వైభవ్ సూర్యవంశీకి అది మంచిది కాదు: టీమిండియా బ్యాటింగ్ కోచ్
టీమిండియా టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీపై ఇంత హైప్ సృష్టించడం అతనికి, జట్టుకు మంచిది కాదని బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ అన్నాడు. 15 ఏళ్ల కుర్రాడి చుట్టూ అనవసర ఒత్తిడి తీసుకొస్తే అతని మనసుపై తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరించాడు.
సొంతగడ్డపై వెస్టిండీస్‌తో జరిగిన ఐదు టీ20ల సిరీస్‌లో వైభవ్ సూర్యవంశీ పూర్తిగా బెంచ్‌కే పరిమితమైన సంగతి తెలిసిందే. అపారమైన ప్రతిభ ఉన్నప్పటికీ వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇవ్వకపోవడాన్ని అభిమానులు తప్పుబడుతున్నారు. ప్రస్తుతం న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న వైభవ్ సూర్యవంశీ అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు.
న్యూజిలాండ్‌తో రెండో టీ20కి ముందు మీడియాతో మాట్లాడిన సితాన్షు కోటక్.. వైభవ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడాడు. వైభవ్‌ను జట్టులోకి తీసుకోవాలంటూ ఒత్తిడి చేయడం సరికాదని పేర్కొన్నాడు. ప్రస్తుత ఓపెనర్లు సంజు శాంసన్, అభిషేక్ శర్మ అద్భుతంగా ఆడుతున్నారని.. తుది జట్టులో 11 మందికి మాత్రమే అవకాశం ఉంటుందని గుర్తుచేశాడు.

వైభవ్‌కు మంచిది కాదు..
'వైభవ్ సూర్యవంశీ టాలెంట్‌కు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. అభిమానులే కాదు జట్టులో ఉన్న వారికి కూడా అతనంటే చాలా ఇష్టం. కానీ ఒక ఆటగాడిని జనాలు ఇష్టపడుతున్నారని తుది జట్టులో ఆడించలేం. వైభవ్‌కు ఎంతో భవిష్యత్తు ఉంది. నిలకడగా అవకాశాలు ఇస్తే మరింత నేర్చుకుంటాడు. కానీ ఈ 15 ఏళ్ల కుర్రాడిపై ఇంత హైప్ సృష్టించడం అతనికే మంచిది కాదు. అతని చుట్టూ ఒత్తిడి తీసుకొస్తే.. తుది జట్టులో అవకాశం దక్కకపోతే మనసుపై ప్రభావం పడొచ్చు.
వయసులో వైభవ్ చాలా చిన్నవాడు. ఈ హైప్‌ను నియంత్రించడం కష్టమే. కానీ వైభవ్ కోసం బాగా ఆడుతున్న ఓపెనర్లను విమర్శించడం సరికాదు. వైభవ్ కోసం వారిని నిందించడం, ప్రశ్రించడం ఆ ఆటగాళ్లకు అన్యాయం చేసినట్లే అవుతుంది. నిజమైన క్రికెట్ అభిమానులు అయితే ఈ హైప్ వల్ల వైభవ్‌కు ఉపయోగమా? నష్టమా? అనేది ఆలోచించాలి.
నమన్ ధీర్ అద్భుతమైన ఆటగాడు..
యువ ఆల్‌రౌండర్ నమన్ ధీర్‌పై సితాన్షు కోటక్ ప్రశంసల జల్లు కురిపించాడు. జట్టులో తన పాత్ర ఏంటో నమన్ ధీర్‌కు స్పష్టంగా తెలుసని, అందుకు తగ్గట్టుగానే రాణిస్తున్నాడని కొనియాడాడు. బౌలింగ్, ఫీల్డింగ్‌తో పాటు చివర్లో వేగంగా పరుగులు సాధించగల సామర్థ్యం అతనికి ఉందని, అతని రాకతో జట్టుకు సమతూకం లభించిందని అభిప్రాయపడ్డాడు.
'నమన్ ధీర్ గొప్ప ప్రతిభావంతుడు. పవర్‌ఫుల్ ఆటగాడు. జట్టు తన నుంచి ఏం ఆశిస్తుందో అతనికి బాగా తెలుసు. అందుకు తగ్గట్టుగానే ఆడుతున్నాడు. ఇది జట్టుకు చాలా మంచి సంకేతం'అని సితాన్ష్ కోటక్ చెప్పుకొచ్చాడు. న్యూజిలాండ్‌తో తొలి టీ20లో నమన్ ధీర్(15 బంతుల్లో 42 నాటౌట్) విధ్వంసకర బ్యాటింగ్‌తో భారత విజయంలో కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


