ఛీ ఇదేం ప్రశ్న.. కుల్దీప్ యాదవ్‌కు నిజంగా వైరల్ ఫీవరే: టీమిండియా కోచ్
టీమిండియా రిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు నిజంగా వైరల్ ఫీవరేనని బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ స్పష్టం చేశాడు. అబద్దం చెప్పి అతన్ని పక్కన పెట్టాల్సిన అవసరం తమకు లేదన్నాడు. శ్రీలంకతో కొలంబో వేదికగా ఆదివారం ప్రారంభమైన రెండో టెస్ట్‌కు కుల్దీప్ యాదవ్ దూరమైన సంగతి తెలిసిందే.
వైరల్ ఫీవర్‌తోనే కుల్దీప్ యాదవ్ దూరమయ్యాడని ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు బీసీసీఐ ఓ ప్రకటనలో పేర్కొంది. 'కుల్దీప్ యాదవ్ తన వైరల్ ఫీవర్ నుంచి పూర్తిగా కోలుకోలేదు. శ్రీలంకతో రెండో టెస్ట్‌కు అతను దూరమయ్యాడు. అవసరమైతే కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా కుల్దీప్ బరిలోకి దిగగలడు.'అని తెలిపింది.
ఫేక్ ఫీవర్ అంటూ..
అయితే ఈ ప్రకటనను మెజార్టీ అభిమానులు విశ్వసించలేదు. వైరల్ ఫీవర్ పేరిట కుల్దీప్ యాదవ్‌ను తుది జట్టు నుంచి తప్పించారని ఆరోపించారు. తొలి టెస్ట్‌లో కుల్దీప్ యాదవ్ ప్రభావం చూపలేకపోయాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లో ఒకే ఒక్క వికెట్ తీయడంతో అతన్ని తప్పిస్తారనే ప్రచారం జోరుగా సాగింది. 33 ఏళ్ల సారాన్ష్ జైన్‌కు అవకాశం ఇస్తారనే అభిప్రాయం వ్యక్తమైంది. ఈ క్రమంలోనే వైరల్ ఫీవర్ అంటూ బీసీసీఐ చేసిన ప్రకటనపై నెటిజన్లు సందేహం వ్యక్తం చేశారు.
తొలి రోజు ఆట అనంతరం మీడియా సమావేశంలో పాల్గొన్న సితాన్ష్ కోటక్‌ను మీడియా ప్రతినిధులు ఈ విషయంపై ప్రశ్నించగా.. తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. ఇదేం ప్రశ్న? ఇలా ఎలా ఆలోచిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాడు.

ఆ అవసరం మాకు లేదు..
'ఇది ఏ మాత్రం సందర్భోచితమైన ప్రశ్న కాదు. కుల్దీప్ యాదవ్‌కు గాలే నుంచి వచ్చేటప్పుడే వైరల్ ఫీవర్ సోకింది. జట్టుకు ఆఫ్-స్పిన్నర్ అవసరమైతే.. కుల్దీప్ యాదవ్ అనారోగ్యానికి గురయ్యాడని చెప్పాల్సిన అవసరం మాకు లేదు. అతను ఆడే స్థితిలో లేనప్పుడు ఒకవేళ ఫిట్‌గా ఉంటే ఏం చేసేవారని అడగడం సరికాదు. ఇలా ఆలోచించడం కూడా అన్యాయం'అని సితాన్ష్ కోటక్ ఘాటుగా బదులిచ్చాడు.
రిషభ్ పంత్ గాయం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సీరియస్ ఇంజ్యూరీ కాదని సితాన్ష్ కోటక్ తెలిపాడు. అతను తిరిగి బ్యాటింగ్ చేస్తాడని చెప్పాడు. మైదానంలో యశస్వి జైస్వాల్, అసితా ఫెర్నాండో గొడవపై స్పందిస్తూ.. ఆటలో ఇవన్నీ సహజమని అభిప్రాయపడ్డాడు. బౌలర్ ఏదో అన్నాడని, కానీ యశస్వి జైస్వాల్ అలా దూసుకెళ్తాడని తాను అనుకోలేదని చెప్పాడు.
సరాన్ష్ జైన్ అరంగేట్రం..
కుల్దీప్ యాదవ్ గైర్హాజరీతో 33 ఏళ్ల సరాన్ష్ జైన్ అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 85 ఓవర్లలో 5 వికెట్లకు 300 పరుగులు చేసింది. దేవదత్ పడిక్కల్(193 బంతుల్లో 12 ఫోర్లతో 117) మరో శతకంతో చెలరేగగా.. కెప్టెన్ శుభ్‌మన్ గిల్(108 బంతుల్లో 6 ఫోర్లతో 50) హాఫ్ సెంచరీతో రాణించాడు.
రవీంద్ర జడేజా(43), యశస్వి జైస్వాల్(45) తృటిలో హాఫ్ సెంచరీలు చేజార్చుకున్నారు. క్రీజులో ధ్రువ్ జురెల్(7 బ్యాటింగ్)తో పాటు సరాన్ష్ జైన్(4 బ్యాటింగ్) ఉన్నాడు. శ్రీలంక బౌలర్లలో అసితా ఫెర్నాండో మూడు వికెట్లు తీయగా.. లాహిరు కుమార, కేశర నువాంత తలో వికెట్ తీసారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

