India Playing XI: బుడ్డోడికి నిరాశే.. వెస్టిండీస్‌తో నాలుగో టీ20 ఆడే భారత తుది జట్టు ఇదే!
వెస్టిండీస్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో పై చేయి సాధించిన టీమిండియా మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. బుధవారం హైదరాబాద్ వేదికగా జరిగే నాలుగో టీ20లో పర్యాటక వెస్టిండీస్‌తో టీమిండియా అమీతుమీ తేల్చుకోనుంది. తొలి మూడు టీ20ల్లో రెండు గెలిచి ఒకటి ఓడిన టీమిండియా 2-1 తేడాతో సిరీస్‌లో పైచేయి సాధించింది. హైదరాబాద్ వేదికగా జరిగే మ్యాచ్ కూడా గెలిచి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది.
తద్వారా ఆఖరి మ్యాచ్‌లో బెంచ్ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వాలని భావిస్తోంది. మరోవైపు రెండో టీ20 తరహాలో పుంజుకొని విజయం సాధించాలనే పట్టుదలతో వెస్టిండీస్ ఉంది. తద్వారా ఐదు టీ20ల సిరీస్ రేసులో నిలవాలని భావిస్తోంది. హైదరాబాద్ పిచ్ పూర్తిగా బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండనున్న నేపథ్యంలో ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

వైభవ్ సూర్యవంశీకి నిరాశే..
ఇండోర్ వేదికగా జరిగిన మూడో టీ20లో టీమిండియా రెండు మార్పులతో బరిలోకి దిగింది. ఎక్స్‌ట్రా పేసర్‌గా కుల్దీప్ యాదవ్ స్థానంలో ప్రిన్స్ యాదవ్‌ను ఆడించగా.. శివమ్ దూబే ప్లేస్‌లో ఆల్‌రౌండర్‌గా నితీష్ కుమార్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. హైదరాబాద్ వేదికగా జరిగే నాలుగో టీ20లోనూ ఇదే కాంబినేషన్‌ను కొనసాగించే అవకాశం ఉంది. లోకల్ ప్లేయర్‌గా నితీష్‌ను కొనసాగించనున్నారు. ఎక్స్‌ట్రా స్పిన్నర్‌ను ఆడించాలనుకుంటే.. ప్రిన్స్ యాదవ్ స్థానంలో కుల్దీప్ యాదవ్ బరిలోకి దిగనున్నాడు.
మూడో టీ20లో సంజూ శాంసన్ విఫలమైనా.. అతన్నే కొనసాగించనున్నారు. హైదరాబాద్‌లో అతనికి మెరుగైన రికార్డ్ ఉంది. దాంతో వైభవ్ సూర్యవంశీకి నిరాశే ఎదురవ్వనుంది. మిగతా కాంబినేషన్‌లో పెద్దగా మార్పులు జరిగే అవకాశం లేదు. అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ ఇన్నింగ్స్ ప్రారంభించనుండగా.. ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, నితీష్ రెడ్డి, నమన్ ధీర్ మిడిలార్డర్‌లో ఆడనున్నారు. అర్ష్‌దీప్ సింగ్ పేస్ బాధ్యతలను లీడ్ చేయనున్నాడు.
వెస్టిండీస్‌తో రెండో టీ20కి భారత తుది జట్టు(అంచనా)
సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), తిలక్ వర్మ(వైస్ కెప్టెన్), నితీష్ కుమార్ రెడ్డి, నమన్ ధీర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్/ప్రిన్స్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, మయాంక్ యాదవ్
వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు
వైభవ్ సూర్యవంశీ, సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), తిలక్ వర్మ(వైస్ కెప్టెన్), శివమ్ దూబే, నమన్ ధీర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, మయాంక్ యాదవ్, ప్రిన్స్ యాదవ్, రవి బిష్ణోయ్, నితీష్ కుమార్ రెడ్డి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


