Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs SL: పడిక్కల్ సెంచరీ.. శ్రీలంకపై తొలిరోజే టీమిండియా అధిపత్యం!

IND vs SL: కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ వేదికగా భారత్, శ్రీలంక మధ్య జరుగుతున్న రెండో టెస్టు తొలిరోజు ఆట భారత్‌కు అనుకూలంగా సాగింది. తొలి రోజే భారత్ తన ఆధిక్యాన్ని చాటుకుంది తొలిరోజు ఆట ముగిసే సమయానికి భారత్ 85 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసి పటిష్ట స్థితిలో నిలిచింది. చేసింది. ఆట పూర్తయ్యే సమయానికి క్రీజులో ధ్రువ్ జురెల్ (7), సారాంశ్ జైన్ (4) ఉన్నారు.

IND vs SL: వరుసగా రెండు శతకాలు.. కొలంబో టెస్టులోనూ ధనాధన్ సెంచరీ!

IND vs SL: వరుసగా రెండు శతకాలు.. కొలంబో టెస్టులోనూ ధనాధన్ సెంచరీ!

భారత్ తరఫున దేవదత్ పడిక్కల్ మరోసారి 117 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఇది పడిక్కల్‌కు వరుసగా రెండో సెంచరీ కావడం విశేషం. పడిక్కల్‌తో పాటు కెప్టెన్ గిల్ కూడా అర్ధశతకం సాధించాడు. టాస్ గెలిచిన భారత్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. దేవదత్ పడిక్కల్ వరుసగా తన రెండో మ్యాచ్‌లో సెంచరీ సాధించాడు.సిరీస్‌లోని మొదటి మ్యాచ్‌లో భారత జట్టు శ్రీలంకను 165 పరుగుల తేడాతో ఓడించింది . ఆ మ్యాచ్ గాలేలోని గాలే అంతర్జాతీయ స్టేడియంలో జరిగింది. ఇప్పుడు ఈ మ్యాచ్ గెలిచి శ్రీలంకను క్లీన్ స్వీప్ చేయాలని భారత జట్టు చూస్తోంది.

India vs Sri Lanka 2nd Test 1st Day Devdutt Padikkal Scores Second Consecutive Test Century in Colombo

భారత్ తొలి ఇన్నింగ్స్‌కు శుభారంభం లభించలేదు. కేఎల్ రాహుల్ కేవలం 18 పరుగులకే లాహిరు కుమార బౌలింగ్‌లో ఔటయ్యాడు. మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ మంచి ఫామ్‌లో కనిపించినప్పటికీ.. అసిత ఫెర్నాండో అతని ఇన్నింగ్స్‌కు ముగింపు పలికాడు. యశస్వి 53 బంతుల్లో తొమ్మిది ఫోర్లతో 45 పరుగులు చేశాడు. ఆ తర్వాత కెప్టెన్ శుభ్‌మన్ గిల్, దేవదత్ పడిక్కల్ ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. వారు మూడో వికెట్‌కు 120 పరుగులు జోడించారు. అసిత ఫెర్నాండో శుభ్‌మన్‌ను అవుట్ చేసి ఈ భాగస్వామ్యాన్ని విడగొట్టాడు. శుభ్‌మన్ గిల్ 108 బంతుల్లో ఆరు ఫోర్లతో 50 పరుగులు చేశాడు. శుభ్‌మన్ ఔటయ్యే సమయానికి, భారత్ స్కోరు 186/3గా ఉంది.

IND vs SL: ఔట్ కాకుండానే పెవిలియన్‌కు రిషబ్ పంత్.. అసలేం జరిగింది?

Also Read

IND vs SL: ఔట్ కాకుండానే పెవిలియన్‌కు రిషబ్ పంత్.. అసలేం జరిగింది?

శుభ్‌మన్ గిల్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్ 3 పరుగుల వద్ద ఉన్నప్పుడు లాహిరు కుమార వేసిన షార్ట్ బంతికి మణికట్టుకు గాయమైంది. ఈ క్రమంలో రిషబ్ పంత్ తీవ్రమైన నొప్పితో రిటైర్డ్ హర్ట్ గా మైదానాన్ని వీడాల్సి రావడం భారత్ కు ఎదురు దెబ్బగా మారింది. ఆ తర్వాత వచ్చిన రవీంద్ర జడేజా సమయోచితంగా ఆడి 43 పరుగులు చేసి అసిత ఫెర్నాండో బౌలింగ్ లోనే ఔటయ్యాడు.

సారాంశ్ జైన్ అరంగేట్రం
ఈ మ్యాచ్ ద్వారా భారత్ తరఫున 33 ఏళ్ల ఆల్ రౌండర్ సారాంశ్ జైన్ కుల్దీప్ యాదవ్ స్థానంలో టెస్టుల్లోకి అరంగేట్రం చేయగా.. శ్రీలంక తరఫున కమిల్ మిషారా డెబ్యూ చేశాడు. ఇప్పటికే తొలి టెస్టులో గెలిచిన భారత్.. ఈ మ్యాచ్ లోనూ విజయం సాధించి శ్రీలంక వారి దేశంలోనే క్లీన్ స్వీప్ చేయాలని పట్టుదలతో ఉంది.

Story first published: Sunday, August 23, 2026, 18:17 [IST]
Other articles published on Aug 23, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+