భారత్ X వెస్టిండీస్ ఆఖరి టీ20కి అంతరాయం.. కటాఫ్ టైమ్ ఏంటంటే..?
ఐదు టీ20ల సిరీస్లో భాగంగా భారత్-వెస్టిండీస్ మధ్య బెంగళూరు జరగాల్సిన ఆఖరి టీ20కి వర్షం అంతరాయం కలిగిస్తోంది. దాంతో ఇంకా టాస్ వేయలేదు. ప్రస్తుతం మైదానంలో భారీ వర్షం కురుస్తోంది. షెడ్యూల్ ప్రకారం ఈ మ్యాచ్ 7 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా.. 6.30 గంటలకు టాస్ వేయాల్సింది. కానీ వర్షం కారణంగా ఆలస్యమవుతోంది.
ప్రస్తుతం అక్కడి పరిస్థితి చూస్తుంటే ఈ మ్యాచ్ బంతి పడకుండా తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉంది. కుదిరితే ఓవర్లు కుదించి ఆడించవచ్చు. ఈ మ్యాచ్ ఫలితాన్ని తేల్చాలంటే రూల్స్ ప్రకారం ఇరు జట్లు కనీసం 5 ఓవర్ల మ్యాచ్ ఆడాలి. 5 ఓవర్ల మ్యాచ్ నిర్వాహణకు కటాఫ్ టైమ్ను రాత్రి 9.41గా నిర్ణయించారు. ఆలోపు వర్షం ఆగకపోతే మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటిస్తారు.
వాస్తవానికి ఈ మ్యాచ్కు వర్షం ముప్పు పొంచి ఉందని బెంగళూరు వాతావరణ శాఖ హెచ్చరించింది. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు వర్షం పడే సూచనలు 66-69 శాతం వరకు ఉన్నాయని తెలిపింది.

మ్యాచ్ ప్రారంభమయ్యే 7 గంటల సమయంలో వర్షం పడే అవకాశం 69 శాతంగా ఉందని అంచనా వేసింది. వాతావరణ శాఖ హెచ్చరికలకు తగ్గట్లుగానే ఈ మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగిస్తుండటంతో మ్యాచ్ రద్దవుతుందనే ఆందోళన నెలకొంది.
ఒకవేళ మ్యాచ్ పాక్షికంగా జరిగినా.. డక్వర్త్ లూయిస్ ప్రకారం ఫలితాన్ని నిర్దేశిస్తారు. అదే జరిగితే ఒక జట్టు తీవ్రంగా నష్టపోనుంది. చిన్నదైన చిన్నస్వామి స్టేడియంలో 5 ఓవర్ల మ్యాచ్ భారత్కు నష్టం చేసే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే పూర్తి మ్యాచ్ జరగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
చిన్నస్వామి స్టేడియంలో అత్యాధునాతన డ్రైనేజీ సిస్టమ్ ఉండటం కలిసొచ్చే అంశం. వర్షం కాస్త ఆగితే క్షణాల్లో మైదానాన్ని సిద్దం చేయగలరు. కానీ వర్షం ఆగకుంటే మాత్రం మ్యాచ్ బంతి పడకుండానే తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉంది.
భారీ స్కోర్లు నమోదైన ఈ సిరీస్లో ఇరు జట్లు రెండేసి విజయాలతో 2-2తో సమంగా నిలిచాయి. దాంతో ఆఖరి టీ20 సిరీస్ డిసైడర్గా మారింది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టే సిరీస్ను కైవసం చేసుకోనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


