Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs ENG: వైభవ్ సూర్యవంశీ కొంపముంచిన ఐపీఎల్!

టీమిండియా టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. ఇంగ్లండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా రెండో మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన వైభవ్ వరుసగా మూడు మ్యాచ్‌ల్లో తీవ్రంగా నిరాశపర్చాడు. ఐపీఎల్‌లో సంచలన ప్రదర్శనతో టాక్ ఆఫ్ ది వరల్డ్‌గా మారిన వైభవ్ సూర్యవంశీ.. ఆ జోరును అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగించలేకపోతున్నాడు.

అయితే ఈ టీనేజ్ సెన్సేషన్ కోసం ఇంగ్లండ్ ప్రత్యేకంగా హోమ్ వర్క్ చేసింది. ఐపీఎల్ డెటాతో 15 ఏళ్ల వైభవ్ బలహీనతను పసిగట్టి బోల్తా కొట్టించింది. మాంచెస్టర్ వేదికగా జరిగిన రెండో టీ20లో స్టంపౌట్ అయిన వైభవ్.. తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో షార్ట్ పిచ్ డెలివరీలకు క్యాచ్‌ ఔట్‌గా వెనుదిరిగాడు. దాంతో భారీ అంచనాలతో బరిలోకి దిగిన వైభవ్.. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో14, 13, 15 పరుగులే చేసి తీవ్రంగా నిరాశపర్చాడు.

IND vs ENG: మళ్లీ విఫలమైన వైభవ్ సూర్యవంశీ.. అదే చెత్త షాట్! (వీడియో)

IND vs ENG: మళ్లీ విఫలమైన వైభవ్ సూర్యవంశీ.. అదే చెత్త షాట్! (వీడియో)

ఐపీఎల్ డేటాతో చెక్..

వైభవ్ వైఫల్యంతో పాటు ఇతర బ్యాటర్లు నిరాశపర్చడంతో ఈ ఐదు టీ20ల సిరీస్‌‌ను టీమిండియా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కోల్పోయింది. నాలుగో టీ20 అనంతరం మాట్లాడిన ఆదిల్ రషీద్.. వైభవ్ సూర్యవంశీ బలహీనతను కనిపెట్టేందుకు ఐపీఎల్ డేటాను వాడుకున్నామని తెలిపాడు.

Adil Rashid reveals England Using IPL Data for exploited Vaibhav Sooryavanshi weakness

'వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్‌కు కొత్త అయినప్పటికీ.. మా జట్టు అతని ఐపీఎల్ మ్యాచ్‌ల డేటాను విశ్లేషించింది. అతను ఎక్కడ ఇబ్బంది పడుతున్నాడనే విషయాన్ని పసిగట్టింది. దానికి అనుగుణంగా మేం బౌలింగ్ ప్రణాళికలను అమలు చేశాం. వైభవ్‌కు కేవలం 15 ఏళ్లే కాబట్టి, ఒత్తిడికి లోనవ్వడం సహజం. కానీ టీమిండియా మేనేజ్‌మెంట్ అతనికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది. అతను ఈ తరహా పిచ్‌లపై ఆడటానికి అలవాటు పడుతున్న కొద్దీ డిఫెన్సివ్ టెక్నిక్స్ నేర్చుకుంటాడు.'అని ఆదిల్ రషీద్ చెప్పుకొచ్చాడు.

నేనైతే అతను 10 మ్యాచ్‌ల్లో విఫలమైనా ఆడిస్తాను: మహమ్మద్ కైఫ్

నేనైతే అతను 10 మ్యాచ్‌ల్లో విఫలమైనా ఆడిస్తాను: మహమ్మద్ కైఫ్

అది బలహీనత కాదు..

అయితే షార్ట్ పిచ్ బాల్స్‌ వైభవ్ సూర్యవంశీకి బలహీనత కాదని, గతంలో ఈ బాల్స్‌ను అతను సిక్స్‌లు కొట్టాడని ఇంగ్లండ్ మాజీ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ అన్నాడు. 'వైభవ్ సూర్యవంశీ ఔటవుతున్న తీరును నేను బలహీనతగా చూడటం లేదు. ఎందుకంటే అతను ఇలాంటి బంతులను గతంలో సిక్సర్లుగా తరలించాడు.

కాబట్టి అతని ఆట గురించి నాకు ఎలాంటి ఆందోళన లేదు. మరో 3-5 మ్యాచ్‌ల్లో విఫలమైతే అది అతనికి సమస్యగా మారుతుంది. ప్రస్తుతం అతను ప్రతిభావంతమైన ఆటగాడు అనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.'అని మొయిన్ అలీ చెప్పుకొచ్చాడు.

భారత్, ఇంగ్లండ్ మధ్య ఆఖరి టీ20 శనివారం సౌతాంప్టన్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్‌లోనూ ఇంగ్లండ్ గెలిస్తే ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ నెంబర్ వన్ ర్యాంక్ దక్కుతుంది. భారత్ అగ్రస్థానం కోల్పోతుంది. అయితే మూడు వరుస పరాజయాల నేపథ్యంలో వైభవ్‌కు అవకాశం ఇస్తారో లేదో చూడాలి.

Story first published: Friday, July 10, 2026, 13:59 [IST]
Other articles published on Jul 10, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+