Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs NZ: అభిషేక్, వైభవ్ ఊచకోత.. చరిత్ర సృష్టించిన భారత్!

అంతర్జాతీయ టీ20ల్లో టీమిండియా సరికొత్త రికార్డ్‌ను నమోదు చేసింది. పొట్టి ఫార్మాట్ చరిత్రలోనే పవర్ ప్లేలో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా నిలిచింది. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో వెల్లింగ్టన్ వేదికగా మంగళవారం జరిగిన మూడో టీ20లో ఈ ఫీట్ సాధించింది.

టీమిండియా ఓపెనర్లు అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగడంతో పవర్ ప్లేలో భారత్‌ 118 పరుగులు చేసింది. అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలోనే ఇదే హయ్యెస్ట్ పవర్ ప్లే స్కోర్ కావడం గమనార్హం. ఈ క్రమంలో రొమానియా, ఆస్ట్రేలియా పేరిట ఉన్న అత్యధిక పవర్ ప్లే స్కోర్ రికార్డ్స్‌ను భారత్ అధిగమించింది.

IND vs NZ: ఆ మెచ్యూరిటీ మా ఆటగాళ్లకు ఉంది: శ్రేయస్ అయ్యర్

IND vs NZ: ఆ మెచ్యూరిటీ మా ఆటగాళ్లకు ఉంది: శ్రేయస్ అయ్యర్

అంతేకాకుండా టీ20 క్రికెట్ చరిత్రలోనే అతి తక్కువ ఓవర్లలో తొలి 50, 100 పరుగులు చేసిన జట్టుగా కూడా టీమిండియా రికార్డ్ సాధించింది. అభిషేక్ శర్మ, వైభవ్ విధ్వంసంతో 2.2 ఓవర్లలోనే 50 పరుగులు చేసిన భారత్.. 5 ఓవర్లలోనే 100 పరుగులు నమోదు చేసింది. టీ20 క్రికెట్ చరిత్రలోనే మరే జట్టు ఈ ఫీట్ సాధించలేదు.

India Create History With Highest Powerplay Score and Fastest 50 and 100 in T20I Cricket

పురుషుల టీ20ల్లో పవర్ ప్లేలో అత్యధిక పరుగులు చేసిన జట్లు:

118/0 - భారత్ vs న్యూజిలాండ్, వెల్లింగ్టన్ (2026)

116/0 - రుమేనియా vs సెర్బియా, సోఫియా (2021) (5.4 ఓవర్లలోనే)

113/1 - ఆస్ట్రేలియా vs స్కాట్లాండ్, ఎడిన్‌బర్గ్ (2024)

103/1 - జింబాబ్వే vs గాంబియా, నైరోబి (RSC) (2024)

102/0 - దక్షిణాఫ్రికా vs వెస్టిండీస్, సెంచూరియన్ (2023)

100/0 - ఇంగ్లాండ్ vs దక్షిణాఫ్రికా, ఓల్డ్ ట్రాఫోర్డ్ (2025)

100/0 - భారత్ vs అఫ్గానిస్తాన్, ఢిల్లీ (2026)

IND vs NZ: బ్యాడ్‌లైట్‌తో బచాయించిన న్యూజిలాండ్.. తృటిలో చేజారిన భారత్ విజయం!

Also Read

IND vs NZ: బ్యాడ్‌లైట్‌తో బచాయించిన న్యూజిలాండ్.. తృటిలో చేజారిన భారత్ విజయం!

టీ20ల్లో అత్యంత వేగంగా 100 పరుగులు చేసిన జట్లు

5 ఓవర్లు - భారత్ vs న్యూజిలాండ్, వెల్లింగ్టన్ (2026)

5.2 ఓవర్లు - రుమేనియా vs సెర్బియా, సోఫియా (2021)

5.3 ఓవర్లు - సౌతాఫ్రికా vs వెస్టిండీస్, సెంచూరియన్ (2023)

5.3 ఓవర్లు - ఆస్ట్రేలియా vs స్కాట్లాండ్, ఎడిన్‌బర్గ్ (2024)

5.5 ఓవర్లు - జింబాబ్వే vs గాంబియా, నైరోబి (2024)

5.5 ఓవర్లు - ఇంగ్లండ్ vs దక్షిణాఫ్రికా, ఓల్డ్ ట్రాఫోర్డ్ (2025)

టీ20ల్లో అత్యంత వేగంగా 50 పరుగులు చేసిన జట్లు

2.2 ఓవర్లు - పాపువా న్యూ గినియా vs వనౌటు, పోర్ట్ మోర్స్బీ (2019)

2.2 ఓవర్లు - రుమేనియా vs సెర్బియా, సోఫియా (2021)

2.2 ఓవర్లు - భారత్ vs న్యూజిలాండ్, వెల్లింగ్టన్ (2026)

2.3 ఓవర్లు - ఫిలిప్పీన్స్ vs ఇండోనేషియా, బాలి (2023)

2.4 ఓవర్లు - న్యూజిలాండ్ vs స్కాట్లాండ్, ది ఓవల్ (2009)

2.4 ఓవర్లు - న్యూజిలాండ్ vs ఇంగ్లాండ్, ఆక్లాండ్ (2019)

2.4 ఓవర్లు - దక్షిణాఫ్రికా vs వెస్టిండీస్, సెంచూరియన్ (2023)

Story first published: Tuesday, October 27, 2026, 15:16 [IST]
Other articles published on Oct 27, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+