Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

న్యూజిలాండ్ పర్యటనకు భారత్.. మ్యాచ్‌లు ఎలా చూడాలంటే? టైమింగ్స్‌తో పాటు పూర్తి షెడ్యూల్ ఇదే!

సొంతగడ్డపై వెస్టిండీస్‌తో ఐదు టీ20ల సిరీస్‌ను సమం చేసుకున్న భారత్.. సుదీర్ఘమైన న్యూజిలాండ్ పర్యటనకు సిద్దమైంది. అక్టోబర్ 22 నుంచి ఈ పర్యటన మొదలు కానుంది. ఇప్పటికే భారత టీ20 జట్టు న్యూజిలాండ్‌కు చేరుకుంది. నెల రోజుల పాటు సాగనున్న ఈ పర్యటనలో భారత్ ఐదు టీ20లు, ఐదు వన్డేలతో పాటు 2 టెస్ట్‌ల సిరీస్ ఆడనుంది.

ఇప్పటికే ఈ పర్యటనకు సంబంధించిన మూడు వేర్వేరు జట్లను బీసీసీఐ ప్రకటించింది. టీ20 ఫార్మాట్‌తో పాటు చివరి రెండు వన్డేలకు శ్రేయస్ అయ్యర్ సారథ్యం వహించనుండగా.. తొలి మూడు వన్డేలతో పాటు రెండు టెస్ట్‌ల సిరీస్‌కు శుభ్‌మన్ గిల్ నాయకత్వం వహించనున్నాడు.

IND vs ZIM: మేం గెలిచినా.. ఆ విషయంలో మెరుగవ్వాలి: స్మృతి మంధాన

IND vs ZIM: మేం గెలిచినా.. ఆ విషయంలో మెరుగవ్వాలి: స్మృతి మంధాన

మబ్బుల మ్యాచ్‌లు..

అక్టోబర్ 22, 24, 27, 30, నవంబర్ 1న ఐదు టీ20లు జరగనుండగా.. నవంబర్ 4, 7, 10, 13, 15 తేదీల్లో ఐదు వన్డేల సిరీస్ జరగనుంది. నవంబర్ 19-27 మధ్య తొలి టెస్ట్, 27-డిసెంబర్ 1 వరకు రెండో టెస్ట్‌ నిర్వహించనున్నారు. భారత కాలమానం ప్రకారం టీ20 మ్యాచ్‌లు మధ్యాహ్నం 12.30 గంటలకు మొదలవ్వనుండగా.. వన్డేలు ఉదయం 7.30 గంటలకు ప్రారంభం కానున్నాయి. టెస్ట్ సిరీస్ తెల్లవారు జామున 3.30 గంటలకు మొదలవుతాయి.

India Tour of New Zealand 2026 Full Schedule Match Timings Squads and Broadcast Details

మ్యాచ్‌లు ఎలా చూడాలంటే..?

న్యూజిలాండ్ పర్యటనలోని మ్యాచ్‌లకు సోనీ నెట్‌వర్క్ అధికారిక బ్రాడ్‌కాస్టర్‌గా వ్యవహరిస్తోంది. టీ20, వన్డే సిరీస్‌లతో పాటు టెస్ట్ మ్యాచ్‌లు కూడా సోనీ నెట్‌వర్క్ ఛానెల్స్‌తో పాటు సోనీ లివ్ ఒటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో చూడవచ్చు. అయితే ఈ వేదికలుగా మ్యాచ్‌లు చూడాలంటే సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సిందే.

ఫ్రీగా ఎలా చూడాలంటే..?

ఈ మ్యాచ్‌లను ఫ్రీగా చూసి వెసులుబాటు కూడా ఉంది. ఎయిర్టెల్ యూజర్లు ప్రత్యేకమైన రిచార్ఛ్ ప్లాన్స్ ద్వారా Airtel Xstream Play సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు. అగ్రిగేటర్ ఓటీటీ ఫ్లాట్‌ ఫామ్ అయిన Airtel Xstream Play‌లో సోనీ లీవ్ ఉంది. తద్వారా మ్యాచ్‌లను ఉచితంగా వీక్షించవచ్చు.

IND vs WI: ఇషాన్ కిషన్ ఊచకోత బుగ్గిపాలు.. ఆఖరి టీ20 రద్దు!

Also Read

IND vs WI: ఇషాన్ కిషన్ ఊచకోత బుగ్గిపాలు.. ఆఖరి టీ20 రద్దు!

షెడ్యూల్..

న్యూజిలాండ్ వర్సెస్ భారత్ టీ20 సిరీస్ (భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రారంభం)

తొలి టీ20: అక్టోబర్ 22, క్రిస్ట్‌చర్చ్

రెండో టీ20: అక్టోబర్ 24, క్రిస్ట్‌చర్చ్

మూడో టీ20: అక్టోబర్ 27, వెల్లింగ్టన్

నాలుగో టీ20: అక్టోబర్ 24, అక్లాండ్

ఐదో టీ20: నవంబర్ 1, హమిల్టన్

న్యూజిలాండ్ వర్సెస్ భారత్ వన్డే సిరీస్ (భారత కాలమానం ప్రకారం ఉదయం 7.30 గంటలకు ప్రారంభం)

తొలి వన్డే: నవంబర్ 4, అక్లాండ్

రెండో వన్డే: నవంబర్ 7, వెల్లింగ్టన్

మూడో వన్డే: నవంబర్ 10, హమిల్టన్

నాలుగో వన్డే: నవంబర్ 13, మౌంట్ మాంగాని

ఐదో వన్డే: నవంబర్ 15, మౌంట్ మాంగాని

న్యూజిలాండ్ వర్సెస్ భారత్ టెస్ట్ సిరీస్ (భారత కాలమానం ప్రకారం ఉదయం 3.30 గంటలకు ప్రారంభం)

తొలి టెస్ట్: నవంబర్ 19-23, వెల్లింగ్టన్

రెండో టెస్ట్: నవంబర్ 27-డిసెంబర్ 1, క్రిస్ట్‌చర్చ్

భారత టీ20 టీమ్:

శ్రేయస్ అయ్యర్, అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, అక్షర్ పటేల్, శివమ్ దూబే, నితీష్ కుమార్ రెడ్డి, నమన్ ధీర్, ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, భువనేశ్వర్ కుమార్, వరుణ్ చక్రవర్తీ, కుల్దీప్ యాదవ్.

తొలి మూడు వన్డేలకు భారత జట్టు:

శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, నమన్ ధీర్, అంశుల్ కంబోజ్, గుర్నూర్ బ్రార్, రుతురాజ్ గైక్వాడ్, అర్ష్‌దీప్ సింగ్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ*, కుల్‌దీప్ యాదవ్

చివరి రెండు వన్డేలకు భారత జట్టు:

శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్, వైస్ కెప్టెన్), నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, నమన్ ధీర్, ఆకిబ్ నబీ, గుర్నూర్ బ్రార్, రుతురాజ్ గైక్వాడ్, అర్ష్‌దీప్ సింగ్, కుమార్ కుషాగ్రా (వికెట్ కీపర్), మహమ్మద్ సిరాజ్, యష్ ఠాకూర్, కుల్‌దీప్ యాదవ్

భారత టెస్ట్ జట్టు:

శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), దేవ్‌దత్ పడిక్కల్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, అంశుల్ కంబోజ్, జస్‌ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాష్ దీప్, సాయి సుదర్శన్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్‌దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్.

Story first published: Monday, October 19, 2026, 10:53 [IST]
Other articles published on Oct 19, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+