Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సిరీస్‌కు ఒక బ్రాడ్‌కాస్టర్.. అభిమానులను దోచుకుంటున్న బీసీసీఐ!

భారత్, అఫ్గాన్ ఏకైక టెస్ట్ మ్యాచ్ జియో హాట్‌స్టార్‌తో పాటు స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ చానెల్‌లో చూస్తే.. శ్రీలంక పర్యటనలోని టెస్ట్ సిరీస్‌ను సోనీలివ్‌తో పాటు సోనీ నెట్‌వర్క్ చానెల్‌లో చూశాం. జింబాబ్వేతో పాటు అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్‌‌ను ఫ్యాన్‌ కోడ్‌లో చూడాల్సి వచ్చింది.

అప్‌కమింగ్ న్యూజిలాండ్ పర్యటనకు సంబంధించిన మ్యాచ్‌లను అమెజాన్ ప్రైమ్‌లో చూడాల్సి ఉంటుంది. ఇతర క్రీడలను చూడాలంటే మరో వేదికను సబ్‌స్క్రైబ్ చేసుకోవాలి. ఫుట్‌బాల్ ప్రపంచకప్‌ కోసం జీ5 సబ్‌స్క్రిప్షన్‌ తీసుకోవాల్సి వచ్చింది. భారత క్రీడా అభిమానులు తమకు నచ్చిన ఆటను చూసేందుకు ఎన్నెన్ని ఛానెల్స్‌, ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోవాలి? అనే ప్రశ్న తలెత్తుతుంది.

Asian Games 2026 ఫైనల్లో భారత్ X పాకిస్థాన్..?

Asian Games 2026 ఫైనల్లో భారత్ X పాకిస్థాన్..?

సిరీస్‌కు ఒక సబ్‌స్క్రిప్షనా..?

పోనీ ఒక నెల మాత్రమే సబ్‌స్క్రైబ్ చేసుకుందామా? అంటే ఆటోపే ఆప్షన్‌ వేధిస్తోంది. మరిచిపోయి ఆటోపే తీయకపోతే.. డబ్బులు కట్ అవుతాయి. అయినా ప్రతీ సిరీస్‌కు ఓ ఛానెల్‌, ఓటీటీ వేదికను సబ్‌స్క్రైబ్ చేసుకోవడం ఎంతవరకు సమంజసం..? ప్రపంచ క్రికెట్‌లోనే రిచెస్ట్ బోర్డు అయిన బీసీసీఐ.. అభిమానులను పట్టించుకోకపోవడం విస్మయానికి గురి చేస్తోంది.

India Cricket Fans Frustrated New Series New Broadcaster New OTT Subscription

ఫ్యాన్స్ లేకుంటే భారత్‌లో క్రికెట్‌కు ఇంత క్రేజ్ వచ్చేదా? అనే ప్రశ్న తలెత్తుతోంది. ఈ విషయంలో బీసీసీఐ పునరాలోచన చేయాలనే వాదన వినిపిస్తోంది. సిరీస్‌కు ఒక ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోవడం ఫ్యాన్స్‌కు భారం అవుతుంది. ఈ విషయాన్ని బీసీసీఐ పరిగణనలోకి తీసుకోవాలని ఫ్యాన్స్ విజ్ఞప్తి చేస్తున్నారు. బీసీసీఐ ప్రధాన స్టేక్ హోల్డర్స్ అభిమానులని, వారే లేకపోతే బీసీసీఐ ఎక్కడిదని ప్రశ్నిస్తున్నారు.

ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్ మధ్య పోటీ..

అవసరమైతే ఓవర్‌సీస్ మ్యాచ్‌లకు ఒక ఫ్లాట్‌ఫామ్.. స్వదేశీ మ్యాచ్‌లకు మరో ఫ్లాట్‌ఫామ్ పెట్టాలని అభిమానులు సూచిస్తున్నారు. వాస్తవానికి భారత్ వేదికగా జరిగే మేజర్ సిరీస్‌లు, ఐసీసీ టోర్నీలకు సంబంధించిన మ్యాచ్‌లను స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్ ప్రచారం చేస్తోంది. విదేశీ మ్యాచ్‌లకు సోనీ నెట్‌వర్క్ బ్రాడ్‌కాస్టర్‌గా వ్యవహరిస్తోంది. కానీ పసికూన జట్లతో జరిగే మ్యాచ్‌లను ప్రసారం చేసేందుకు ఈ రెండు సంస్థలు ఆసక్తి చూపడం లేదు.

దాంతో ఫ్యాన్ కోడ్ అనే ఓటీటీకి ఈ మ్యాచ్‌లు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాకుండా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. స్పోర్ట్స్ లైవ్ ఇవ్వడం వల్ల సబ్‌స్క్రిప్షన్ పెరగడం, తద్వారా తమ సినిమా, వెబ్‌సిరీస్‌లకు వ్యూస్ పెరుగుతున్నాయి. దాంతో ప్రతీ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ మ్యాచ్‌ల ప్రసార హక్కులను దక్కించుకునేందుకు పోటీపడుతున్నాయి. అమెజాన్ ప్రైమ్ కూడా ఈ కోవలో న్యూజిలాండ్ పర్యటన మ్యాచ్‌ల ప్రసార హక్కులను దక్కించుకుంది.

క్రికెట్ చరిత్రలోనే క్రేజీ మ్యాచ్‌కు బీసీసీఐ ప్లాన్!

Also Read

క్రికెట్ చరిత్రలోనే క్రేజీ మ్యాచ్‌కు బీసీసీఐ ప్లాన్!

పునరాలోచన చేయాలి..

'బీసీసీఐ పునరాలోచన చేయాలి. ప్రతీ సిరీస్‌కు కొత్త ఛానెల్ సబ్‌స్క్రిప్షన్ అంటే అభిమానులకు భారంగా మారుతుంది. భారత్‌లో జరిగే మ్యాచ్‌ల ప్రసార హక్కులను ఒక సంస్థకు.. విదేశీ మ్యాచ్‌ల హక్కులను మరో సంస్థకు కట్టబెట్టాలి. అభిమానులను దృష్టిలో పెట్టుకొని బీసీసీఐ నిర్ణయం తీసుకోవాలి.'- సీ వెంకటేశ్, క్రికెట్ విశ్లేషకుడు.

'ప్రతీ సిరీస్‌కు ఒక ఛానెల్ సబ్‌స్క్రిప్షన్ అంటే చాలా కష్టంగా ఉంది. ఇప్పటికే జియో హాట్‌స్టార్, సోనీ నెట్‌వర్క్ సబ్‌స్క్రిప్షన్లు తీసుకున్నాం. కొత్తగా సబ్‌స్క్రిప్షన్ తీసుకోలేక స్కోర్ బోర్డును ఫాలో అవుతున్నాం. ఆ తర్వాత యూట్యూబ్‌లో వచ్చే హైలైట్స్‌ను ఫాలో అవుతున్నాం. బీసీసీఐ ఈ విషయంలో పునరాలోచన చేయాలి. అభిమానుల జేబుకు చిల్లు పడకుండా చూడాలి.'- శరత్, క్రికెట్ అభిమాని.

Story first published: Tuesday, September 29, 2026, 14:47 [IST]
Other articles published on Sep 29, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+