సంజూ ఔట్.. రజత్ పాటిదార్‌కు నోఛాన్స్! జింబాబ్వే టూర్‌కు భారత జట్టు ఇదే!
మూడు టీ20ల సిరీస్ కోసం జింబాబ్వే పర్యటనకు వెళ్లే భారత జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) సీనియర్ సెలెక్షన్ కమిటీ ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను అజిత్ అగార్కర్ సారథ్యంలోని భారత సెలెక్షన్ కమిటీ సోమవారం రాత్రి వెల్లడించింది. అయితే ఈ జట్టులో సెలెక్షన్ కమిటీ సంచలన మార్పులు చేసింది.
ప్రస్తుతం ఇంగ్లండ్‌తో తలపడుతున్న జట్టుతో పోలిస్తే ఈ సిరీస్‌కు ఆరు మార్పులు జరిగాయి. ఐర్లాండ్‌తో పాటు ఇంగ్లండ్‌తో వరుసగా మూడు మ్యాచ్‌ల్లో విఫలమైన సంజూ శాంసన్‌పై వేటు పడింది. టీ20 ప్రపంచకప్ 2026లో సంచలన ప్రదర్శన కనబర్చినా.. జింబాబ్వే పర్యటనకు సంజూ శాంసన్‌ను సెలెక్టర్లు దూరం పెట్టారు.

రజత్ పాటిదార్‌కు నో ఛాన్స్..
మరోసారి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) కెప్టెన్ రజత్ పాటిదార్‌ను పట్టించుకోలేదు. సరైన టీమ్ కాంబినేషన్ కోసం రజత్ పాటిదార్‌ను తీసుకోవాలని మాజీ క్రికెటర్లు సూచించినా.. అతను తమ పరిగణనలో లేడని స్పష్టం చేసింది. స్టార్ ఫినిషర్ రింకూ సింగ్ తిరిగి జట్టులోకి రాగా.. యశ్ ఠాకూర్, అశోక్ శర్మ, ప్రభ్‌సిమ్రాన్, హర్ష్ దూబే తొలిసారి టీమిండియా టీ20 జట్టుకు ఎంపికయ్యారు.
మరోవైపు తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి గాయం నుంచి కోలుకోకపోవడంతో ఈ పర్యటనకు దూరమయ్యాడు. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు కూడా దూరం కాగా.. అతని స్థానంలో శివమ్ దూబేను ఎంపిక చేశారు. టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. జులై 23, 25, 26 తేదీల్లో హరారే వేదికగా జరిగే ఈ మూడు టీ20ల సిరీస్‌లో శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోనే భారత జట్టు బరిలోకి దిగనుంది. తెలుగు తేజం తిలక్ వర్మ అతనికి డిప్యూటీగా వ్యవహరించనున్నాడు.
జింబాబ్వేతో టీ20లకు భారత జట్టు:
శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, శివమ్ దూబే, సూర్యాంశ్ షెడ్జే, రింకూ సింగ్, హర్ష్ దూబె, వరుణ్ చక్రవర్తీ, ప్రిన్స్ యాదవ్, యశ్ ఠాకూర్, అశోక్ శర్మ, మయాంక్ యాదవ్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

