IND vs WI: భారత్ ఓడినా.. అభిషేక్ శర్మ అదిరిపోయే రికార్డ్!
టీమిండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ చరిత్ర సృష్టించాడు. ఒకే క్యాలండర్ ఇయర్లో అత్యధిక సిక్స్‌లు బాదిన ఆటగాడిగా నిలిచాడు. ఈ క్రమంలో సూర్యకుమార్ యాదవ్ పేరిట ఉన్న ఈ రికార్డ్‌ను అధిగమించాడు. వెస్టిండీస్‌తో ఉప్పల్ వేదికగా జరిగిన నాలుగో టీ20లో షమార్ స్ప్రింగర్ వేసిన 9వ ఓవర్లో అభిషేక్ శర్మ సిక్స్ బాదడం ద్వారా ఈ ఫీట్ సాధించాడు.
ఈ ఏడాది అభిషేక్ శర్మ ఇప్పటి వరకు 69 సిక్స్‌లు బాదాడు. 2022లో సూర్యకుమార్ యాదవ్ 68 సిక్స్‌లతో టాప్‌లో ఉండగా.. అభిషేక్ శర్మ తాజాగా అధిగమించాడు. 2025లో అభిషేక్ శర్మ 54 సిక్స్‌లతో టాప్‌లో నిలవగా.. ఇషాన్ కిషన్ ఈ ఏడాది 52 సిక్స్‌లతో రేసులో ఉన్నాడు. షాహిబ్జాద ఫర్హాన్ 2025లో 45 సిక్స్‌లు బాది ఈ జాబితాలో కొనసాగుతున్నాడు.

అంతర్జాతీయ టీ20ల్లో ఇప్పటికే 100 సిక్స్‌ల మైలురాయి అందుకున్న అభిషేక్ శర్మ.. 68 ఇన్నింగ్స్‌ల్లో మొత్తం 102 సిక్స్‌లు బాదాడు. అయితే నాలుగో టీ20లో అభిషేక్ శర్మ తన జోరును కొనసాగించలేకపోయాడు. తన శైలికి భిన్నంగా ఆడిన అభిషేక్ 24 బంతుల్లో 29 పరుగులు చేసి వెనుదిరిగాడు.
ఈ మ్యాచ్‌లో భారత్ 24 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 247 పరుగుల భారీ స్కోర్ చేసింది. షై హోప్ (50 బంతుల్లో 4 ఫోర్లు, 9 సిక్స్‌లతో 102 నాటౌట్) విధ్వంసకర శతకంతో చెలరేగగా.. షెర్ఫెన్ రూథర్‌ఫోర్డ్(26 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 49 నాటౌట్), షిమ్రాన్ హెట్‌మైర్(12 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 33) దూకుడుగా ఆడారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, అక్షర్ పటేల్ తలో వికెట్ తీసారు. విండీస్ బ్యాటర్ల ధాటికి భారీగా పరుగులు సమర్పించుకున్నారు.
అనంతరం భారత్ 19.3 ఓవర్లలో 223 పరుగులకు ఆలౌటైంది. సంజూ శాంసన్(23 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 56) హాఫ్ సెంచరీతో రాణించినా.. తిలక్ వర్మ(25 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 43 నాటౌట్), నితీష్ కుమార్ రెడ్డి(20 బంతుల్లో ఫోర్, 4 సిక్స్‌లతో 41) పోరాడినా ఫలితం లేకపోయింది. కీమో పాల్(5/41) ఐదు వికెట్లతో భారత్ పతనాన్ని శాసించగా.. గుడకేష్ మోతీ(2/13) రెండు వికెట్లు పడగొట్టాడు. రొమారియో షెపెర్డ్, షమర్ స్ప్రింగర్ తలో వికెట్ తీసారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


