IPL 2027: కేకేఆర్ కెప్టెన్సీకి ఆ ఐదున్నర అడుగుల సిక్సర్ల వీరుడే సరైనోడు!
ఐపీఎల్ 2027 సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు కొత్త కెప్టెన్ రానున్నాడు. ఆ జట్టు సారథి అజింక్యా రహానే అన్ని ఫార్మాట్ల ఆటకు రిటైర్మెంట్ ప్రకటించడంతో కేకేఆర్‌కు నయా కెప్టెన్‌ను ఎంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు టైటిల్ అందించిన శ్రేయస్ అయ్యర్ జట్టు నుంచి తప్పుకోవడంతో అజింక్యా రహానే ఆ బాధ్యతలను స్వీకరించాడు. అతను రెండు సీజన్ల పాటు జట్టును నడిపించాడు. కానీ ఇప్పుడు అతను కూడా తప్పుకోవడంతో కొత్త కెప్టెన్‌ను వెతుక్కోవాల్సిన పరిస్థితి కేకేఆర్‌కు ఏర్పడింది.
అయితే కేకేఆర్‌కు కెప్టెన్‌గా బయటి ఆటగాడు అవసరం లేదని, జట్టులోనే ఉన్న ఐదున్నర అడుగుల సిక్సర్ల వీరుడు రింకూ సింగ్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించాలని టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. ఇటీవల ముగిసిన యూపీ టీ20 లీగ్‌లో తన మీరట్ మార్విక్స్ జట్టును విజేతగా నిలబెట్టాడని గుర్తు చేశాడు. ఐపీఎల్ 2018 నుంచి జట్టులో కొనసాగుతున్నాడని, అతనికంటే లాయలిటిగా ఉంటే ఆటగాడు మరొకరు ఉండరని తన యూట్యూబ్ ఛానెల్‌లో చెప్పుకొచ్చాడు.

'రింకూ సింగ్‌కు కెప్టెన్సీ అనుభవం ఉంది. కాకపోతే కెప్టెన్‌గా అతనికి రావాల్సిన అంత గుర్తింపు రాలేదు. కానీ ఒక కెప్టెన్‌కు ఉండాల్సిన అన్ని లక్షణాలు అతనిలో ఉన్నాయి. అందర్నీ కలుపుకుపోయే మనస్తత్వం అతనిది. నిరాడంబరమైన వ్యక్తి. మ్యాచ్ విన్నర్. మంచి ఆటగాడు. జట్టుకు దోహదపడేవాడు. ఈ లక్షణాలతో పాటు యూపీ టీ20 లీగ్‌లో కెప్టెన్‌గా తన జట్టును విజేతగా నిలబెట్టాడు. కెప్టెన్సీ తన ప్రదర్శనపై ఏ మాత్రం ప్రభావం చూపదని నిరూపించుకున్నాడు.
రింకూ సింగ్ తనకంటే జట్టుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు. అది అతనిలో ఉన్న మరో మంచి గుణం. అంతేకాకుండా అతని భుజాలపై చేయి వేసి మాట్లాడగలిగే అంతటి మంచి మనిషి. రింకూ సింగ్‌ను కేకేఆర్ తమ కెప్టెన్‌గా ఎంచుకోవాలి. ఇది నా వినయపూర్వకమైన అభిప్రాయం.'అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు.
ఐపీఎల్ 2018 సీజన్‌లో అరంగేట్రం చేసినా.. ఐపీఎల్ 2023 సీజన్‌లోనే రింకూ సింగ్ గుర్తింపు లభించింది. ఆ సీజన్‌లో అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రింకూ సింగ్ అద్భుతం చేశాడు. యశ్ దయాల్ వేసిన ఆఖరి ఓవర్‌లో వరుసగా 5 సిక్స్‌లు బాది కేకేఆర్‌కు చిరస్మరణీయమైన విజయాన్ని అందించాడు. ఈ ఇన్నింగ్స్‌తో రింకూ సింగ్‌కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


