IND vs NZ: వ్యూహాత్మక మార్పు.. న్యూజిలాండ్‌తో ఆఖరి టీ20 ఆడే భారత తుది జట్టు ఇదే!
న్యూజిలాండ్ పర్యటనలో వరుస విజయాలతో జోరు మీదున్న టీమిండియాకు ఆతిథ్య జట్టు బ్రేక్ వేసింది. వెల్లింగ్టన్ వేదికగా శుక్రవారం జరిగిన నాలుగో టీ20లో సమష్టిగా రాణించిన న్యూజిలాండ్ 87 పరుగుల తేడాతో భారత్‌ను చిత్తు చేసింది. ఈ అనూహ్య పరాజయంతో క్లీన్ స్వీప్ చేసే సువర్ణవకాశాన్ని చేజార్చుకున్న భారత్.. ఆఖరి పోరుకు సిద్దమైంది.
ఆదివారం హామిల్టన్ వేదికగా జరిగే ఆఖరి మ్యాచ్‌లో ఆతిథ్య న్యూజిలాండ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్ గెలిచి విజయ ఉత్సాహంతో వన్డే సిరీస్ బరిలోకి దిగాలని భారత్ భావిస్తుండగా.. న్యూజిలాండ్ కూడా నాలుగో మ్యాచ్ తరహాలోనే గెలిచి సిరీస్‌ను 3-2గా మార్చాలనే పట్టుదలతో ఉంది.
వ్యూహాత్మక మార్పు..
ఆఖరి మ్యాచ్‌కు టీమిండియా కాంబినేషన్‌లో మార్పు జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా స్పెషలిస్ట్ స్పిన్నర్‌తో బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. కుల్దీప్ యాదవ్ లేదా వరుణ్ చక్రవర్తీలో ఒకరు ఆడనుండగా.. నితీష్ కుమార్ రెడ్డిని బెంచ్‌కు పరిమితం చేయవచ్చు. భువనేశ్వర్ కుమార్‌ను తిరిగి తుది జట్టులోకి తీసుకోవచ్చు. అప్పుడు మయాంక్ యాదవ్ బెంచ్‌కు పరిమితమవుతాడు.

మిగతా కాంబినేషన్‌లో పెద్దగా మార్పులు జరిగే అవకాశం లేదు. ఓపెనర్లుగా సంజూ శాంసన్, అభిషేక్ శర్మ ఆడనుండగా.. ఇషాన్ కిషన్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మ, అక్షర్ పటేల్, నమన్ ధీర్ మిడిలార్డర్‌లో ఆడనున్నారు. అర్ష్‌దీప్ సింగ్, భువనేశ్వర్ కుమార్, ప్రిన్స్ యాదవ్ పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు. మయాంక్ యాదవ్‌ను ఆడించాలనుకుంటే అర్ష్‌దీప్ సింగ్‌కు రెస్ట్ ఇవ్వవచ్చు.
న్యూజిలాండ్‌తో ఆఖరి టీ20 ఆడే భారత జట్టు ఇదే
అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి/కుల్దీప్ యాదవ్/వరుణ్ చక్రవర్తీ, నమన్ ధీర్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, ప్రిన్స్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్/మయాంక్ యాదవ్.
భారత టీ20 టీమ్
శ్రేయస్ అయ్యర్, అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, అక్షర్ పటేల్, శివమ్ దూబే, నితీష్ కుమార్ రెడ్డి, నమన్ ధీర్, ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, భువనేశ్వర్ కుమార్, వరుణ్ చక్రవర్తీ, కుల్దీప్ యాదవ్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


