Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

48 ఏళ్ల తర్వాత అదే ఘనత.. మామగారి బాటలో అల్లుడు, కూతురి కళ్లలో కన్నీళ్లు!

Asian Games 2026: ప్రతి క్రీడా పతకం వెనుక ఓ స్టోరీ, సాధన మాత్రమే కాకుండా ప్రేమాభిమానాలు, కుటుంబ బంధాలు, భావోద్వేగాలు దాగి ఉంటాయి. 2026 ఆసియా క్రీడల్లో భారత షూటింగ్ జోడీ నీరూ ధండా, కైనన్ చెనాయ్ మిక్స్‌డ్ ట్రాప్ టీమ్ విభాగంలో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్న వేళ షూటింగ్ రేంజ్‌లో అటువంటి అరుదైన భావోద్వేగ క్షణం ఆవిష్కృతమైంది. 1978 ఆసియా క్రీడల్లో దేశానికి తొలి షూటింగ్ స్వర్ణ పతకాన్ని అందించిన దిగ్గజ షూటర్.. దివంగత రాజా రణధీర్ సింగ్ సాధించిన ఘనతను.. సరిగ్గా 48 ఏళ్ల తర్వాత ఆయన అల్లుడైన కైనన్ చెనాయ్ రిపీట్ చేశారు.

గోల్డ్ మెడల్ ప్రపంచకప్ కంటే గొప్పది.. తిండికి డోకా లేదు: అక్షర్ పటేల్

గోల్డ్ మెడల్ ప్రపంచకప్ కంటే గొప్పది.. తిండికి డోకా లేదు: అక్షర్ పటేల్

ఆనంద భాష్పాలు రాల్సిన భార్య రియా కుమార్
పతక ప్రదానోత్సవ వేడుకలో భారత జాతీయ గీతం మోగుతుండగా.. త్రివర్ణ పతాకం సగర్వంగా ఎగురుతున్న సమయంలో వేదిక వద్ద ఉన్న ఓ మహిళ తన భావోద్వేగాలను అదుపు చేసుకోలేక కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆమె మరెవరో కాదు.. రాజా రణధీర్ సింగ్ కుమార్తె, కైనన్ చెనాయ్ సతీమణి రియా కుమార్. దశాబ్దాల క్రితం తన తండ్రి ఆసియా క్రీడల్లో దేశానికి చారిత్రాత్మక స్వర్ణం అందించిన క్షణాలను నేరుగా చూడలేకపోయిన రియా.. ఇప్పుడు తన భర్త అదే వేదికపై దేశం గర్వించేలా పసిడి పతకాన్ని ముద్దాడటాన్ని కళ్లారా చూసి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.

Asian Games 2026 Kynan Chenai Wins Gold 48 Years After Father-in-Law 1978 historic feat Details

'మామగారి తుపాకీ గొట్టంతోనే పతకం సాధించా!'
తన చారిత్రాత్మక విజయం అనంతరం కైనన్ చెనాయ్ మాట్లాడుతూ ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని పంచుకున్నారు. "ఈ రోజు నేను స్వర్ణ పతకం గెలవడానికి ఉపయోగించిన తుపాకీ గొట్టం మా మామగారిదే. నేను దానిని ఆయన నుంచి నవ్వుతూ దొంగిలించాను. సుమారు 30 ఏళ్ల క్రితం ఆయన కొనుగోలు చేసిన ఈ గొట్టం నాకు ఇంతటి అదృష్టాన్ని తెచ్చిపెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది." అని వ్యాఖ్యానించారు. కైనన్ తండ్రి డారియస్ చెనాయ్ కూడా జాతీయ స్థాయి షాట్‌గన్ షూటర్ కావడం గమనార్హం.

Asian Games 2026: భారత్ X పాక్ ఫైనల్ మ్యాచ్ రద్దయితే.. విజేతగా నిలిచేది ఎవరంటే?

Also Read

Asian Games 2026: భారత్ X పాక్ ఫైనల్ మ్యాచ్ రద్దయితే.. విజేతగా నిలిచేది ఎవరంటే?

పోరాడి గెలిచిన షూటింగ్ జోడీ
ఈ మిక్స్‌డ్ టీమ్ ఫైనల్లో కైనన్ చెనాయ్ 73 స్కోరుతో అత్యుత్తమ నిలకడను ప్రదర్శించి జట్టును ముందుండి నడిపించారు. మరో షూటర్ నీరూ ధండా ఆరంభంలో కాస్త తడబడినప్పటికీ.. కీలక సమయంలో పుంజుకుని అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. ఈ ఏడాది ప్రారంభంలో ప్రపంచ కప్ లో కాంస్య పతకం సాధించిన ఈ జోడీ.. ఆసియా క్రీడల్లో స్వర్ణంతో మెరిసింది. ఈ చారిత్రాత్మక విజయం భారత షూటింగ్ చరిత్రలోనే అత్యంత భావోద్వేగభరిత ఘట్టంగా నిలిచిపోతుంది.

Story first published: Thursday, October 1, 2026, 17:55 [IST]
Other articles published on Oct 1, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+