Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs Pakistan: కుప్పకూలిన పాక్.. భారత్ లక్ష్యం 173

India vs Pakistan Semi Final: Sushant, Tyagi shine to restrict Pakistan to 172


పాచెఫ్‌స్ట్రూమ్‌ (దక్షిణాఫ్రికా) :
అండర్-19 ప్రపంచకప్‌లో భాగంగా భారత్‌తో జరుగుతున్న సెమీస్ మ్యాచ్‌లో పాకిస్థాన్ 173 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. భారత బౌలర్లు సమష్టిగా చెలరేగడంతో పాక్ బ్యాట్స్‌మన్ పెవిలియన్ క్యూ కట్టారు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్ 43.1 ఓవర్లలో 172 పరుగులకు కుప్పకూలింది. ఆ జట్టులో ఓపెనర్ హైదర్ అలీ(56), కెప్టెన్ నజీర్(62), మహ్మద్ హారీస్(21) మినహా మిగతా బ్యాట్స్‌మన్ సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. భారత బౌలర్లలో సుశాంత్ మిశ్రా(3/28) మూడు వికెట్లు తీయగా.. కార్తీక్ త్యాగీ, రవి బిష్ణోయ్ రెండేసి వికెట్లు పడగొట్టారు. అథర్వ అంకోలేకర్, యశస్వీ జైస్వాల్‌కు చెరో వికెట్ దక్కింది.
 ఆదిలోనే పాక్‌కు షాక్..

ఆదిలోనే పాక్‌కు షాక్..

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌‌కు దిగిన పాకిస్థాన్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఆ జట్టు ఓపెనర్ మహ్మద్ హురైరా(4)ను భారత పేసర్ సుశాంత్ మిశ్రా క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ ఫహద్ మునీర్‌తో మరో ఓపెనర్ హైదర్ అలీ బాధ్యతాయుతంగా ఆడాడు. అయితే మరో ఎండ్‌లో 16 బంతులు ఎదుర్కొన్న ఫహద్ మునీర్ లెగ్ స్పిన్నర్ రవిబిష్ణోయ్ బౌలింగ్‌లో అంకోలేకర్‌కు క్యాచ్ ఇచ్చి డకౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో పవర్ ప్లే ముగిసే సమయానికి పాక్ 2 వికెట్ల నష్టానికి 36 పరుగులు చేసింది.

మయంతి .. స్టువర్ట్ బిన్నీ నీ బ్యాగ్‌లు మోస్తున్నాడా? దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన టీవీ హోస్ట్

హైదర్ అలీ హాఫ్ సెంచరీ..

హైదర్ అలీ హాఫ్ సెంచరీ..

ఫహద్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ రోహైల్ నజీర్ మరో ఓపెనర్ హైదర్ అలీ ఆచితూచి ఆడారు. నిదానంగా ఆడుతూ భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. మంచి బంతులును గౌరవించిన ఈ జోడీ.. చెడ్డ బంతులను బౌండరీకి తరలించింది. ఈ క్రమంలో హైదర్ అలీ రవి బిష్ణోయ్ వేసిన 24 ఓవర్ తొలి బంతిని బౌండరీకి తరలించి 70 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే అతని జోరుకు జైస్వాల్ బ్రేక్‌లు వేశాడు. అతను వేసిన షార్ట్ డెలివరీని ఫ్లిక్ చేయబోయిన హైదర్.. రవిబిష్ణోయ్‌కు చిక్కి వెనుదిరిగాడు. దీంతో మూడో వికెట్‌కు నమోదైన 84 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

సూపర్ రనౌట్

సూపర్ రనౌట్

హైదర్ వెనుదిరగడంతో క్రీజులోకి వచ్చిన ఖాసీమ్‌ అక్రమ్‌ 9 పరుగుల వద్ద రవి బిష్ణోయ్‌ బౌలింగ్‌లో రనౌట్‌గా వెనుదిరిగాడు. కెప్టెన్ నజీర్‌తో సమన్వయలోపంతో వికెట్ సమర్పించుకున్నాడు. డ్రాప్ షాట్ ఆడి సింగిల్ తీసే ప్రయత్నంలో గందరగోళానికి గురయ్యాడు. ఇద్ద‌రూ ఒకేవైపు ర‌న్నింగ్ చేయ‌డం.. ఫీల్డ‌ర్ త‌న చేతిలో ఉన్న బంతిని కీప‌ర్ వైపు విస‌ర‌డం అంతా మెరుపు వేగంగా జ‌రిగిపోయాయి.

ఆయనే నా విన్నర్.. క్రేజీ క్రికెటర్‌పై మనసు పడ్డ దిశా పటానీ

ఈ దశలో క్రీజులోకి వచ్చిన మహ్మద్‌ హారిస్‌తో కలిసి పాక్‌ కెప్టెన్‌ నాజిర్‌ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. అయితే జట్టు స్కోరు 146 పరుగుల వద్ద ఉన్నప్పుడు రెండో స్పెల్‌కు వచ్చిన అధర్వ అంకోలేకర్ బౌలింగ్‌లో మహ్మద్‌ హారిస్‌ (21) క్యాచ్‌ ఔట్‌గా వెనుదిరిగాడు. తర్వాత ఇర్ఫాన్ ఖాన్ క్రీజులోకి రాగా.. నజీర్ 84 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

టపటపా..

టపటపా..

ఆ మరుసటి ఓవర్లోనే ఇర్ఫాన్ ఖాన్‌ను కార్తీక్ త్యాగి ఔట్ చేయగా.. ఆ మరుసటి ఓవర్‌లో అబ్బాస్ అఫ్రిదిని రవి బిష్ణోయ్ పెవిలియన్‌కు చేర్చాడు. ఇక 41 ఓవర్ నాలుగో బంతికి కెప్టెన్ నజీర్‌ కూడా మిశ్రా బౌలింగ్‌లో వెనుదిరిగాడు. 43 ఓవర్ చివరి బంతికి తాహీర్ హుస్సెన్.. 44 ఓవర్ తొలి బంతికి ఆమిల్ అలీ ఔటవ్వడంతో పాక్ ఇన్నింగ్స్ ముగిసింది.

Story first published: Tuesday, February 4, 2020, 17:49 [IST]
Other articles published on Feb 4, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+