Asian Games 2026: వైభవ్‌కు నో ఛాన్స్.. శ్రీలంకతో సెమీఫైనల్ ఆడే భారత జట్టు ఇదే!
ఆసియా గేమ్స్ 2026లో భారత పురుషుల క్రికెట్ జట్టు కీలక పోరుకు సిద్దమైంది. ఒక్క మ్యాచ్ ఆడకుండానే సెమీఫైనల్ చేరిన భారత్.. గురువారం జరిగే నాకౌట్ పోరులో శ్రీలంకతో అమీతుమీ తేల్చుకోనుంది. జపాన్‌లోని నిషిన్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో విజయమే లక్ష్యంగా భారత్ బరిలోకి దిగుతోంది. భారత కాలమానం ప్రకారం ఉదయం 10.30 గంటలకు మొదలవ్వనున్న ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది.
వర్షం కారణంగా క్వార్టర్ ఫైనల్స్ రద్దయిన సంగతి తెలిసిందే. సెమీఫైనల్ కూడా రద్దయితే మెరుగైన ఐసీసీ ర్యాంక్ కలిగిన భారత్..ఫైనల్ చేరనుంది. శ్రీలంక కాంస్య పోరు ఆడాల్సి ఉంటుంది. ఒకవేళ మ్యాచ్ జరిగినా.. భారత్‌కే విజయవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శ్రీలంకతో పోల్చితే భారత జట్టే హాట్ ఫేవరేట్. కానీ స్పిన్ కండిషన్స్‌లో శ్రీలంకను తక్కువ అంచనా వేయలేం. ఈ క్రమంలోనే టీమిండియా కాంబినేషన్ ఎలా ఉంటుందనేది? మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

వైభవ్ సూర్యవంశీకి అవకాశం దక్కేనా..?
టీమిండియా టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కుతుందా? లేదా బెంచ్‌కే పరిమితం చేస్తారా? అనేది చూడాలి. జపాన్‌తో ఏకైక టీ20లో వైభవ్‌ను బెంచ్‌కే పరిమితం చేయగా.. సంజూ శాంసన్, అభిషేక్ శర్మ తీవ్రంగా నిరాశపర్చారు. జపాన్ కండిషన్స్ స్పిన్‌కు అనుకూలంగా ఉన్నాయి. ఈ క్రమంలోనే స్పిన్ బాగా ఆడగల సంజూ శాంసన్‌నే తుది జట్టులో కొనసాగించే అవకాశం ఉంది. దాంతో వైభవ్ బెంచ్‌కే పరిమితం కావాల్సిన పరిస్థితి నెలకొంది. వీవీఎస్ లక్ష్మణ్ ఏం నిర్ణయం తీసుకుంటాడో చూడాలి. మిగతా కాంబినేషన్‌లో పెద్దగా మార్పులు జరిగే అవకాశం అయితే లేదు.
సుందర్ డౌట్..
అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ ఓపెనింగ్ చేయనుండగా.. ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మ మిడిలార్డర్‌లో ఆడనున్నారు. అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, వాషింగ్టన్ సుందర్ స్పిన్నర్లుగా ఆడనుండగా.. జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్ పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు. పేస్ ఆల్‌రౌండర్‌గా శివమ్ దూబే బరిలోకి దిగనున్నాడు. వాషింగ్టన్ సుందర్‌కు విప్రజ్ నిగమ్ రూపంలో పోటీ నెలకొంది. యశ్ ఠాకూర్ బెంచ్‌కే పరిమితం కానున్నాడు.
శ్రీలంకతో సెమీఫైనల్ ఆడే భారత తుది జట్టు(అంచనా)
సంజూ శాంసన్/వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మ, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్.
ఆసియా గేమ్స్ 2026కు ఎంపికైన భారత జట్టు
సంజూ శాంసన్/వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మ, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, విప్రజ్ నిగమ్, యశ్ ఠాకూర్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


