Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs WI: ఉప్పల్ టీ20లో శ్రేయస్ అయ్యర్ భారత్ ఇన్నింగ్స్‌ను డిక్లెర్ చేసాడా?

వెస్టిండీస్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో టీమిండియాకు మరో పరాజయం ఎదురైంది. బుధవారం ఉప్పల్ స్టేడియంలో ఆసక్తికరంగా సాగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ 24 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో ఐదు టీ20ల సిరీస్‌లో 2 2తో సమంగా నిలిచింది.

షై హోప్‌ (50 బంతుల్లో 4 ఫోర్లు, 9 సిక్స్‌లతో 102 నాటౌట్) విధ్వంసకర శతకంతో భారత్ పతనాన్ని శాసించాడు. అయితే ఈ మ్యాచ్‌లో భారత్ తమ ఇన్నింగ్స్‌ను డిక్లెర్ చేసిందని సోషల్ మీడియా వేదికగా జోరుగా ప్రచారం సాగుతోంది.

బ్యాటింగ్ కాదు.. అక్కడే మ్యాచ్ చేజారింది: శ్రేయస్ అయ్యర్

బ్యాటింగ్ కాదు.. అక్కడే మ్యాచ్ చేజారింది: శ్రేయస్ అయ్యర్

బయటకు రావాలంటూ సైగలు..

248 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన భారత్ 19.3 ఓవర్లలో 223 పరుగులు మాత్రమే చేసింది. చేతిలో ఆఖరి వికెట్ ఉన్నా మరో మూడు బంతులు మిగిలి ఉండగానే తమ ఇన్నింగ్స్‌ను ముగించింది. ముఖ్యంగా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ క్రీజులో ఉన్న అర్ష్‌దీప్ సింగ్‌తో పాటు మయాంక్ యాదవ్‌లను బయటకు రావాలని సైగలు చేశాడు. దాంతో భారత్ తమ ఇన్నింగ్స్‌ను డిక్లెర్ చేసిందనే ప్రచారం జోరందుకుంది. కానీ ఐసీసీ రూల్స్ ప్రకారం అంతర్జాతీయ టీ20, వన్డేల్లో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసే అవకాశం ఉండదు.

Did Shreyas Iyer Declare India s Innings Against West Indies in Hyderabad Here s the Answer

అర్ష్‌దీప్ సింగ్ గాయపడటంతోనే..

షమార్ జోసెఫ్ వేసిన ఆఖరి ఓవర్‌లో అర్ష్‌దీప్ సింగ్ గాయపడటంతోనే అయ్యర్ వెనక్కి రమ్మన్నాడు. జోసెఫ్ బౌన్సర్ అర్ష్‌దీప్ సింగ్ భుజానికి బలంగా తాకింది. దాంతో అతను నొప్పితో విలవిలలాడాడు. తర్వాతి బంతిని కూడా జోసెఫ్ గాయపడిన భుజాన్నే లక్ష్యంగా చేసుకొని బౌలింగ్ చేసాడు. ఇది గమనించిన శ్రేయస్ అయ్యర్.. అప్పటికే ఓటమి ఖాయమవడంతో రిస్క్ ఎందుకని ఇద్దరి బౌలర్లను బయటకు రమ్మన్నాడు.

IND vs WI: ఆ ఒక్క ఓవరే టీమిండియా కొంపముంచింది!

Also Read

IND vs WI: ఆ ఒక్క ఓవరే టీమిండియా కొంపముంచింది!

శనివారం బెంగళూరు వేదికగా ఇరు జట్ల మధ్య సిరీస్ డిసైడర్ మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్‌కు బౌలర్లను ఫిట్‌గా ఉంచాలనే ఉద్దేశంతో శ్రేయస్ అయ్యర్.. మయాంక్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్‌ను బయటకు రమ్మన్నాడు. అర్ష్‌దీప్ సింగ్ రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరగడంతో భారత్ ఇన్నింగ్స్ ముగిసినట్లు అయ్యింది. అతని స్థానంలో ప్రత్యామ్నాయ బ్యాటర్ లేకపోవడంతో భారత్ ఆలౌట్ అయినట్లుగా పరిగణించారు. ఈ విషయాన్ని తప్పుగా అర్థం చేసుకున్న కొందరు భారత్ తమ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసిందనే ప్రచారానికి తెరలేపారు.

Story first published: Thursday, October 15, 2026, 12:05 [IST]
Other articles published on Oct 15, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+