IND vs NZ: గ్లేన్ ఫిలిప్స్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం!
ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా భారత్‌తో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ 226 పరుగుల భారీ లక్ష్యాన్ని నమోదు చేసింది. గ్లెన్ ఫిలిప్స్(40 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో 82 నాటౌట్) విధ్వంసకర బ్యాటింగ్‌తో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 225 పరుగులు చేసింది. ఫిన్ అలెన్(24 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 45), బెవాన్ జాకోబ్స్(16 బంతుల్లో 3 ఫోర్లతో 31) దూకుడుగా ఆడారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, మయాంక్ యాదవ్, అక్షర్ పటేల్ తలో వికెట్ తీసారు.
ఓపెనర్ల విధ్వంసం..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌కు ఓపెనర్లు ఫిన్ అలెన్, టీమ్ సీఫెర్ట్ అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. నాలుగేళ్ల తర్వాత టీమిండియాలోకి వచ్చిన భువనేశ్వర్ కుమార్ తన పునరాగమనాన్ని ఘనంగా చాటుకోలేకపోయాడు. తొలి ఓవర్‌ను అద్భుతంగా వేసినా.. తర్వాత ఓవర్లలో దారళంగా పరుగులు సమర్పించుకున్నాడు.

అయితే అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో ఫిన్ అలెన్ బౌండరీ బాదగా.. భువనేశ్వర్ వేసిన మూడో ఓవర్‌లో టీమ్ సీఫెర్ట్ రెండు బౌండరీలు, సిక్స్‌తో 17 పరుగులు పిండుకున్నాడు. దూకుడుగా ఆడుతున్న ఈ జోడీని మయాంక్ యాదవ్ విడదీసాడు. గంటకు 140 కిలోమీటర్ల వేగంతో నిలకడగా బంతులు వేసిన మయాంక్ యాదవ్.. టీమ్ సీఫెర్ట్(24)ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. దాంతో తొలి వికెట్‌కు నమోదైన 49 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
క్యాచ్ డ్రాప్ చేసినా..
క్రీజులోకి వచ్చిన డారిల్ మిచెల్ వచ్చి రావడంతోనే భారీ సిక్సర్ బాదాడు. దాంతో పవర్ ప్లేలో న్యూజిలాండ్ వికెట్ నష్టానికి 65 పరుగులు చేసింది. అనంతరం భారీ సిక్సర్లతో దూకుడుగా ఆడే ప్రయత్నం చేసిన ఫిన్ అలెన్(45)ను అక్షర్ పటేల్ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. క్రీజులోకి గ్లేన్ ఫిలిప్స్ రాగా.. 16 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద మయాంక్ యాదవ్ బౌలింగ్‌లో డారిల్ మిచెల్ ఇచ్చిన క్యాచ్‌ను లాంగాన్‌లో అభిషేక్ శర్మ నేలపాలు చేశాడు.
ఫిలిప్స్ విధ్వంసం..
ఈ అవకాశంతో డారిల్ మిచెల్ వరుసగా బౌండరీలు బాదాడు. అతన్ని అర్ష్‌దీప్ సింగ్ క్యాచ్ ఔట్ చేయగా.. బెవాన్ జాకబ్స్‌తో కలిపి ఫిలిప్స్ చెలరేగాడు. మయాంక్ యాదవ్ బౌలింగ్‌లో మిడ్ వికెట్ దిశగా సిక్సర్ బాదిన గ్లేన్ ఫిలిప్స్ 27 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. బెవాన్ జాకబ్స్ కూడా చెలరేగడంతో న్యూజిలాండ్‌కు వేగంగా పరుగులు వచ్చాయి. దూకుడుగా ఆడుతున్న బెవాన్ జాకబ్స్‌ను అర్ష్‌దీప్ సింగ్ రనౌట్ చేశాడు. దాంతో నాలుగో వికెట్‌కు నమోదైన 73 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
మైఖేల్ బ్రెస్‌వెల్ సాయంతో ఫిలిప్స్ జట్టు స్కోర్‌ను 200 ధాటించాడు. అనంతరం మరింత దూకుడుగా ఆడిన అతను చివరి 10 బంతుల్లో 25 పరుగులు రాబట్టి భారీ లక్ష్యాన్ని నమోదు చేశాడు. నాలుగేళ్ల తర్వాత పునరాగమనం చేసిన భువనేశ్వర్ కుమార్ తీవ్రంగా నిరాశపర్చాడు. 4 ఓవర్లలో 49 పరుగులు సమర్పించుకున్నాడు. ఇందులో రెండు వైడ్స్, రెండు నోబాల్స్ ఉండటం గమనార్హం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


