IND vs ENG: తిలక్, ఇషాన్‌పై వేటు.. సంజూకు చోటు! ఆఖరి టీ20కి భారత జట్టు ఇదే!
ఇంగ్లండ్ పర్యటనలో వరుస పరాజయాలతో సిరీస్ కోల్పోయిన టీమిండియా నామమాత్రపు ఆఖరి టీ20కి సిద్దమైంది. శనివారం సౌతాంప్టన్ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో గెలుపే లక్ష్యంగా శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని టీమిండియా బరిలోకి దిగుతోంది. కనీసం ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలని టీమిండియా భావిస్తోంది.
మరోవైపు ఈ మ్యాచ్ కూడా గెలిచి అంతర్జాతీయ టీ20 ర్యాంకింగ్స్‌లో భారత్‌ను వెనక్కినెట్టి అగ్రస్థానాన్ని కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఇంగ్లండ్ ఉంది. నాలుగో టీ20 విజయానంతరం ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ ఇదే విషయాన్ని తెలియజేశాడు. టీ20ల్లో అగ్రస్థానాన్ని అందుకోవడమే తమ లక్ష్యమని చెప్పాడు. దాంతో ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగే అవకాశం ఉంది.

భారత జట్టులో భారీ మార్పులు..
పేలవ బ్యాటింగ్, చెత్త బౌలింగ్‌తో వరుస పరాజయాలను మూటగట్టుకున్న టీమిండియా.. ఆఖరి మ్యాచ్‌లో భారీ మార్పులు చేసే అవకాశం ఉంది. సంజూ శాంసన్ స్థానంలో వరుసగా మూడు మ్యాచ్‌లు ఆడి తీవ్రంగా నిరాశపర్చిన వైభవ్‌ను పక్కనపెట్టవచ్చు. లేదంటే అతన్ని కొనసాగించి ఇషాన్ కిషన్‌పై వేటు వేసి సంజూ శాంసన్‌ను ఫస్ట్ డౌన్‌లో ఆడించవచ్చు. ఏది ఏమైనా సంజూ శాంసన్ రీఎంట్రీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. అవసరమైతే అభిషేక్ శర్మకే రెస్ట్ ఇవ్వవచ్చు.
ఇషాన్ కిషన్ కూడా ఐర్లాండ్‌తో పాటు ఇంగ్లండ్‌తో సిరీస్‌లో తీవ్రంగా నిరాశపర్చాడు. ఐర్లాండ్‌తో రెండు టీ20ల్లో 1, 12 పరుగులు చేసిన ఇషాన్.. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో వరుసగా 0, 49, 13, 4 పరుగులు చేసి తీవ్రంగా నిరాశపర్చాడు. రెండో టీ20లో 49 పరుగులు చేసినా స్లోగా బ్యాటింగ్ చేసి విమర్శలపాలయ్యాడు.
తిలక్ వర్మపై వేటు..?
శివమ్ దూబే కూడా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. అతన్ని తప్పించాలనుకుంటే యువ ఆల్‌రౌండన్ సూర్యాన్ష్ షెడ్జే తుది జట్టులోకి వస్తాడు. వైస్ కెప్టెన్ తిలక్ వర్మ కూడా దారుణంగా విఫలమయ్యాడు. టాపార్డర్‌ను కొనసాగించాలనుకుంటే సంజూ శాంసన్ కోసం తిలక్‌పై వేటు వేయవచ్చు. లేదంటే శివమ్ దూబేను కొనసాగించి సూర్యాన్ష్ కోసం తిలక్‌ను తప్పించవచ్చు. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో తిలక్ వర్మ వరుసగా 13, 24, 3, 11 పరుగులే చేశాడు. ఇప్పటికే అతనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
అక్షర్ పటేల్ స్పిన్ ఆల్‌రౌండర్‌గా కొనసాగనుండగా.. వరుణ్ చక్రవర్తీ గాయం నుంచి కోలుకుంటే బరిలోకి దిగుతాడు. లేదంటే వాషింగ్టన్ సుందర్ జట్టులో కొనసాగుతాడు. పేస్ బౌలర్లుగా ప్రిన్స్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిధ్ కృష్ణ బరిలోకి దిగనున్నారు. హర్షిత్ రాణా కోలుకుంటే ప్రసిధ్ కృష్ణపై వేటు పడనుంది.
ఇంగ్లండ్‌తో ఆఖరి టీ20కి భారత తుది జట్టు(అంచనా)
వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, సంజూ శాంసన్/ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, శివమ్ దూబే, తిలక్ వర్మ/సూర్యాన్ష్ షెడ్జే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్/వరుణ్ చక్రవర్తీ, హర్షిత్ రాణా/ప్రసిధ్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

