IND vs NZ: వైభవ్ సూర్యవంశీని తప్పించడం సరైన నిర్ణయమే: స్టీఫెన్ ఫ్లేమింగ్
న్యూజిలాండ్‌తో నాలుగో టీ20లో టీమిండియా టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీని తప్పించి ఇషాన్ కిషన్‌ను ఆడించడం సరైన నిర్ణయమేనని సీఎస్‌కే మాజీ హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ అన్నాడు. ఇషాన్ కిషన్‌కు అవకాశం ఇవ్వడం ద్వారా ఆటగాళ్లకు అండగా ఉంటామనే సందేశాన్ని టీమిండియా మేనేజ్‌మెంట్ ఇచ్చిందని ప్రశంసించాడు.
గజ్జలో గాయంతో రెండు మ్యాచ్‌లకు దూరమైన ఇషాన్ కిషన్.. వెల్లింగ్టన్ వేదికగా శుక్రవారం జరిగిన నాలుగో టీ20తో పునరాగమనం చేశాడు. కానీ డకౌట్‌గా వెనుదిరిగి తీవ్రంగా నిరాశపర్చాడు. ఈ మ్యాచ్‌లో భారత్ 87 పరుగులతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. అయితే మూడో టీ20లో విధ్వంసకర బ్యాటింగ్‌తో 19 బంతుల్లోనే 45 పరుగులు చేసిన వైభవ్ సూర్యవంశీని అనవసరంగా తప్పించారని పలువురు నెటిజన్లు అభిప్రాయపడ్డారు. ఫామ్‌లో ఉన్న వైభవ్‌ను కొనసాగించాల్సిందని మేనేజ్‌మెంట్‌పై మండిపడ్డారు.

కానీ స్టీఫెన్ ఫ్లేమింగ్ మాత్రం టీమిండియా మేనేజ్‌మెంట్ నిర్ణయాన్ని సమర్ధించాడు. 'భవిష్యత్తులో వైభవ్ సూర్యవంశీకి తప్పకుండా అవకాశం లభిస్తుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ భారత జట్టు తీసుకున్న ఈ నిర్ణయం ఆటగాళ్లకు గొప్ప శుభవార్త. టీ20 క్రికెట్‌లో నిలకడలేమి ఆట, రిస్క్ తీసుకోని, క్లిష్ట పరిస్థితుల్లో బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. అలాంటి సమయంలో తమ స్థానాన్ని కోల్పోతామనే భయం, సందేహం కూడా ఆటగాళ్లలో ఉంటుంది. అప్పుడు వారు స్వేచ్ఛగా ఆడలేరు.
జట్టు కోసం ఎలా ఆడినా తమ స్థానానికి డోకా లేదనే భరోసా ఉంటే ఆటగాళ్లు దూకుడుగా ఆడుతారు. ఇషాన్ కిషన్‌ను ఆడించడం ద్వారా ఆ భరోసాను ఆటగాళ్లకు భారత మేనేజ్‌మెంట్ కల్పించింది.'అని స్టీఫెన్ ఫ్లేమింగ్ చెప్పుకొచ్చాడు. న్యూజిలాండ్‌తో తొలి టీ20 సమయంలోనే ఇషాన్ కిషన్‌కు గాయమైంది. దాంతో రెండు, మూడో టీ20 మ్యాచ్‌లను వైభవ్ ఆడాడు. ఈ ఐదు టీ20ల సిరీస్‌ను భారత్ 3-1తో గెలుచుకుంది. వరుసగా మూడు మ్యాచ్‌లు గెలిచిన భారత్.. నాలుగో టీ20లో న్యూజిలాండ్ షాకిచ్చింది. ఆఖరి టీ20 ఆదివారం జరగనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


