Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs AFG: భారత్ జట్టులో దక్కని చోటు.. కృనాల్ పాండ్యా రియాక్షన్ ఇదే!

అఫ్గానిస్థాన్‌తో జరిగే మూడు టీ20ల సిరీస్‌కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని 15 మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను మంగళవారం ఎక్స్ వేదికగా వెల్లడించింది.

గాయాలతో జట్టుకు దూరమైన స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాతో పాటు హర్షిత్ రాణా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్‌లు పునరాగమనం చేశారు. అయితే ఈ నలుగురు ఫిట్‌నెస్ నిరూపించుకోవాలని బీసీసీఐ పేర్కొంది. ఫిట్‌నెస్ పరీక్షలో నెగ్గితేనే జట్టులో కొనసాగుతారని స్పష్టం చేసింది.

IND vs AFG: అఫ్గాన్‌తో టీ20 సిరీస్.. హార్దిక్, నితీష్ రెడ్డి రీఎంట్రీ! ఆ RCB ఆల్‌‌రౌండర్‌కు చోటు!

IND vs AFG: అఫ్గాన్‌తో టీ20 సిరీస్.. హార్దిక్, నితీష్ రెడ్డి రీఎంట్రీ! ఆ RCB ఆల్‌‌రౌండర్‌కు చోటు!

ఈ సిరీస్‌కు ఆర్‌సీబీ ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా‌ను ఎంపిక చేస్తారని ప్రచారం జరిగిన సెలెక్టర్లు ప్రకటించలేదు. ఈ జట్టు ప్రకటన అనంతరం కృనాల్ పాండ్యా సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. 'ఇంకా ఆశ చావలేదు'అని ఇన్‌స్టా స్టోరీలో పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ నెట్టింట వైరల్‌గా మారింది.

Krunal Pandya Shares Cryptic Post After Being Ignored for India s T20I Squad Against Afghanistan

35 ఏళ్ల కృనాల్ పాండ్యా టీమిండియా రీఎంట్రీ కోసం ఎదురు చూస్తున్నాడు. చివరిసారిగా అతను భారత్ తరఫున 2021లో శ్రీలంకతో టీ20 సిరీస్ ఆడాడు. జాతీయ జట్టుకు దూరంగా ఉన్నా.. ఐపీఎల్‌లో మాత్రం అద్భుతంగా ఆడుతున్నాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో ఆర్‌సీబీ తరఫున 14 వికెట్లు తీసాడు. ఐపీఎల్ 2025, 2026 సీజన్‌లో ఆర్‌సీబీ విజేతగా నిలిచినా.. ఆ జట్టు ఆటగాళ్లను సెలెక్టర్లు పరిగణనలోకి తీసుకుంటలేరనే విమర్శలు వినిపిస్తున్నాయి.

భువనేశ్వర్ కుమార్, రసిక్‌ధార్ సలామ్‌తో పాటు కెప్టెన్ రజత్ పాటిదార్, దేవదత్ పడిక్కల్‌‌లను టీ20 జట్టులోకి తీసుకోవడం లేదు. బ్యాటింగ్ ఆల్‌రౌండర్ అయిన కృనాల్ పాండ్యా జట్టుకు ప్రయోజనకరంగా మారుతాడని క్రికెట్ల విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

సెప్టెంబర్ 13, 15, 17 తేదీ‌ల్లో న్యూఢిల్లీ వేదికగా ఈ మూడు టీ20ల సిరీస్ జరగనుంది. ఈ సిరీస్‌కు అఫ్గానిస్థాన్ ఆతిథ్యం ఇస్తోంది. అఫ్గాన్‌లో సరైన క్రికెట్ మైదానాలు లేకపోవడంతో ఆ జట్టు దుబాయ్, భారత్ వేదికగా తమ ఆతిథ్య మ్యాచ్‌లు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

IPL 2026: ముంబై, CSK ను ఎగతాళి చేసిన కృనాల్ పాండ్యా..?(వీడియో)

Also Read

IPL 2026: ముంబై, CSK ను ఎగతాళి చేసిన కృనాల్ పాండ్యా..?(వీడియో)

అఫ్గాన్‌తో టీ20 సిరీస్ భారత జట్టు:

శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్(కీపర్), సంజూ శాంసన్(కీపర్), తిలక్ వర్మ(వైస్ కెప్టెన్) శివమ్ దూబే, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, జస్‌ప్రీత్ బుమ్రా*, హర్షిత్ రాణా*, నితీష్ కుమార్ రెడ్డి*, వాషింగ్టన్ సుందర్‌*.

Story first published: Wednesday, September 2, 2026, 9:42 [IST]
Other articles published on Sep 2, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+