Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India Playing XI: గేమ్ ప్లాన్‌లో చిన్న మార్పు.. విండీస్‌తో ఫైనల్ టీ20 ఆడే భారత తుది జట్టు ఇదే!

వెస్టిండీస్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో ఆఖరి పోరుకు టీమిండియా సిద్దమైంది. భారీ స్కోర్లు నమోదైన ఈ సిరీస్‌లో ఇరు జట్లు రెండేసి విజయాలతో 2-2తో సమంగా నిలిచాయి. దాంతో బెంగళూరు వేదికగా శనివారం జరిగే ఆఖరి టీ20.. సిరీస్ డిసైడర్‌గా మారింది. బెంగళూరులోని చిన్నస్వామి మైదానం కూడా బ్యాటింగ్ ఫ్రెండ్లీ స్టేడియం కావడంతో మరోసారి సిక్సర్ల వర్షం కురిసే అవకాశం ఉంది.

ఈ సిరీస్‌తో భారత బౌలింగ్ లుకలుకలు బయటపడిన నేపథ్యంలో ఆఖరి మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. బౌలర్లు పుంజుకుంటారా? అనే చర్చ కూడా సాగుతోంది. నాలుగో టీ20 పరాజయం నుంచి పాఠం నేర్చుకొని ఆఖరి టీ20లో విజయం సాధించాలనే పట్టుదలతో టీమిండియా ఉంది. మరోవైపు తమకు అలవాటైన రీతిలోనే సత్తా చాటి సిరీస్ ఎగరేసుకుపోవాలని వెస్టిండీస్ భావిస్తోంది.

India Playing XI For 5th T20I vs WI Gautam Gambhir Set to Change Game Plan Kuldeep Yadav Likely to Return

టీమిండియా కాంబినే‌షన్‌లో మార్పు..

ఉప్పల్ వేదికగా జరిగిన నాలుగో టీ20లో భారత్ 24 పరుగుల తేడాతో ఓటమిపాలవ్వడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బ్యాటింగ్, బౌలింగ్‌తో పాటు టీమ్ కాంబినేషన్, గేమ్ ప్లాన్‌‌ను మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. కామన్‌సెన్స్ లేకుండా మ్యాచ్ విన్నర్ అయిన కుల్దీప్ యాదవ్‌ను పక్కన పెట్టారని అశ్విన్ ఘాటుగా విమర్శించాడు. ఈ క్రమంలోనే టీమిండియా కాంబినేషన్‌లో పలు మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

IND vs WI: అయ్యర్, గంభీర్‌కు కామన్‌సెన్స్ లేదు: అశ్విన్

IND vs WI: అయ్యర్, గంభీర్‌కు కామన్‌సెన్స్ లేదు: అశ్విన్

రిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను మళ్లీ తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. ఎక్స్‌ట్రా పేసర్‌గా ప్రిన్స్ యాదవ్‌ను ఆడించడంతో కుల్దీప్ యాదవ్ బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఇండోర్ టీ20లో ఈ కాంబినేషన్ ఫలితాన్ని ఇచ్చినా.. ఉప్పల్ మ్యాచ్‌లో మాత్రం మిస్‌ఫైర్ అయింది. ఈ క్రమంలోనే బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండే చిన్నస్వామి స్టేడియంలో కుల్దీప్ యాదవ్‌ను బరిలోకి దించే అవకాశం ఉంది.

పరుగుల నియంత్రణ కంటే వికెట్లు తీసే బౌలర్లకు మేనేజ్‌మెంట్ ప్రాధాన్యత ఇవ్వవచ్చు. దాంతోనే కుల్దీప్‌కు అవకాశం దక్కనుంది. కుల్దీప్ జట్టులోకి వస్తే ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్‌లో ఒకరు బెంచ్‌కే పరిమితం కానున్నారు.


వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్..

టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇస్తారా? లేదా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. గత నాలుగు మ్యాచ్‌లుగా అతను బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఈ నాలుగు మ్యాచ్‌ల్లో సంజూ, అభిషేక్ చెరో రెండు మ్యాచ్‌ల్లో రాణించారు. భారత్ సిరీస్ కూడా గెలవకపోవడంతో వైభవ్‌కు అవకాశం ఇస్తారా? లేక బెంచ్‌కే పరిమితం చేస్తారా? అనేది సందేహంగా మారింది. అభిషేక్ శర్మకు రెస్ట్ ఇచ్చి వైభవ్‌ను ఆడించాలనే వాదన వినిపిస్తోంది. కానీ గౌతమ్ గంభీర్ ఏ నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.

IND vs WI: ఆఖరి టీ20లో భారత్ గెలవాలంటే అతన్ని జట్టులోకి తీసుకోవాలి: మాజీ క్రికెటర్

Also Read

IND vs WI: ఆఖరి టీ20లో భారత్ గెలవాలంటే అతన్ని జట్టులోకి తీసుకోవాలి: మాజీ క్రికెటర్

మిగతా కాంబినేషన్‌లో పెద్దగా మార్పులు జరిగే అవకాశం లేదు. సంజూ శాంసన్, అభిషేక్ శర్మ లేదా వైభవ్‌లు ఓపెనింగ్ చేయనుండగా.. ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మ, నమన్ ధీర్, నితీష్ రెడ్డి, అక్షర్ పటేల్ మిడిలార్డర్ బాధ్యతలు పంచుకోనున్నారు. అర్ష్‌దీప్ సింగ్ ఫీట్‌గా ఉంటే మయాంక్ యాదవ్, ప్రిన్స్ యాదవ్‌లో ఒకరితో కలిసి పేస్ విభాగాన్ని లీడ్ చేయనున్నారు. అర్ష్‌దీప్ ఫిట్‌గా లేకుంటే మయాంక్, ప్రిన్స్ యాదవ్ బరిలోకి దిగుతారు. కుల్దీప్ యాదవ్, నమన్ ధీర్, అక్షర్ పటేల్ స్పిన్ బాధ్యతలు పంచుకోనున్నారు.

వెస్టిండీస్‌తో రెండో టీ20కి భారత తుది జట్టు(అంచనా)

సంజూ శాంసన్, అభిషేక్ శర్మ/వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), తిలక్ వర్మ(వైస్ కెప్టెన్), నితీష్ కుమార్ రెడ్డి, నమన్ ధీర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్/ప్రిన్స్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, మయాంక్ యాదవ్

వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు

వైభవ్ సూర్యవంశీ, సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), తిలక్ వర్మ(వైస్ కెప్టెన్), శివమ్ దూబే, నమన్ ధీర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, మయాంక్ యాదవ్, ప్రిన్స్ యాదవ్, రవి బిష్ణోయ్, నితీష్ కుమార్ రెడ్డి.

Story first published: Friday, October 16, 2026, 9:55 [IST]
Other articles published on Oct 16, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+