Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

క్రికెట్ చరిత్రలోనే క్రేజీ మ్యాచ్‌కు బీసీసీఐ ప్లాన్!

క్రికెట్ చరిత్రలోనే క్రేజీ మ్యాచ్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. బీసీసీఐ 100వ వార్షికోత్సవం సందర్భంగా టీమిండియా వర్సెస్ రెస్టాఫ్ ఇండియా మ్యాచ్ నిర్వహించనున్నట్లు బోర్డు వర్గాలు తెలిపాయి. శుక్రవారం(సెప్టెంబర్ 25) జరిగే బీసీసీఐ 95వ వార్షిక సర్వసభ్య సమావేశం(ఏజీఎం)లో ఈ చారిత్రాత్మక శతజయంతి వేడుకలపై అధికారికంగా నిర్ణయం తీసుకోనున్నారు.

Asian Games 2026: మూడో రోజు ఒక స్వర్ణం.. మరో రెండు పతకాలు ఖాయం!

Asian Games 2026: మూడో రోజు ఒక స్వర్ణం.. మరో రెండు పతకాలు ఖాయం!

అదే జరిగితే డిసెంబర్ 2027 నుంచి 2028 వరకు ఏడాది పాటు శతాబ్ది ఉత్సవాలను బీసీసీఐ నిర్వహించనుంది. ఈ వేడుకలను పర్యవేక్షించేందుకు బీసీసీఐ ఒక కమిటీని ఏర్పాటు చేయాలనుకుంటుందని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పేర్కొంది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ప్రస్తుతం ఈ చర్చలు ప్రాథిమిక దశలో ఉన్నట్లు తెలుస్తోంది.

BCCI Planning India vs Rest of the World XI Match to Celebrate 100 Years Reports

ఐసీసీ వరల్డ్ ఎలెవన్ ఇప్పటి వరకు మొత్తం 9 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడింది. వాటిలో జనవరి 2005లో ఆసియా ఎలెవెన్‌తో ఒక వన్డే, అక్టోబర్ 2005లో ఆస్ట్రేలియాతో మూడు వన్డేలు, ఒక టెస్ట్, సెప్టెంబర్ 2017లో పాకిస్థాన్‌తో మూడు టీ20లు, 2018 మేలో లార్డ్స్ వేదికగా వెస్టిండీస్‌తో ఒక టీ20 ఆడింది.

భారత్ జట్టుతో మాత్రం ఐసీసీ ఎలెవన్ ఇప్పటి వరకు ఒక్క అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ ఆడలేదు. ఒకవేళ భారత్, రెస్టాఫ్ ఇండియా మ్యాచ్‌ను ప్లాన్ చేస్తే.. వన్డే ఫార్మాట్‌లో నిర్వహించే అవకాశం ఉందని బోర్డు వర్గాలు పేర్కొన్నాయి. ఇక బీసీసీఐ భారత స్వాతంత్య్రానికి ముందే 1928 డిసెంబర్ 1న ఏర్పాటైంది. 2028 డిసెంబర్ 1 వరకు 100 ఏళ్లు పూర్తి చేసుకోనుంది. ఐసీసీ ర్యాంకింగ్స్ ద్వారా ఐసీసీ వరల్డ్ ఎలెవన్‌ను ఎంపిక చేయనున్నారు.

IND vs JPN: భారత్‌ విజయంపై వివాదం.. అంపైర్ యూటర్న్‌పై దుమారం! (వీడియో)

Also Read

IND vs JPN: భారత్‌ విజయంపై వివాదం.. అంపైర్ యూటర్న్‌పై దుమారం! (వీడియో)

ఈ క్రేజీ మ్యాచ్‌ను ఎప్పుడు నిర్వహిస్తారనేదానిపై స్పష్టమైన సమాచారం లేదు. 2027 వన్డే ప్రపంచకప్‌ ముందే నిర్వహిస్తే భారత క్రికెట్ దిగ్గజాలు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు బరిలోకి దిగుతారు. మెగా టోర్నీ తర్వాత అయితే ఈ ఇద్దరూ దూరమయ్యే అవకాశం ఉంది. శుక్రవారం ఏజీఎం తర్వాత ఈ క్రేజ్ మ్యాచ్‌పై క్లారిటీ రానుంది. ఈ సమావేశంలోనే టీమిండియా నయా ఛీఫ్ సెలెక్టర్‌ నియామకంపై కూడా నిర్ణయం తీసుకోనున్నారు.

Story first published: Wednesday, September 23, 2026, 11:51 [IST]
Other articles published on Sep 23, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+