Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

6 నెలల్లో 41 మ్యాచ్‌లు.. IPL 2027 వరకు టీమిండియా షెడ్యూల్ ఇదే..!

శ్రీలంక‌తో టెస్ట్ సిరీస్ అనంతరం టీమిండియా ఆటగాళ్లకు చిన్నపాటి విరామం లభించింది. కానీ వచ్చే 6 నెలల్లో టీమిండియా ఆటగాళ్లకు తీరికలేని షెడ్యూల్ ఉంది. అప్‌కమింగ్ ఐపీఎల్ 2027 సీజన్ వరకు వచ్చే ఐదు నెలల్లో టీమిండియా 41 మ్యాచ్‌లు ఆడనుంది. ఇందులో ఏడు టెస్ట్‌లు, 14 వన్డేలు, 20 టీ20లు ఉన్నాయి.

పాకిస్థాన్‌ను చూసి ఈ ప్రపంచం నవ్వుతుంది: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్

పాకిస్థాన్‌ను చూసి ఈ ప్రపంచం నవ్వుతుంది: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్

వచ్చే ఆదివారం(సెప్టెంబర్ 13) నుంచి టీమిండియా మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టనుంది. సొంతగడ్డపై అఫ్గానిస్థాన్‌తో మూడు టీ20ల సిరీస్ ఆడనున్న టీమిండియా.. అనంతరం మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్‌ల కోసం వెస్టిండీస్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. ఓవైపు వెస్టిండీస్ సొంతగడ్డపై సిరీస్ ఆడుతుండగానే.. మరోవైపు శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని మరో జట్టు ఆసియా గేమ్స్ ఆడనుంది.

Team India to Play 41 International Matches Including 7 Tests Before IPL 2027 Full Schedule Revealed

అక్టోబర్ చివర్లో న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనున్న భారత్ అక్కడ రెండు టెస్ట్‌లు, ఐదు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది. ఈ పర్యటన అనంతరం శ్రీలంక 3 వన్డేలు, 3 టీ20ల కోసం భారత్‌కు రానుంది. ఈ మ్యాచ్‌లు డిసెంబర్‌లో జరగనున్నాయి. వచ్చే ఏడాది జనవరిలో జింబాబ్వే భారత్‌కు రానుండగా.. ఐదు టెస్ట్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియా భారత్ పర్యటనకు రానుంది. ఈ సిరీస్‌తో టీమిండియా అంతర్జాతీయ సీజన్ ముగియనుంది. ఫిబ్రవరి 27 వరకు ఈ సిరీస్ జరగనుండగా.. ఆ తర్వాత ఐపీఎల్ 2027 ప్రారంభం కానుంది.

సెప్టెంబర్ చివర్లో శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని భారత టీ20 జట్టు జపాన్ వేదికగా జరిగే ఆసియా గేమ్స్‌లో బరిలోకి దిగనుంది. అక్కడ భారత్ ఫైనల్ చేరితే మూడు మ్యాచ్‌లు ఆడనుంది. అంతేకాకుండా జపాన్‌తో ఓ చారిత్రాత్మక మ్యాచ్‌లో బరిలోకి దిగనుంది. తీరిక లేని షెడ్యూల్ నేపథ్యంలో ప్లేయర్స్ ఇంజ్యూరీ మేనేజ్‌మెంట్ బీసీసీఐకి సవాల్‌గా మారనుంది.

నా కెప్టెన్సీలో ఒక్క సిరీస్ ఓడిపోలేదు... డిప్రెషన్‌‌కు గురయ్యా: సూర్యకుమార్ యాదవ్

Also Read

నా కెప్టెన్సీలో ఒక్క సిరీస్ ఓడిపోలేదు... డిప్రెషన్‌‌కు గురయ్యా: సూర్యకుమార్ యాదవ్

ఆటగాళ్లను గాయాల బెడద నుంచి రక్షించుకునేందుకు రొటేషన్ పాలసీని పాటించే అవకాశం ఉంది. ఇటీవల జరిగిన బీసీసీఐ రివ్యూ మీటింగ్‌లో ఆటగాళ్ల గాయాల బెడద గురించి ప్రధానంగా చర్చించారు. ఆటగాళ్లకు తగిన విశ్రాంతి దొరికేలా ఏర్పాట్లు చేస్తామని చెప్పారు.

టీమిండియా తదుపరి షెడ్యూల్..

భారత్ X అఫ్గానిస్థాన్- 3 టీ20లు సెప్టెంబర్ 13-17

భారత్ X వెస్టిండీస్- 3 వన్డేలు, 5 టీ20లు సెప్టెంబర్ 27-అక్టోబర్ 16

జపాన్‌ X భారత్- ఏకైక టీ20 మ్యాచ్- సెప్టెంబర్ 22

ఆసియా గేమ్స్ 2026- 3 టీ20లు(ఫైనల్ చేరితే)-సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ -3

న్యూజిలాండ్ X భారత్- 2 టెస్ట్‌లు, 5 వన్డేలు, 5 టీ20లు- అక్టోబర్ 22-నవంబర్ 27

భారత్ X శ్రీలంక- 3 వన్డేలు, 3 టీ20లు- డిసెంబర్ 13-27

భారత్ X జింబాబ్వే- 3 వన్డేలు- జనవరి 3-7 (2027)

భారత్ X ఆస్ట్రేలియా- 5 టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ- జనవరి 21- ఫిబ్రవరి 27 (2027)

Story first published: Wednesday, September 9, 2026, 16:50 [IST]
Other articles published on Sep 9, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+