భారత్ X జపాన్ ఏకైక టీ20కి అంతరాయం!
ఆసియా గేమ్స్‌కు ముందు భారత్, జపాన్ మధ్య జరగాల్సిన ఏకైక టీ20 మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగిస్తోంది. జపాన్ రాజధాని టోక్యోలోని సానో ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగాల్సి ఉండగా.. వర్షం కారణంగా ఇంకా మొదలవ్వలేదు. భారత కాలమానం ప్రకారం ఉదయం 9.30కి ప్రారంభం కావాల్సి ఉండగా.. ఇంకా టాస్ కూడా వేయలేదు.
భారీ వర్షంతో మైదానం మొత్తం చిత్తడిగా మారింది. ముఖ్యంగా ఔట్ ఫీల్డ్ తడిగా ఉండటంతో ఆటకు అంతరాయం ఏర్పడింది. వర్షం ఆగినా.. మైదానం ఆటకు అనువుగా లేకపోవడంతో అంపైర్లు వేచి చూస్తున్నారు. మరోవైపు మైదాన సిబ్బంది శ్రమిస్తున్నారు.
భారత్, జపాన్ దేశాల మధ్య దౌత్య సంబంధాలు మొదలై 75 ఏళ్ల పూర్తయిన సందర్భంగా ఈ మ్యాచ్ ఏర్పాటు చేశారు. స్పోర్ట్ 75 ప్రత్యేక ద్వైపాక్షిక సాంస్కృతిక క్రీడా కార్యక్రమంలో భాగంగా ఈ మ్యాచ్‌ను నిర్వహిస్తున్నారు.

ఇతర క్రీడల్లో జపాన్ బలీయమైన శక్తే అయినప్పటీకీ.. క్రికెట్‌లో మాత్రం పసికూనే. ఈ అసోసియేట్ టీమ్.. ఐసీసీ టెస్ట్ హోదా కలిగిన జట్టుతో తలపడటం ఇదే తొలిసారి. కెండేల్ కడోవాకి ఫ్లెమింగ్ నాయకత్వంలోని జపాన్ టీమ్.. భారత జట్టుతో తలపడనుంది. ఆసియా క్రీడల్లో బరిలోకి దిగే ముందు జపాన్ పరిస్థితులపై అవగాహన పెంచుకోవడానికి ఈ మ్యాచ్‌ను ఉపయోగించుకోవాలని భారత జట్టు భావిస్తోంది.
అయితే ఈ మ్యాచ్‌కు దుజువాన్ తుఫాన్ అడ్డంకిగా మారింది. ప్రస్తుతం ఈ తుఫాన్ జపాన్‌లో బీభత్సం సృష్టిస్తోంది. ఈ తుఫాన్ కారణంగా జపాన్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే ఈ తుఫాన్ కారణంగా ఆసియా గేమ్స్‌లో పలు పోటీలు వాయిదా పడ్డాయి. సెప్టెంబర్ 19 నుంచి పలు ప్రాంతాల్లో 300 మిల్లీ మీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది.
ఈ తుఫాన్ ప్రభావంతో గాలులు గంటకు 144 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయి. ఆకస్మిక వర్షాల కారణంగా ఆ దేశ ప్రభుత్వం రెడ్ అలెర్ట్ జారీ చేసింది. ఈ తుఫాన్ కారణంగా జపాన్ వ్యాప్తంగా విమాన సేవలకు కూడా అంతరాయం ఏర్పడింది. మొత్తం 275కు పైగా మిమానాలు రద్దు చేశారు. జపాన్ ఎయిర్‌లైన్స్ 120 దేశీయ, 15 అంతర్జాతీయ విమానాలు రద్దు చేయగా.. మరో ప్రధాన విమానయాన సంస్థ 140 విమానాలను రద్దు చేసింది. పలు మార్గాల్లో రైలు సేవలను కూడా తాత్కలికంగా నిలిపివేశారు. వేలాది ఇళ్లకు విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


