IPL 2027: వెస్టిండీస్ కెప్టెన్‌పై కన్నేసిన ఆ రెండు ఫ్రాంచైజీలు!
భారత్ పర్యటనలో వెస్టిండీస్ కెప్టెన్ షై హోప్ దుమ్మురేపుతున్నాడు. మూడు వన్డేల సిరీస్‌లో వరుసగా రెండు శతకాలు నమోదు చేసిన షై హోప్.. టీ20 సిరీస్‌లోనూ అదే జోరు కొనసాగిస్తున్నాడు. రెండో వన్డేలో 45 బంతుల్లో 102, ఆఖరి వన్డేలో 143 బంతుల్లో 162 పరుగులు చేసిన షై హోప్.. మూడు టీ20ల సిరీస్‌లో వరుసగా 52, 102 నాటౌట్, 5 రన్స్‌తో రాణించాడు.
షైహోప్ బ్యాటింగ్‌కు ఫిదా అయిన ఐపీఎల్ ఫ్రాంచైజీలు అతన్ని జట్టులోకి తీసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి. భారత పిచ్‌లపై షై హోప్ అలవోకగా సిక్స్‌లు బాదడంతో ఐపీఎల్‌లో తమ జట్లలోకి తీసుకుంటే కలిసొస్తుందని భావిస్తున్నాయి. ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ షై హోప్‌తో సంప్రదింపులు జరిపినట్లు వార్తలు వచ్చాయి.
రేసులో లక్నో, గుజరాత్..
తాజాగా ఇదే విషయంపై టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడాడు. లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ అతని కోసం పోటీ పడే అవకాశం ఉందని చెప్పుకొచ్చాడు. ఓపెనర్ కమ్ వికెట్ కీపర్ కావాల్సిన జట్లు షైహోప్ కోసం పోటీపడుతాయని తెలిపాడు.
'షై హోప్ ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున మిడిలార్డర్‌లో ఆడేవాడు. అది అతనికి అనువైన బ్యాటింగ్ స్థానం కాదు. అతను మంచి ఓపెనర్. నేను అలానే చూస్తాను. కీపర్ కమ్ ఓపెనర్ అవసరం ఉన్న జట్లు ఏంటంటే..? లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్. లక్నో సూపర్ జెయింట్స్ రిషభ్ పంత్‌ను వదిలేసింది. నికోలస్ పూరన్‌ను కూడా వదిలేస్తే.. షై హోప్ మంచి ఆప్షన్ అవుతాడు.

గుజరాత్ టైటాన్స్ టామ్ బాంటన్‌ను వదిలేస్తే షై హోప్ మంచి ఆప్షన్ అవుతాడు. అప్పుడు జోస్ బట్లర్ మూడో స్థానంలో ఆడాల్సి ఉంటుంది. ఇది ఫ్రాంచైజీకి కాస్త ఇబ్బందే. కానీ షై హోప్ కోసం గుజరాత్ టైటాన్స్ బిడ్ వేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.'అని ఆకాష్ చోప్రా చెప్పుకొచ్చాడు.
సీఎస్ కూడా..
మరోవైపు విదేశీ ఓపెనర్ కోసం ఎదురు చూస్తున్న సీఎస్‌కే.. షై హోప్‌ను కొనుగోలు చేసే అవకాశం ఉంది. డెవాన్ కాన్వే తర్వాత ఆ జట్టుకు సరైన ఓపెనింగ్ కాంబినేషన్ లభించలేదు. సంజూ శాంసన్ జట్టులోకి వచ్చినా అతనికి అండగా రాణించే ఆటగాడు లేరు. ఈ క్రమంలోనే షై హోప్‌ను తీసుకునేందుకు సీఎస్‌కే ప్రయత్నించవచ్చు.
ఐపీఎల్ 2024 సీజన్‌లో షైహోప్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ అతని కనీస ధర రూ.75 లక్షలకు కొనుగోలు చేసింది. ఆ సీజన్‌లో 9 మ్యాచ్‌లు ఆడిన షైహోప్ 150 స్ట్రైక్‌రేట్‌తో 183 పరుగులే చేశాడు. ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు ఆ జట్టు వదిలేయగా.. గత రెండు సీజన్లలో అతను అన్‌సోల్డ్‌గా నిలిచాడు. తాజా బ్యాటింగ్ ప్రదర్శన నేపథ్యంలో ఐపీఎల్ 2027 మినీ వేలంలో అతని కోసం ఫ్రాంచైజీలు ఎగబడే అవకాశం ఉంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


