Asian Games 2026: వైభవ్ సూర్యవంశీని ఊరిస్తున్న చారిత్రాత్మక రికార్డ్!
టీమిండియా టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీని మరో అరుదైన ఘనత ఊరిస్తోంది. ఆసియా గేమ్స్ 2026 ఆడేందుకు భారత పురుషుల టీ20 టీమ్ ఆదివారం జపాన్‌కు బయల్దేరిన సంగతి తెలిసిందే. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని భారత జట్టు డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఈ టోర్నీ ఆడుతోంది.
ఈ జట్టులో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ సభ్యుడిగా ఉన్న విషయం విదితమే. అతను గనుక తుది జట్టులో చోటు దక్కించుకొని మ్యాచ్ ఆడితే.. ఆసియా గేమ్స్ ఆడిన అతిపిన్న వయస్కుడిగా చరిత్రకెక్కనున్నాడు. ఆసియా గేమ్స్ 2026 బరిలో నిలిచిన అన్ని దేశాల్లోనూ అతి పిన్న వయస్కుడిగా వైభవ్ రికార్డ్ సాధిస్తాడు.
15 ఏళ్ల 178 రోజుల వయసులోనే వైభవ్ సూర్యవంశీ ఆసియా గేమ్స్ ఆడేందుకు సిద్దమయ్యాడు. మరోవైపు ఈ ఆసియా గేమ్స్‌లో అత్యంత పెద్ద వయస్కురాలైన అథ్లెట్ కూడా భారత్ నుంచే బరిలోకి దిగుతుండటం విశేషం. 55 ఏళ్ల భారత అశ్వ క్రీడాకారిణి శృతి ఈ ఘనతను సాధించారు.

ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లండ్ పర్యటనలో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన వైభవ్ సూర్యవంశీ.. జింబాబ్వేతో సిరీస్‌లో అద్వితీయమైన ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. ఇటీవల అఫ్గానిస్థాన్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో వైభవ్ సూర్యవంశీకి అవకాశం దక్కలేదు. జట్టులో ఉన్నా ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం ఇవ్వలేదు. ప్రపంచకప్ ఆడిన సంజూ శాంసన్, అభిషేక్ శర్మలనే మేనేజ్‌మెంట్ ఓపెనర్లుగా ఆడించింది.
అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటి వరకు 6 మ్యాచ్‌లు ఆడిన వైభవ్ సూర్యవంశీ 189.21 స్ట్రైక్‌రేట్‌తో 193 పరుగులు చేశాడు. ఇందులో 2 హాఫ్ సెంచరీలు ఉండగా.. టాప్ స్కోర్ 81. మెరుగైన ఐసీసీ ర్యాంక్ కారణంగా భారత జట్టు ఆసియా గేమ్స్ 2026లో సెప్టెంబర్ 28న నేరుగా క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌కు ముందు జపాన్‌తో మంగళవారం టీమిండియా స్నేహపూర్వక టీ20 మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీకి అవకాశం దక్కవచ్చు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


