Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నక్కతోక తొక్కిన ఇషాన్ కిషన్.. పట్టిందల్లా బంగారమే!

జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. కష్టాలతో పాటు సుఖాలు ఉంటాయి. అయితే కష్టాలకు బెదరకుండా పట్టుదలతో శ్రమిస్తే కోరుకున్న జీవితాన్ని పొందవచ్చని టీమిండియా స్టార్ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్‌ నిరూపించాడు. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని అనూహ్యంగా భారత జట్టులోకి పునరాగమనం చేసిన ఇషాన్ కిషాన్.. ఇప్పుడు తన ఆటతో భారత క్రికెట్‌ను శాసిస్తున్నాడు.

'పట్టిందల్లా బంగారమే'అనే రీతిలో ఆడిన ప్రతీ టోర్నీలోనూ.. ద్వైపాక్షిక సిరీస్‌ల్లోనూ పరుగుల మోత మోగిస్తున్నాడు. ఫార్మాట్ ఏదైనా తన విధ్వంసకర బ్యాటింగ్‌తో బౌలర్లను ఊచకోత కోస్తున్నాడు. ఇక తనకు తిరుగులేదన్న రీతిలో ఆధిపత్యం చెలాయిస్తూ ముందుకు సాగుతున్నాడు.

ఇషాన్ కిషన్ ఊచకోత.. 13 ఏళ్ల తర్వాత ఛాంపియన్‌గా ఈస్ట్ జోన్!

ఇషాన్ కిషన్ ఊచకోత.. 13 ఏళ్ల తర్వాత ఛాంపియన్‌గా ఈస్ట్ జోన్!

బీసీసీఐ చర్యలతో దూరమై..

రెండున్నరేళ్ల క్రితం మానసిక స్థితి సరిగ్గా లేదంటూ భారత జట్టు నుంచి స్వయంగా తప్పుకున్న ఇషాన్ కిషన్.. దేశవాళీ క్రికెట్ ఆడాలనే బీసీసీఐ ఆదేశాలను బేఖాతరు చేసి మరిన్ని ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. జట్టులో చోటుతో పాటు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌ను కూడా కోల్పోయాడు. ఐపీఎల్ 2025 సీజన్‌లోనూ తీవ్రంగా నిరాశపర్చాడు. సెంచరీతో టోర్నీని మొదలెట్టినా.. ఆ జోరును కొనసాగించలేకపోయాడు.

Ishan Kishan Road Back to the Top How Syed Mushtaq Ali Trophy Success Changed His Story

జార్ఖండ్‌కు టైటిల్ అందించి..

వరుస వైఫల్యాలు ఎదురైనా ఇషాన్ కిషన్ ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా రాణించి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. ఎన్నో ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ.. జార్ఖండ్ టీమ్‌కు తొలి సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ అందించాడు. ఈ టోర్నీ ఫైనల్లో విధ్వంసకర శతకంతో చెలరేగిన ఇషాన్ కిషన్.. 517 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచి ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు.

ఈ ప్రదర్శన‌కు ఫిదా అయినా సెలెక్టర్లు ప్రజ్ఞాన్ ఓజా, ఆర్‌పీ సింగ్ పట్టుబట్టి ఇషాన్ కిషన్‌ను భారత జట్టుకు ఎంపిక చేశారు. అప్పటి వరకు టీ20 ప్రపంచకప్ 2026 ప్రణాళికల్లోనే లేని ఇషాన్ కిషన్.. మెగా టోర్నీకి ముందు న్యూజిలాండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌కు ఎంపికయ్యాడు.

చరిత్ర సృష్టించిన ఇషాన్ కిషన్.. 39 ఏళ్ల రికార్డ్ బద్దలు!

Also Read

చరిత్ర సృష్టించిన ఇషాన్ కిషన్.. 39 ఏళ్ల రికార్డ్ బద్దలు!

అనూహ్యంగా అవకాశం అందుకొని..

ఈ సిరీస్‌లోనూ ఆరంభ మ్యాచ్‌లు బెంచ్‌కు పరిమితమైన ఇషాన్ కిషన్.. సంజూ శాంసన్ పేలవ ప్రదర్శనతో తుది జట్టులో చోటు దక్కించుకొని అసాధారణ ప్రదర్శన కనబర్చాడు. ఈ అద్వితీయమైన ప్రదర్శనతో మెగా టోర్నీలో కూడా చోటు దక్కించుకున్నాడు.

మెగా టోర్నీలో 9 మ్యాచ్‌ల్లో 35.22 స్ట్రైక్‌రేట్‌తో 317 పరుగులు చేసి భారత్ విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా పాకిస్థాన్‌పై 77 పరుగులు చేసి భారత్‌కు చిరస్మరణీయమైన విజయాన్ని అందించాడు. ఈ ప్రదర్శనతో భారత జట్టులో ఇషాన్ కిషన్ రెగ్యులర్ ఆటగాడిగా మారిపోయాడు.

దులీప్ ట్రోఫీలోనూ..

ఇటీవల ముగిసిన దులీప్ ట్రోఫీ 2026లోనూ ఈస్ట్ జోన్‌ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్ విధ్వంసకర ద్విశతకంతో చెలరేగి ఆ జట్టుకు 13 ఏళ్ల తర్వాత టైటిల్ అందించాడు. ఈ మ్యాచ్‌లో మొత్తం 350 పరుగులు చేసిన ఇషాన్ కిషన్.. దులీప్ ట్రోఫీ చరిత్రలోనే ఒకే మ్యాచ్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా 39 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు. మొత్తం 3 మ్యాచ్‌ల్లో 5 ఇన్నింగ్స్‌లు ఆడి 409 పరుగులు సాధించాడు.

అఫ్గాన్‌తో మూడు టీ20ల సిరీస్‌లోనూ నిలకడగా రాణించాడు. ఇప్పుడు ఆసియా గేమ్స్‌లో సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు. ఇషాన్ ఇదే జోరు కొనసాగిస్తే.. భవిష్యత్తులో టీమిండియా సారథ్య బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. అంతేకాకుండా వన్డే, టెస్ట్ టీమ్‌లో కూడా అతని స్థానం సుస్థిరం కానుంది.

Story first published: Monday, September 21, 2026, 11:50 [IST]
Other articles published on Sep 21, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+