భారత్ X జపాన్ .. 5 ఓవర్ల మ్యాచ్! వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు!
వర్షం అంతరాయం కారణంగా భారత్, జపాన్ ఏకైక టీ20ని 5 ఓవర్లకు కుదించారు. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం కారణంగా మైదానం మొత్తం చిత్తడిగా మారింది. దాంతో పలు మార్లు మైదానాన్ని పరిశీలించిన అంపైర్లు.. చివరకు ఐదు ఓవర్ల మ్యాచ్ నిర్వహించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ నామమాత్రపు మ్యాచ్‌లోనూ వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కలేదు. షెడ్యూల్ ప్రకారం ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం ఉదయం 9.30కి ప్రారంభం కావాల్సింది. కానీ వర్షం కారణంగా 3 గంటలు ఆలస్యమైంది.
ఆసియా గేమ్స్‌కు ముందు ఈ మ్యాచ్ తమకు ప్రాక్టీస్ లాంటిదని శ్రేయస్ అయ్యర్ తెలిపాడు. 'మేం ముందుగా బ్యాటింగ్ చేయాలనుకుంటున్నాం. ఇరు దేశాల మధ్య 75 ఏళ్ల స్నేహబంధం ఉంది. అందుకే ఈ మ్యాచ్ చాలా ఆసక్తికరంగా ఉండబోతోంది. ఇక్కడి కండిషన్స్ అర్థం చేసుకోవడానికి ఈ మ్యాచ్ ఉపయోగపడుతుంది.

జపాన్‌కు వచ్చి టీ20 ఆడుతానని, భారత్‌కు సారథ్యం వహిస్తానని ఊహించలేదు. ఇక్కడ బేస్‌బాల్ ఆట చాలా పాపులర్ అని నాకు తెలుసు. ఈ మ్యాచ్‌కు పెద్ద సంఖ్యలో అభిమానులు హాజరయ్యారు. జపాన్, భారత్ అభిమానుల కోసం మంచి మ్యాచ్ అందించడం మా బాధ్యత. ఈ మ్యాచ్ జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఒక మంచి మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్నాం.
పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకోవడం, మన చుట్టూ ఏం జరుగుతుందో అవగాహన తెచ్చుకోవడం చాలా ముఖ్యం. రాబోయే ఆసియా క్రీడల్లో కూడా దాదాపు ఇలాంటి పరిస్థితులే ఉండే అవకాశం ఉంది. అక్కడ పిచ్‌లు ఎలా ఉంటాయో మాకు సరిగ్గా తెలియదు, కానీ ఖచ్చితంగా ఈ ఒక్క మ్యాచ్ మాకు చాలా మంచి ప్రాక్టీస్‌లా ఉపయోగపడుతుంది. ఆ క్షణం కోసం మేము ఆసక్తిగా వేచి చూస్తున్నాం.'అని శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు.
తుది జట్లు:
భారత్ : సంజూ శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, యశ్ ఠాకూర్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్.
జపాన్ : లచ్లాన్ యమమోటో-లేక్, రేయో సకురానో-థామస్, కెండెల్ కాడోవాకి-ఫ్లెమింగ్ (కెప్టెన్), బెంజమిన్ ఇటో-డేవిస్, వతరు మియావుచి, అలెగ్జాండర్ షిరాయ్-పాట్‌మోర్ (వికెట్ కీపర్), చార్లీ హారా-హింజ్, ఇబ్రహీం తకాహాషి, డెక్లాన్ సుజుకి-మెక్‌కోంబ్, మకోటో తనియామా, షోమా సుగాయా-స్లేటర్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


