Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రుతురాజ్ గైక్వాడ్ చెత్త కెప్టెన్.. అతని కెప్టెన్సీలో సీఎస్‌కే ప్లే ఆఫ్స్ కూడా చేరదు: సంజూ శాంసన్

చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ చెత్త కెప్టెన్ అని ఆ జట్టు స్టార్ బ్యాటర్ సంజూ శాంసన్ అన్నట్లు ఓ ఫేక్ న్యూస్ నెట్టింట వైరల్ అవుతుంది. రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలో సీఎస్‌కే ఫైనల్ కూడా చేరదని సంజూ అన్నట్లుగా ఉన్న ఈ పోస్ట్ నెట్టింట తీవ్ర చర్చనీయాంశమైంది.

అయితే ఈ ఫేక్ పోస్ట్ అని భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. ఏ ఇంటర్వ్యూలో కూడా సంజూ ఈ వ్యాఖ్యలు చేయలేదని తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా మాట్లాడుతూ స్పష్టం చేశాడు.

ఐపీఎల్ ట్రేడింగ్ వివరాలు బయటకు వెల్లడించాలి: సునీల్ గవాస్కర్

ఐపీఎల్ ట్రేడింగ్ వివరాలు బయటకు వెల్లడించాలి: సునీల్ గవాస్కర్

ఆ పోస్ట్‌లో ఏం ఉందంటే..?

సీఎస్‌కే తరఫున ఏ బాధ్యతలైనా చేపట్టేందుకు సిద్దంగా ఉన్నానని సంజూ అన్నట్లుగా ఈ ఫేక్ పోస్ట్‌ను క్రియేట్ చేశారు. 'రుతురాజ్ విఫలమయ్యాడు.. సీఎస్‌కే సారథ్య బాధ్యతలు అందుకునేందుకు సిద్దంగా ఉన్నారా? 'అని ఇంటర్వ్యూయర్ ప్రశ్నించగా.. 'అవును. సీఎస్‌కే తరఫున ఏ బాధ్యతలైనా చేపట్టేందుకు రెడీగా ఉన్నా. కెప్టెన్‌గా నాకు అనుభవం ఉంది. రుతురాజ్ సారథ్యంలో సీఎస్‌కే సాధించిందేం లేదు.

Did Sanju Samson Call Ruturaj Gaikwad a Poor Captain Aakash Chopra Reacts to CSK Captaincy Debate

అతనో చెత్త కెప్టెన్. వరల్డ్ బెస్ట్ ఎలెవన్ ఇచ్చినా అతను ఏం చేయలేడు. కనీసం సీఎస్‌కేను ప్లే ఆఫ్స్ కూడా చేర్చలేడు. సీఎస్‌కే నాకు కెప్టెన్సీ బాధ్యతలు ఇస్తే.. స్వీకరిస్తా. రుతురాజ్ ఏం చేయలేడు. అందుకే సీఎస్‌కే సారథ్య బాధ్యతలు చేపట్టాలనుకుంటున్నా.'అని సంజూ శాంసన్ అన్నట్లుగా ఫేక్ పోస్ట్ క్రియేట్ చేశారు.

నకిలీ పోస్ట్..

ఈ పోస్ట్‌పై స్పందించిన ఆకాశ్ చోప్రా.. ఫేక్ అని తేల్చేసాడు. అందరూ నమ్మదగిన రీతిలో రాసుకొచ్చారని పేర్కొన్నాడు. ఇలాంటి ఇంటర్వ్యూ జరగలేదని స్పష్టం చేశాడు. 'సీఎస్‌కే తరఫున ఎలాంటి బాధ్యతలైనా చెప్పట్టేందుకు సిద్దంగా ఉన్నానని సంజూ చెప్పాడు. ఇది సరైనదే. నమ్మదగిన రీతిలోనేఉంది. ఇంటర్వ్యూయర్ రుతురాజ్ విఫలమయ్యాడు. సీఎస్‌కే సారథ్య బాధ్యతలు చెపడుతారా? అని అడిగాడు. సంజూ.. అందుకు సిద్దంగా ఉన్నానని, సీఎస్‌కే కోసం ఏమైనా చేస్తానని, రుతురాజ్ సారథ్యంలోనే సీఎస్‌కే సాధించిందేం లేదన్నాడు.

IND vs SL: మలుపు తిప్పిన ప్రసిధ్ కృష్ణ.. భారత్‌కు భారీ ఆధిక్యం!

Also Read

IND vs SL: మలుపు తిప్పిన ప్రసిధ్ కృష్ణ.. భారత్‌కు భారీ ఆధిక్యం!

రుతురాజ్ చెత్త కెప్టెన్. అతను జట్టును ప్లే ఆఫ్స్ కూడా చేర్చలేడని చెప్పాడు. జనాలు ఈ పోస్ట్ చదివితే నిజమేనని అంటారు. సీఎస్‌కే కెప్టెన్సీకి సంజూనే సరైనవాడని కూడా అంటారు. అతనికి ఒక్క అవకాశం ఇవ్వాలని కూడా సూచిస్తారు. అయితే కొందరు మాత్రం ఈ ఇంటర్వ్యూ లింక్ అడిగారు. అయితే ఈ ఇంటర్వ్యూ ఎక్కడా జరగలేదు. సంజూ శాంసన్ ఎక్కడా ఇలా చెప్పలేదు. ఇది ఫేక్ న్యూస్. అసలు ఈ తరహా ఇంటర్వ్యూనే జరగలేదు. సంజూ అనలేదు'అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు. 2024 నుంచి సీఎస్‌కే ప్లే ఆఫ్స్ చేరలేదు.

Story first published: Monday, August 17, 2026, 18:45 [IST]
Other articles published on Aug 17, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+