IND vs WI: శుభ్‌మన్ గిల్‌ను గాయపర్చిన సిరాజ్.. తొలి వన్డేకు కెప్టెన్ డౌట్!
వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్ ప్రారంభానికి ముందు టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. తిరువనంతపురం వేదికగా ఆదివారం జరగనున్న తొలి మ్యాచ్‌కు ముందు ప్రాక్టీస్ సెషన్‌లో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ గాయపడ్డాడు. నెట్స్‌లో బ్యాటింగ్ సాధన చేస్తుండగా.. పేసర్ మహమ్మద్ సిరాజ్ వేసిన బంతి శుభ్‌మన్ గిల్ కుడి మోచేతికి బలంగా తాకింది. దాంతో తీవ్ర నొప్పితో విలవిలాడిన గిల్.. ప్రాక్టీస్ ఆపేసాడు. ఫిజియోలు ప్రథమ చికిత్స అందించి మోచేతికి బ్యాండేజ్ వేసారు.
శుభ్‌మన్ గిల్ గాయం తీవ్రతపై స్పష్టత లేదు. సిరాజ్ వేసిన బంతి అనూహ్యంగా స్వింగ్ కావడంతో గిల్ అంచనా వేయలేకపోయాడు. దాంతో బంతి మోచేతికి బలంగా తాకింది. గాయం తీవ్రత ఎక్కువగా ఉంటే.. తొలి వన్డేకు గిల్ దూరమవుతాడు. చిన్నదయితే మాత్రం బరిలోకి దిగుతాడు. శనివారం సాయంత్రం నిర్వహించే మీడియా సమావేశంలో శుభ్‌మన్ గిల్ గాయంపై స్పష్టత రానుంది. గిల్ దూరమైతే వైస్ కెప్టెన్ హోదాలో కేఎల్ రాహుల్ జట్టును నడిపించనున్నాడు. యశస్వి జైస్వాల్ ఓపెనర్‌గా బరిలోకి దిగుతాడు.

ఈ మూడు వన్డేల సిరీస్ కోసం టీమిండియా పకడ్బందీగా సన్నదమవుతోంది. గురువారం నుంచే ప్రాక్టీస్ ప్రారంభించిన టీమిండియా.. నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తోంది. శుక్రవారం జరిగిన ప్రాక్టీస్ సెషన్‌లో గిల్‌కు గాయమైంది. గాయం తర్వాత అతను మళ్లీ బ్యాటింగ్ సాధన చేయలేదు. సహచర ఆటగాళ్లతో సరదాగా మాట్లాడుతూ కనిపించాడు. రోహిత్ శర్మ స్వయంగా వచ్చి శుభ్‌మన్ గిల్ గాయంపై ఆరా తీశారు.
గాయం ఏ మాత్రం సీరియస్‌గా ఉన్న గిల్‌కు రెస్ట్ ఇవ్వనున్నారు. ఇటీవలే టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్.. కెప్టెన్లందరూ తమ వ్యక్తిగత ప్రయోజనాల కంటే జట్టుకే ప్రాధాన్యత ఇస్తారని తెలిపాడు. అయితే శుభ్‌మన్ గిల్ గాయంపై బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టు :
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్, కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), ధ్రువ్ జురెల్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, మహమ్మద్ సిరాజ్, అకిబ్ నబీ, యశస్వి జైస్వాల్, నమన్ ధీర్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


