ఆడు మగాడ్రా బుజ్జీ.. చెప్పి మరి ఔట్ చేశాడు!
ఐపీఎల్ 2026 సీజన్లో వైభవ్ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగి ప్రపంచంలోనే బెస్ట్ బౌలర్లను కూడా ఓ ఆటాడుకున్నాడు. సీజన్లోని 16 ఇన్నింగ్స్‌లలో 776 పరుగులు చేసి వైభవ్ సూర్యవంశీ ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నాడు. జస్ప్రీత్ బుమ్రా నుంచి ప్యాట్ కమిన్స్ వరకు.. అందరి బౌలింగ్ లో తొలి బంతికే సిక్సర్ బాదాడు. ఆ సమయంలో జోఫ్రా ఆర్చర్, వైభవ్ సూర్యవంశీ ఒకే జట్టులో ఉండటంతో.. ఆర్చర్ ఎప్పుడూ వైభవ్ సూర్యవంశీని ఎదుర్కోలేదు. రాజస్థాన్ రాయల్స్ ప్రాక్టీస్ సెషన్లలో వైభవ్ సూర్యవంశీకి బౌలింగ్ చేసి అతని బలహీనతలను ఆర్చర్ కనిపెట్టాడు. తాజాగా దేశం తరఫున ఆడిన 3 ఇన్నింగ్స్‌లలో రెండింటిలో అతడిని ఔట్ చేసి ఇంటర్నేషనల్ క్రికెట్లోకి స్వాగతం పలికాడు. అంతే కాకుండా ఐపీఎల్ 2026లో ఓ ఇంటర్వ్యూ సందర్భంగా జోఫ్రా ఆర్చర్ ఈ విషయాన్ని పరోక్షంగా పేర్కొనడం విశేషం
తాను చెప్పినట్లే చేసిన జోఫ్రా ఆర్చర్
రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎలిమినేటర్లో వైభవ్ సూర్యవంశీ 29 బంతుల్లో 97 పరుగులు చేశాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగవంతమైన సెంచరీకి సంబంధించి క్రిస్ గేల్ రికార్డు బ్రేక్ చేయనప్పటికీ.. రాజస్థాన్ రాయల్స్ జట్టు 47 పరుగుల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం ఇంటర్వ్యూలో వైభవ్ సూర్యవంశీని అడ్డుకునేందుకు ఎక్కడ బౌలింగ్ చేస్తారని జోఫ్రా ఆర్చర్‌ను అడిగారు. ఈ క్రమంలో ఆర్చర్ ఐపీఎల్ అయిపోయాక ఈ ప్రశ్నకు సమాధానమిస్తానని జోఫ్రా ఆర్చర్ బదులిచ్చాడు. అది వించే ఆర్చర్ సరదాగా అన్నట్లు అనిపించింది. కానీ భారత్-ఇంగ్లాండ్ సిరీస్లో జోఫ్రా ఆర్చర్ వైభవ్ సూర్యవంశీని రెండు సార్లు ఔట్ చేసిన తీరు చూస్తే.. రెండు నెలల పాటు జరిగిన ఐపీఎల్ టోర్నీలో ఆర్చర్ వైభవ్ బలహీనతలను క్షుణ్ణంగా గుర్తించాడని స్పష్టంగా తెలుస్తోంది.

వైభవ్ సూర్యవంశీ ఎక్కడ దొరికిపోయాడు?
వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్‌లో జోఫ్రా ఆర్చర్ వంటి బౌలర్లను కూడా ఎదుర్కొన్నాడు. మరి ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ ఎందుకంత ఇబ్బంది పడుతున్నాడు? దీని వెనుక ఉన్న ప్రధాన కారణం ఇంగ్లాండ్, ఇండియాలలోని పిచ్‌ల మధ్య ఉన్న తేడా. ఈ సిరీస్ లో ఇప్పటివరకు వైభవ్ సూర్యవంశీ ఆర్చర్ బౌలింగ్‌లో రెండు సార్లు ఔటయ్యాడు. ఈ రెండు సార్లు కూడా వైభవ్ బంతి ఎక్కువగా బౌన్స్ అవ్వడం వల్ల ఇబ్బంది పడ్డాడు. మూడో టీంలో వైభవ్ సూర్యవంశీ ఓ షార్ట్ బాల్‌కు తన బ్యాట్ తగిలి వికెట్ కీపర్ కు క్యాచ్ ఇచ్చాడు. ఆ తర్వాత నాలుగో టీ20లో బంతి మంచి లెంగ్త్‌లో రాగా.. వైభవ్ సూర్యవంశీ ఓ భారీ షాట్ కొట్టడానికి ప్రయత్నించి.. బ్యాట్ పైభాగానికి తగిలి 30 గజాల సర్కిల్ లోపల క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఇదే షాట్ భారత పిచ్‌లపై ఆడి ఉంటే.. బంతి బ్యాట్ మధ్య భాగానికి తగిలి స్టాండ్స్‌లో పడి ఉండేది.
వైభవ్ సూర్యవంశీకి ముందున్న సవాలేంటి?
వైభవ్ సూర్యవంశీ ఇంగ్లాండ్‌లో నేర్చుకున్న పాఠాల నుంచి గుణపాఠం నేర్చుకునే తన కెరీర్ ను కొత్త దిశలో నడిపించుకోవాలి. ఈ సిరీస్‌లో వైభవ్ సూర్యవంశీ 14,13,15 పరుగులు చేశాడు. అంటే వైభవ్ సూర్యవంశికీ మంచి ఆరంభాలు లభించినా.. చెప్పుకోదగ్గ ప్రభావం చూపడంలో విఫలమయ్యాడు. ఓపిక, పట్టుదలతో వైభవ్ మళ్లీ రాణించగలడు. 15 ఏళ్ల వయసులో ఏమీ నష్టపోలేదు, ఇంకా ఎంతో మెరుగుపడటానికి వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఉంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications