Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

భారత్ X జపాన్ ఏకైక టీ20కి భారీ అడ్డంకి!

ఆసియా గేమ్స్ 2026 టోర్నీకి ముందు ఆతిథ్య జపాన్‌తో భారత్ స్నేహపూర్వక టీ20 మ్యాచ్ ఆడనుంది. జపాన్‌లో క్రికెట్‌పై ఆదరణ పెంచే ఉద్దేశంతో ఈ మ్యాచ్‌ను ఏర్పాటు చేశారు. వరల్డ్ నెంబర్ వన్ టీమ్ అయినా టీమిండియాతో తలపడేందుకు జపాన్ ఉవ్విళ్లూరుతోంది. అయితే ఈ మ్యాచ్‌కు వాతావరణం భారీ అడ్డంకిగా మారింది.

చరిత్ర సృష్టించిన షెఫాలీ వర్మ.. ఏకైక ప్లేయర్‌గా వరల్డ్ రికార్డ్!

చరిత్ర సృష్టించిన షెఫాలీ వర్మ.. ఏకైక ప్లేయర్‌గా వరల్డ్ రికార్డ్!

ప్రస్తుతం జపాన్‌లో దుజువాన్అనే తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. ఈ తుఫాన్ కారణంగా జపాన్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే ఈ తుఫాన్ కారణంగా ఆసియా గేమ్స్‌లో పలు పోటీలు వాయిదా పడ్డాయి. ఈ తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో సోమవారం జరగాల్సిన అశ్వ క్రీడా ఈవెంట్లను మంగళవారానికి వాయిదా వేసారు.

India vs Japan T20 Friendly in Doubt as Typhoon Dujuan Threatens Asian Games 2026

మంగళవారం జరిగే భారత్-జపాన్ ఏకైక టీ20 మ్యాచ్‌కు కూడా ఈ దుజువాన్ తుఫాన్ ముప్పు పొంచి ఉంది. జపాన్ రాజధాని టోక్యోలోని సానో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం‌లో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ ప్రాంతంలో కూడా తుఫాన్ ప్రభావం ఉంటుందని జపాన్ వాతావరణ శాఖ హెచ్చరించింది. సెప్టెంబర్ 19 నుంచి పలు ప్రాంతాల్లో 300 మిల్లీ మీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది.

Asian Games 2026: పాకిస్థాన్‌ చిత్తు.. క్వార్టర్ ఫైనల్‌కు భారత్!

Also Read

Asian Games 2026: పాకిస్థాన్‌ చిత్తు.. క్వార్టర్ ఫైనల్‌కు భారత్!

ఈ తుఫాన్ ప్రభావంతో గాలులు గంటకు 144 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయి. ఆకస్మిక వర్షాల కారణంగా ఆ దేశ ప్రభుత్వం రెడ్ అలెర్ట్ జారీ చేసింది. ఈ తుఫాన్ కారణంగా జపాన్ వ్యాప్తంగా విమాన సేవలకు కూడా అంతరాయం ఏర్పడింది. మొత్తం 275కు పైగా మిమానాలు రద్దు చేశారు. జపాన్ ఎయిర్‌లైన్స్ 120 దేశీయ, 15 అంతర్జాతీయ విమానాలు రద్దు చేయగా.. మరో ప్రధాన విమానయాన సంస్థ 140 విమానాలను రద్దు చేసింది. పలు మార్గాల్లో రైలు సేవలను కూడా తాత్కలికంగా నిలిపివేశారు. వేలాది ఇళ్లకు విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది.

మెరుగైన ఐసీసీ ర్యాంక్‌తో ఆసియా గేమ్స్ 2026లో భారత పురుషుల టీమ్ నేరుగా క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌కు ముందు జపాన్‌తో సన్నాహకంగా స్నేహపూర్వగా టీ20 ఆడేందుకు సిద్దమైంది. కానీ ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశాలు ఉన్నాయి.

Story first published: Monday, September 21, 2026, 16:15 [IST]
Other articles published on Sep 21, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+