంగళూరు, చెన్నై, కొచ్చి, హైదరాబాద్‌తో పాటు వైజాగ్, అమరావతి నగరాలు రేసులో ఉండనున్నాయి. జమ్మూ కశ్మీర్‌లో ఐపీఎల్ వేలం నిర్వహించాలనే ప్రతిపాదన కూడా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఇప్పటికే ఆయా రాష్ట్రాలకు చెందిన క్రికెట్ అసోసియేషన్స్.. తమ నగరంలో ఐపీఎల్ వేలం నిర్వహించేాలా పావులు కదుపుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా చూసే ఐపీఎల్ మినీ వేలం తమ నగరాల్లో జరిగితే గ్లోబల్‌గా గుర్తింపు లభిస్తుందని ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు భావిస్తున్నాయి. దాంతోనే వేదిక ఖరారు వ్యవహారంలో తీవ్ర పోటీ నెలకొంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


