IND vs NZ: బ్యాడ్‌లైట్‌తో బచాయించిన న్యూజిలాండ్.. తృటిలో చేజారిన భారత్ విజయం!
న్యూజిలాండ్ పర్యటనను భారత్-ఏ ఘనంగా ప్రారంభించింది. తృటిలో విజయం చేజారినా.. న్యూజిలాండ్-ఏను వణికించింది. పేలవ బ్యాటింగ్ ప్రదర్శనతో తొలి ఇన్నింగ్స్‌లో తేలిపోయినా.. రెండో ఇన్నింగ్స్‌లో పుంజుకొని విజయం దిశగా సాగింది. కానీ బ్యాడ్ లైట్ న్యూజిలాండ్-ఏ ను ఓటమి నుంచి గట్టెక్కించింది. మూడు అనధికారిక టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా లింకన్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్ డ్రాగా ముగిసింది. 313 పరుగుల భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 65 ఓవర్లలో 9 వికెట్లకు 187 పరుగులు చేసింది.
బ్యాడ్ లైట్ కారణంగా మరో 17 ఓవర్ల ఆట మిగిలి ఉండగానే మ్యాచ్‌ను ముగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాంతో న్యూజిలాండ్-ఏ ఓటమిని తప్పించుకుంది. కర్టీస్ హీఫీ(90 నాటౌట్) ఒంటరి పోరాటం చేయగా.. డీన్ ఫాక్స్‌క్రాఫ్ట్(42) పర్వాలేదనిపించాడు. మిగతా బ్యాటర్లు తీవ్రంగా నిరాశపర్చారు. భారత బౌలర్లలో అకీబ్ నబీ మూడు వికెట్లు తీయగా.. అన్షుల్ కాంబోజ్, ఆకాష్ దీప్, ముఖేష్ చౌదరి, వాషింగ్టన్ సుందర్ తలో వికెట్ పడగొట్టారు. దేవదత్ పడిక్కల్ 2 వికెట్లు తీసాడు. ఈ మ్యాచ్‌లో దేవదత్ పడిక్కల్ (32, 199, 2/7) ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.

భారత్ 516 ఆలౌట్..
అంతకుముందు 488/8 ఓవర్‌నైట్ స్కోర్‌తో ఆఖరి రోజు ఆటను కొనసాగించిన భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 516 పరుగులకు ఆలౌటైంది. దేవదత్ పడిక్కల్(248 బంతుల్లో 24 ఫోర్లు, 3 సిక్స్‌లతో 199) తృటిలో డబుల్ సెంచరీ చేజార్చుకోగా.. సాయి సుదర్శన్(91), యశ్ రాథోడ్(66), వాషింగ్టన్ సుందర్(52) హాఫ్ సెంచరీలతో రాణించారు. తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్-ఏకు 204 పరుగుల భారీ ఆధిక్యం దక్కడంతో ఆ జట్టు ముందు 313 పరుగుల భారీ లక్ష్యం నమోదైంది. తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైనా రెండో ఇన్నింగ్స్ భారత బ్యాటర్లు ఆకట్టుకున్నారు.
తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైనా..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్-ఏ తొలి ఇన్నింగ్స్‌లో 113 పరుగులకే కుప్పకూలింది. దేవదత్ పడిక్కల్(32), యశ్ రాథోడ్(44) టాప్ స్కోరర్లుగా నిలవగా.. సైమన్ కీన్(5/24), జాక్ గిబ్సన్(3/29) భారత్ పతనాన్ని శాసించారు.
అనంతరం న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 317 పరుగుల భారీ స్కోర్ చేసి 204 పరుగుల భారీ ఆధిక్యాన్ని అందుకుంది. భారత్-ఏ బౌలర్లలో అన్షుల్ కాంబోజ్, అకీబ్ నబీ మూడేసి వికెట్లు తీయగా.. ఆకాష్ దీప్ రెండు వికెట్లు పడగొట్టాడు. ముఖేష్ చౌదరి, వాషింగ్టన్ సుందర్ తలో వికెట్ తీసారు. తొలి ఇన్నింగ్స్ వైఫల్యంతో ఘోర పరాజయం తప్పదనుకున్న భారత్-ఏను దేవదత్ పడిక్కల్ అసాధారణ బ్యాటింగ్‌తో నిలబెట్టాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


