Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Asian Games 2026: బంగారు తల్లులు!

ఆసియా గేమ్స్‌లో భారత్‌ వరుసగా రెండోసారి పసిడి పతకాన్ని సాధించింది. అద్వితీయమైన ప్రదర్శనతో విజేతగా నిలవడంతో ఈ ఆసియా గేమ్స్‌లో భారత్‌కు తొలి స్వర్ణం దక్కింది. జపాన్, బంగ్లాదేశ్, శ్రీలంకను చిత్తు చేసి మరీ భారత్ ఆసియా విజేతగా నిలిచింది.

ఈ ఆసియా క్రీడలకు ముందు జరిగిన ఆసియా కప్‌ 2026 ఫలితాలనే హర్మన్‌సేన్ పునరావృతం చేసింది. అయితే ఈ పసిడి పతకం తేవడంలో ఓపెనర్లు స్మృతి మంధాన, షెఫాలీ వర్మతో పాటు తెలుగమ్మాయి శ్రీచరణి కీలక పాత్ర పోషించింది.

Asian Games 2026: భారత్‌కు స్వర్ణం.. హర్మన్‌ప్రీత్ కౌర్ భావోద్వేగం!

Asian Games 2026: భారత్‌కు స్వర్ణం.. హర్మన్‌ప్రీత్ కౌర్ భావోద్వేగం!

మెరిసిన షెఫాలీ..

ముఖ్యంగా ఓపెనర్ షెఫాలీ వర్మ విధ్వంసకర బ్యాటింగ్‌తో భారత్‌కు అదిరిపోయే విజయాలను అందించింది. మూడు మ్యాచ్‌ల్లో షెఫాలీ 188 పరుగులు చేసింది. ఇందులో బంగ్లాదేశ్‌పై ఒక మెరుపు సెంచరీ కూడా ఉంది. ఆసియా గేమ్స్ చరిత్రలోనే సెంచరీ బాదిన తొలి క్రికెటర్‌గా షెఫాలీ వర్మ చరిత్రకెక్కింది.

India s Golden Girls Shefali Varma Smriti Mandhana and Shree Charani Star in Asian Games Gold Triumph

ఆసియా కప్‌లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచిన షెఫాలీ.. ఆసియా గేమ్స్‌లోనూ అదే జోరు కొనసాగించింది. జపాన్‌పై 40, ఫైనల్లో శ్రీలంకపై 48 పరుగులు చేసింది. బౌలింగ్‌లోనూ షెఫాలీ మాయ చేసింది. మూడు మ్యాచ్‌ల్లో నాలుగు వికెట్లు పడగొట్టింది.


స్మృతి మంధాన జోరు..

ఓపెనర్ స్మృతి మంధాన మరోసారి తన స్థిరత్వాన్ని చూపించింది. ఫైనల్లో (45 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్స్‌లతో 79) మెరుపు ఇన్నింగ్స్ ఆడిన మందాన బంగ్లాదేశ్‌పై 37 పరుగులు సాధించింది. షెఫాలి వర్మతో కలిసి విధ్వంసకరమైన ఆరంభాలను అందించింది. ఈ ఇద్దరూ మెరుపు ఆరంభాలతో మ్యాచ్‌లను ప్రత్యర్థుల నుంచి లాగేసుకున్నారు. గత ఆసియా గేమ్స్‌లో కూడా భారత్ స్వర్ణ పతకం సాధించడంలో ఈ ఇద్దరూ కీలక పాత్ర పోషించారు.

Asian Games 2026: మూడో రోజు ఒక స్వర్ణం.. మరో రెండు పతకాలు ఖాయం!

Also Read

Asian Games 2026: మూడో రోజు ఒక స్వర్ణం.. మరో రెండు పతకాలు ఖాయం!

సత్తా చాటిన కడప రెడ్డమ్మ..

తెలుగు తేజం శ్రీ చరణి మరోసారి అద్వితీయమైన బౌలింగ్ ప్రదర్శనతో ఆకట్టుకుంది. సిరీస్ సిరీస్‌కు మెరుగవుతున్న ఈ కడప రెడ్డమ్మ.. ఆసియా క్రీడల్లోనూ మాయ చేసింది. 3 మ్యాచ్‌ల్లో 8 వికెట్లు తీసింది. స్పిన్నర్ అయిన శ్రీచరణి జపాన్‌పై (4/10) నాలుగు, బంగ్లాదేశ్‌పై(2/7) రెండు, ఫైనల్లో శ్రీలంకపై(2/13) రెండు వికెట్లు పడగొట్టింది. దీప్తి శర్మ మూడు మ్యాచ్‌ల్లో 7 వికెట్లతో సత్తా చాటింది. రిచా ఘోష్ కూడా విధ్వంసకర బ్యాటింగ్‌తో ఆకట్టుకుంది.

Story first published: Wednesday, September 23, 2026, 8:44 [IST]
Other articles published on Sep 23, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+