Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Asian Games 2026: పాకిస్థాన్‌ చిత్తు.. క్వార్టర్ ఫైనల్‌కు భారత్!

ఆసియా గేమ్స్ 2026 టోర్నీలో భారత మహిళల టేబుల్ టెన్నిస్ టీమ్ దుమ్మురేపుతోంది. దాయాదీ పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్ క్వార్టర్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది. సోమవారం జరిగిన గ్రూప్-ఎఫ్ రెండో మ్యాచ్‌లో భారత్ 3-0 తేడాతో పాకిస్థాన్‌ను చిత్తు చేసింది. భారత ఆటగాళ్ల అద్వితీయ ప్రదర్శన ముందు పాకిస్థాన్ తేలిపోయింది.

సుతీర్థ ముఖర్జీ 11-3, 11-3, 11-4 తేడాతో అలీనా ఖాన్‌ను ఓడించగా.. సిండ్రెలా దాస్ 11-6, 11-7, 11-5 తేడాతో కల్సూమ్ ఖాన్‌ను చిత్తు చేసింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో పాకిస్థాన్ తేలిపోయింది. తెలంగాణ బిడ్డ ఆకుల శ్రీజ 11-4, 11-4, 11-5 తేడాతో ఫాతిమా ఖాన్‌ను ఓడించి భారత్ విజయాన్ని లాంఛనం చేసింది. ఈ గెలుపుతో గ్రూప్ ఎఫ్‌లో భారత్ అగ్రస్థానంలో నిలిచింది.

Asian Games 2026: ఆసియా క్రీడల తొలి రోజే భారత్‌కు పతకాల పంట!

Asian Games 2026: ఆసియా క్రీడల తొలి రోజే భారత్‌కు పతకాల పంట!

షేక్ హ్యాండ్ ఇచ్చుకున్న భారత్, పాక్ ఆటగాళ్లు..

అయితే ఈ మ్యాచ్ సందర్భంగా భారత్, పాకిస్థాన్ ఆటగాళ్లు కరచాలనం చేసుకోవడం చర్చనీయాంశమైంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఇరు దేశాల మధ్య క్రీడా సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్న సంగతి తెలిసిందే. భారత క్రికెట్ టీమ్.. పాకిస్థాన్ ఆటగాళ్లతో కరచాలనం చేయడం లేదు. ఇతర క్రీడల ఆటగాళ్లు కూడా ఈ సంప్రదాయాన్ని కొనసాగించారు. కానీ టేబుల్ టెన్నిస్ ప్లేయర్లు మాత్రం ఒకరికొకరు కరచాలనం చేసుకోని క్రీడాస్ఫూర్తిని కనబర్చారు.

India Beat Pakistan 3-0 to Storm Into Asian Games 2026 Table Tennis Quarter-Finals

సింగపూర్‌పై ఘన విజయం..

భారత మహిళల టీటీ టీమ్ తొలి మ్యాచ్‌లో 3-2 తేడాతో సింగపూర్‌ను ఓడించింది. ఈ మ్యాచ్‌లో భారత్ 1-2 తేడాతో వెనుకంజలో నిలిచి మరీ పుంజుకుంది. తొలి మ్యాచ్‌లో యశస్విని విజయం సాధించగా.. శ్రీజ, దివ్య చితాలె ఓడిపోయారు. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో శ్రీజ 6-11, 11-3, 11-7, 11-4 తేడాతో జెంగ్ జియాను ఓడించి భారత్‌ను రేసులో నిలబట్టింది. నిర్ణయాత్మక పోరులో యశస్విని విజయం సాధించడంతో భారత్ పైచేయి సాధించింది.

షూటింగ్‌లో రజతం..

రెండో రోజు పోటీల్లో భారత్ రజత పకతాన్ని అందుకుంది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్‌లో భారత్ రెండో స్థానం నిలిచింది. రుద్రాంక్ష్ పాటిల్, పార్థ్ మానే, హిమాన్షు థిల్లాన్ త్రయం 1890.1 పాయిట్లతో రెండో స్థానంలో నిలిచి స్వర్ణాన్ని చేజార్చుకుంది. చైనా 1899 పాయింట్లతో పసిడి సాధించింది. రుద్రాంక్ష్, హిమాన్షు వ్యక్తిగత ఈవెంట్‌లో రజతం,కాంస్యం సాధించారు.

Asian Games 2026: వైభవ్ సూర్యవంశీని ఊరిస్తున్న చారిత్రాత్మక రికార్డ్!

Also Read

Asian Games 2026: వైభవ్ సూర్యవంశీని ఊరిస్తున్న చారిత్రాత్మక రికార్డ్!

మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్‌లో కాంస్యం..

మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్‌ మహిళల 60 కేజీల విభాగంలో భారత్ క్రీడాకారిణి సుచిక తరియర్ కాంస్య పతకాన్ని నెగ్గింది. సెమీఫైనల్లో సింగపూర్‌కు చెందిన హుహున్ టీయో చేతిలో ఓడిపోయింది.

Story first published: Monday, September 21, 2026, 10:30 [IST]
Other articles published on Sep 21, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+