Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India Playing XI: సంజూ ఔట్.. వైభవ్ ఇన్! బుమ్రా డౌట్! అఫ్గాన్‌తో రెండో టీ20 ఆడే భారత జట్టు ఇదే!

అఫ్గానిస్థాన్‌తో మూడు టీ20ల సిరీస్‌లో శుభారంభం చేసిన భారత్.. మరో ఆసక్తికరపోరుకు సిద్దమైంది. న్యూఢిల్లీ వేదికగానే మంగళవారం జరిగే రెండో టీ20లో ఆతిథ్య అఫ్గానిస్థాన్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్‌లోనూ విజయం సాధించి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకోవాలనే పట్టుదలతో టీమిండియా ఉంది. మరోవైపు రెండో టీ20లో ఎలాగైనా గెలిచి సిరీస్‌పై ఆశలు సజీవంగా ఉంచుకోవాలని అఫ్గానిస్థాన్ భావిస్తోంది. దాంతో ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగే అవకాశం ఉంది.

అది అన్యాయమే.. కానీ నాకు మరో ఆప్షన్ లేదు: శ్రేయస్ అయ్యర్

అది అన్యాయమే.. కానీ నాకు మరో ఆప్షన్ లేదు: శ్రేయస్ అయ్యర్

వైభవ్ ఇన్.. సంజూ ఔట్

రెండో టీ20కి భారత తుది జట్టులో పలు మార్పులు జరిగే అవకాశం ఉంది. టీమిండియా టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ రీఎంట్రీ ఇవ్వవచ్చు. తొలి టీ20లోనే అతన్ని ఆడించకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. వైభవ్ కోసమే ఈ సిరీస్ చూడాలనుకున్నామని చాలా నెటిజన్లు కామెంట్స్ చేశారు. అంతేకాకుండా తొలి మ్యాచ్‌లో సంజూ శాంసన్ నిరాశపర్చాడు. వైభవ్ వస్తే సంజూ బెంచ్‌కే పరిమితమవుతాడు. అతనికి మరో అవకాశం ఇవ్వాలనుకుంటే మాత్రం వైభవ్ బెంచ్‌కే పరిమితమవుతాడు.

India Playing XI For 2nd T20I Vs Afghanistan Vaibhav Sooryavanshi In Sanju Samson Out Bumrah Doubt

జస్‌ప్రీత్ బుమ్రా డౌట్..

తొలి టీ20 ఆడిన జస్‌ప్రీత్ బుమ్రాకు రెండో టీ20 నుంచి విశ్రాంతి ఇవ్వవచ్చు. వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా అతని స్థానంలో యశ్ ఠాకూర్‌ను ఆడించవచ్చు. ఈ రెండు మార్పులు మినహా తుది జట్టును అలానే కొనసాగించనున్నారు. వాషింగ్టన్ సుందర్, రవిబిష్ణోయ్ మరోసారి బెంచ్‌కే పరిమితం కావచ్చు. ఓపెనర్లుగా అభిషేక్ శర్మతో పాటు సంజూ, వైభవ్‌లో ఒకరు ఆడనుండగా.. ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మ, శివమ్ దూబే, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్ మిడిలార్డర్‌లో ఆడనున్నారు.

స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా వరుణ్ చక్రవర్తీ ఆడనుండగా.. అర్ష్‌దీప్ సింగ్, యశ్ ఠాకూర్ పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు. తొలి టీ20లో సంజూ శాంసన్ మినహా భారత ఆటగాళ్లు సత్తా చాటారు. బౌలర్లు సమష్టిగా రాణించగా.. బ్యాటింగ్ అవకాశం బ్యాటర్లు సత్తా చాటారు. అభిషేక్ శర్మ విధ్వంసకర బ్యాటింగ్‌తో ఫామ్ అందుకున్నాడు. మరోసారి అతను చెలరేగితే భారత్‌కు తిరుగుండదు.

IND vs AFG: ఆ రనౌట్ మ్యాచ్‌ను మలుపు తిప్పింది: అఫ్గాన్ కెప్టెన్

Also Read

IND vs AFG: ఆ రనౌట్ మ్యాచ్‌ను మలుపు తిప్పింది: అఫ్గాన్ కెప్టెన్

అఫ్గాన్‌తో రెండో టీ20కి భారత తుది జట్టు(అంచనా)

అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ/సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మ, శివమ్ దూబే, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తీ, జస్‌ప్రీత్ బుమ్రా/యశ్ ఠాకూర్, అర్ష్‌దీప్ సింగ్.

అఫ్గాన్‌తో భారత జట్టు

అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మ, శివమ్ దూబే, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తీ, జస్‌ప్రీత్ బుమ్రా, యశ్ ఠాకూర్, అర్ష్‌దీప్ సింగ్, రవి బిష్ణోయ్, వాషింగ్టన్ సుందర్.

Story first published: Monday, September 14, 2026, 14:17 [IST]
Other articles published on Sep 14, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+