For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs West Indies: తొలి టెస్టుకు ముందు విండిస్‌కు ఊహించని దెబ్బ!

India vs West Indies: Keemo Paul ruled out of first Test, Miguel Cummins named replacement

హైదరాబాద్: ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భాగంగా వెస్టిండిస్ జట్టు తన తొలి టెస్టు మ్యాచ్‌ని కోహ్లీ నాయకత్వంలోని టీమిండియాతో ఆడనుంది. అయితే, తొలి టెస్టు ఆరంభానికి ముందు వెస్టిండిస్ జట్టు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. విండీస్‌ ఆల్‌ రౌండర్‌ కీమో పాల్‌ తొలి టెస్టుకు దూరమయ్యాడు.

అచ్చం స్మిత్‌లాగే: జోఫ్రా ఆర్చర్ వీడియో నవ్వులు పూయిస్తోంది!

ఎడమ చీలమండ గాయంతో కీమో పాల్‌ తొలి టెస్టుకు దూరమైనట్లు విండీస్‌ క్రికెట్‌ బోర్డు ఒక ప్రకటనలో పేర్కొంది. తొలి టెస్టుకు అతడి స్థానంలో పేసర్ మిగుల్ కమిన్స్‌కు సెలక్టర్లు చోటు కల్పించారు. ఈ విషయమై విండిస్ కోచ్ ఫ్లయిడ్ రయిఫెర్ మాట్లాడుతూ "కీమో పాల్ తొలి టెస్టుకు దూరమయ్యాడు. అతడి స్థానంలో మిగుల్ కమిన్స్‌ను ఎంపిక చేశాం. భారత్‌-ఏతో జరిగిన మ్యాచ్‌ల్లో కమిన్స​ ఆకట్టుకున్నాడు. మరొకవైపు నెట్స్‌లో కూడా ఎంతో పరిణిత కనబరిచాడు" అని వెల్లడించాడు.

28 ఏళ్ల మిగుల్ కమిన్స్ మూడేళ్ల క్రితం టీమిండియాతో జరిగిన మ్యాచ్‌ ద్వారా అంతర్జాతీయ టెస్టు అరంగేట్రం చేశాడు. సెయింట్‌ లూసియా వేదికగా జరిగిన ఆ మ్యాచ్‌లో కమిన్స్‌ 9 వికెట్లు సాధించాడు. రెండో ఇన్నింగ్స్‌లో 48 పరుగులే ఇచ్చి ఆరు వికెట్లతో అద్భుత ప్రదర్శన చేశాడు. ఇదే అతడి కెరీర్‌ అత్యుత్తమం.

వెస్టిండీస్ పర్యటనలో భాగంగా ఇప్పటికే టీ20, వన్డే సిరీస్‌లు కైవసం చేసుకున్న భారత్.. టెస్టు సిరీస్‌నూ సొంతం చేసుకోవాలని భావిస్తోంది. అసలు పోరుకు ముందు వెస్టిండీస్‌ ఎ జరిగిన మూడు రోజుల ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో భారత్‌ అన్ని విభాగాల్లో అదరగొట్టింది. ఇక గురువారం నుంచి రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ ప్రారంభం కానుంది.

కోహ్లీసేనతో ఒక్క మ్యాచ్ లేదు: ఇంగ్లాండ్ నెక్స్ట్ సీజన్ షెడ్యూల్ ఇదే!

ఈ నేపథ్యంలో తుది జట్టు కూర్పుపై తర్జనభర్జన పడుతోంది. తొలి టెస్టులో వన్డే వైస్ కెప్టెన్ రోహిత్‌ శర్మకు స్థానం కల్పించాలా? లేక టెస్టు వైస్‌ కెప్టెన్‌ అంజిక్య రహానేను ఆడించాలో? లేదా ఐదో బౌలర్‌ వైపు మొగ్గు చూపాలో? అని సతమతమవుతోంది. కెప్టెన్ విరాట్ కోహ్లీ ఐదుగురు బౌలర్ల కూర్పుతో బరిలో దిగాలనుకుంటే.. రహానే, రోహిత్లో ఒక్కరికే అవకాశం దక్కుతుంది.

ఫోటో ప్లీజ్: విండిస్‌తో తొలి టెస్టుకు భారత ఆటగాళ్లు ధరించే కొత్త జెర్సీ ఇదే

నలుగురు బౌలర్లతో బరిలోకి దిగితే ఇద్దరికీ తుది జట్టులో చోటు దక్కొచ్చు. ఇద్దరు ఉంటే.. స్పిన్నర్ రవీంద్ర జడేజాపై వేటు పడుతుంది. ఏదేమైనా తుది జట్టులో చోటు కోసం పోటీ ఎక్కువగా ఉన్న కారణంగా ఫామ్‌ లేమితో ఇబ్బంది పడుతున్న రహానేకు అవకాశం లభించకపోవచ్చని సమాచారం.

Story first published: Thursday, August 22, 2019, 13:18 [IST]
Other articles published on Aug 22, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+